Kuja Dosha: ఆ రాశుల వారికి కుజ దోషం.. దాంపత్య జీవితంలో కలతలకు ఛాన్స్..!
ఈ నెల(ఆగస్టు) 26న మిథున రాశిలో ప్రవేశిస్తున్న కుజుడి వల్ల ఆరు రాశులకు కుజ దోషం పడుతోంది. ఏ రాశికైనా కుజుడు 1,2,4,7,8,12 స్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు కుజ దోషం ఏర్పడుతుంది. ఈ కుజ దోషం వల్ల ఆర్థిక పరిస్థితి, కెరీర్ పరిస్థితి మెరుగ్గా ఉంటాయి కానీ, కుటుంబ జీవితంలోనూ, దాంపత్య జీవితంలోనూ కలతలు రేగుతాయి. జీవిత భాగస్వామితో అపార్థాలు చోటు చేసుకోవడం, వాదోపవాదాలకు దిగడం, ఒకరికొకరు దూరంగా ఉండవలసి రావడం, భార్యాభర్తల్లో ఒకరు దూర ప్రాంతానికి బదిలీ కావడం వంటివి జరిగే అవకాశం ఉంది.
ఈ నెల(ఆగస్టు) 26న మిథున రాశిలో ప్రవేశిస్తున్న కుజుడి వల్ల ఆరు రాశులకు కుజ దోషం పడుతోంది. ఏ రాశికైనా కుజుడు 1,2,4,7,8,12 స్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు కుజ దోషం ఏర్పడుతుంది. ఈ కుజ దోషం వల్ల ఆర్థిక పరిస్థితి, కెరీర్ పరిస్థితి మెరుగ్గా ఉంటాయి కానీ, కుటుంబ జీవితంలోనూ, దాంపత్య జీవితంలోనూ కలతలు రేగుతాయి. జీవిత భాగస్వామితో అపార్థాలు చోటు చేసుకోవడం, వాదోపవాదాలకు దిగడం, ఒకరికొకరు దూరంగా ఉండవలసి రావడం, భార్యాభర్తల్లో ఒకరు దూర ప్రాంతానికి బదిలీ కావడం వంటివి జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఇద్దరి మధ్యా ఎడబాటు చోటు చేసుకోవడం కుజ దోషం ఉద్దేశం. కుజుడు మిథునంలో అక్టోబర్ 20 వరకు ఉండడం వల్ల వృషభం, మిథునం, కర్కాటకం, వృశ్చికం, ధనుస్సు, మీన రాశుల వారికి ఈ దోషం కలుగుతోంది. కుజ దోష పరిహారానికి నిత్యం సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం మంచిది.
- వృషభం: ఈ రాశికి కుటుంబ స్థానంలో కుజ సంచారం వల్ల భార్యాభర్తల మధ్య అపార్థాలు, విభేదాలు చోటు చేసుకోవడం, వాదోపవాదాలు చెలరేగడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఈగో సమస్యలతో ఇబ్బంది పడడం జరుగుతుంది. కుటుంబ సభ్యుల మీద బాగా ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మాట తొందరపాటు వల్ల కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. మొత్తం మీద దాంపత్య సుఖం బాగా తగ్గే అవకాశం ఉంది.
- మిథునం: ఈ రాశిలో కుజ సంచారం వల్ల ఆధిపత్య ధోరణి వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ధన సంపాదనకు ప్రాముఖ్యం ఇవ్వడం వల్ల దాంపత్య జీవితం గడపడానికి ఎక్కువ సమయం ఉండక పోవచ్చు. కొద్దిగా అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం కూడా ఉంది. కుటుంబ జీవితంలో కూడా కొద్దిపాటి సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. కుటుంబ వ్యవహారాల్లో బంధువులు కల్పించుకోవడం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. ఓర్పు, సహనాలతో వ్యవహరించడం మంచిది.
- కర్కాటకం: ఈ రాశికి వ్యయ స్థానంలో కుజ సంచారం వల్ల భార్యాభర్తల్లో ఒకరు దూర ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తరచూ పర్యటనలు, ప్రయాణాలు చేయవలసిన అవ సరం కూడా ఏర్పడవచ్చు. దీనివల్ల దాంపత్య సుఖం బాగా తగ్గే అవకాశం ఉంటుంది. ఇక అనా రోగ్యాలకు గురికావడం కూడా ఎడబాటుకు దారితీసే అవకాశం ఉంది. ఈ రాశి వారికి వ్యయ స్థానంలో కుజ సంచారం వల్ల దాంపత్య జీవితంలో ప్రేమ, అన్యోన్యత పెరిగే అవకాశం కూడా ఉంటుంది.
- వృశ్చికం: ఈ రాశికి అష్టమ స్థానంలో కుజ సంచారం వల్ల అనారోగ్య కారణాలతో దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు తగ్గే అవకాశం ఉంది. భార్యాభర్తల్లో ఒకరు దూర ప్రాంతానికి బదిలీ కావడం, తప్పని సరి పరిస్థితుల్లో దూర ప్రాంతాలకు వెళ్లవలసి రావడమో జరగవచ్చు. కుజుడు రాశ్యధిపతి అయి నందువల్ల ఈ రాశివారికి పెద్దగా వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు ఉండకపోవచ్చు. అయితే, కీలక నిర్ణయాలు తీసుకునే ముందు జీవిత భాగస్వామితో సంప్రదించడం చాలా మంచిది.
- ధనుస్సు: ఈ రాశికి సప్తమంలో కుజ సంచారం వల్ల కొద్ది కాలం పాటు భార్యాభర్తల మధ్య ఎడబాటు తప్పక పోవచ్చు. సాధారణంగా వేర్వేరు ప్రదేశాల్లో ఉద్యోగాలు చేసే అవకాశం ఉంటుంది. ఇందులో ఒకరికి బదిలీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం మంచిది. కుటుంబంలో కొద్దిపాటి టెన్షన్లు, చికాకులు ఉండే సూచనలున్నాయి. కోపతాపాలు పెరగడం, తొందరపాటుతో వ్యవహరించడం, కుటుంబ ఖర్చులు పెరగడం వంటివి కూడా అన్యోన్యత మీద ప్రభావం చూపించవచ్చు.
- మీనం: ఈ రాశికి నాలుగవ స్థానంలో, అంటే సుఖ సంతోషాలకు సంబంధించిన స్థానంలో, కుజ ప్రవేశం వల్ల కుటుంబ సమస్యల వల్ల, ఆర్థిక సమస్యల వల్ల విభేదాలు, వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఎంత ఓర్పు, సహనాలతో వ్యవహరిస్తే అంత మంచిది. పిల్లల నుంచి కూడా సమస్యలు తలె త్తుతాయి. తొందరపడి మాట్లాడడం, వాదించడం వంటివి చోటు చేసుకుంటాయి. అహంకార ధోరణి, మానసిక ఒత్తిడి కారణంగా కూడా శృంగార జీవితాన్ని దూరం చేసుకునే అవకాశం ఉంటుంది.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..