Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venus Retrograde: ఆగస్టు 7న తిరోగమనంలో శుక్రుడు.. ఈ మూడు రాశులవారికి 15 రోజుల పాటు అన్నీ కష్టాలే..

అయితే ఆగస్టు 7న కర్కాటక రాశిలో తిరోగమన స్థితిలో ప్రవేశిస్తారు. లగ్నము నుండి క్షీణస్థితికి వెళ్ళేటప్పుడు సూర్యుడు కూడా కర్కాటకరాశిలో ఉన్నందున శుక్రుడిని మధ్యమ అంటారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 8న నుంచి కొన్ని రాశులపై తీవ్ర ప్రభావం చూపించనుంది. ఈ సందర్భంలో శుభ కార్యాలు చేయకూడదు. దాదాపు పది రోజుల పాటు శుభకార్యాలకు దూరంగా ఉండాల్సి ఉంది.  అంతేకాదు శుక్రుడు తిరోగమనం వలన కొన్ని రాశులవారు తీవ్ర ఇబ్బందులు పడతారు. ఈ రోజు ఆగష్టు 8వ తేదీ నుంచి దాదాపు 15 రోజుల పాటు కష్టాలు, నష్టాలు ఎదుర్కోనున్న రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

Venus Retrograde: ఆగస్టు 7న తిరోగమనంలో శుక్రుడు.. ఈ మూడు రాశులవారికి 15 రోజుల పాటు అన్నీ కష్టాలే..
Venus
Follow us
Surya Kala

| Edited By: Ravi Kiran

Updated on: Aug 01, 2023 | 1:51 PM

నవ గ్రహాల్లో శుక్రుడు ఒక  గ్రహం.. రాక్షస గురువు.. ఇన్ని రోజులు సూటిగా పయనించిన శుక్రుడు ఇప్పుడు కాసేపు వక్రమార్గంలో నడవబోతున్నాడు. జ్యోతిషశాస్త్రం ప్రకారం శుక్రుడు సింహరాశిలో కుజుడు, బుధులతో ఉండి, ఆపై శుక్రుడు నీచ స్థానమైన కన్యారాశిలో ప్రవేశించనున్నాడు.  అయితే ఆగస్టు 7న కర్కాటక రాశిలో తిరోగమన స్థితిలో ప్రవేశిస్తారు. లగ్నము నుండి క్షీణస్థితికి వెళ్ళేటప్పుడు సూర్యుడు కూడా కర్కాటకరాశిలో ఉన్నందున శుక్రుడిని మధ్యమ అంటారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 8న నుంచి కొన్ని రాశులపై తీవ్ర ప్రభావం చూపించనుంది. ఈ సందర్భంలో శుభ కార్యాలు చేయకూడదు. దాదాపు పది రోజుల పాటు శుభకార్యాలకు దూరంగా ఉండాల్సి ఉంది.  అంతేకాదు శుక్రుడు తిరోగమనం వలన కొన్ని రాశులవారు తీవ్ర ఇబ్బందులు పడతారు. ఈ రోజు ఆగష్టు 8వ తేదీ నుంచి దాదాపు 15 రోజుల పాటు కష్టాలు, నష్టాలు ఎదుర్కోనున్న రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

ఏ రాశి వారికి కష్టాలు రానున్నాయంటే.. 

వృషభ రాశి: ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు కనుక శుక్రుడు తృతీయంలో ఉండడం వల్ల సోదరీమణుల మధ్య విభేదాలు రావచ్చు. సోదరుల సహకారం లభించదు. ఆర్ధిక కష్టాలు ఏర్పడవచ్చు.

తుల రాశి : ఈ రాశికి కూడా శుక్రుడు అధిపతి. దీంతో తులారాశిలోని దశమ స్థానంలో శుక్రుడు చేరుకోవడం వలన ఉద్యోగస్తులు తమ ఉద్యోగ విషయాల్లో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంది. అంతేకాదు ఈ రాశివారు స్త్రీ సంబంధం వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మకర రాశి: ఈ రాశి వారి జాతకంలో శుక్రుడు సప్తమంలో ఉండటం వల్ల వివాహానికి అనుకూలం కాదు. పెళ్లి ప్రయత్నాలు వాయిదా పడుతూ ఉంటాయి. పెళ్లి విషయంలో మనోవేదన ఏర్పడవచ్చు. ఈ రాశికి చెందిన  నటీనటులకు ఎదురుదెబ్బలు తగులుతాయి. అపకీర్తిని కూడా పొందవచ్చు.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)