Astrology: ఆ రాశుల వారికి గురువు చేయూత.. ధన, అధికార యోగాలకు ఛాన్స్..!

గత మే 3వ తేదీన వృషభ రాశిలో ప్రవేశించిన దగ్గర నుంచి ఏదో ఒక గ్రహంతో కలిసి ఉన్న గురువు ఈ నెల 26వ తేదీ నుంచి ఒంటరిగా సంచారం ప్రారంభించడం జరుగుతుంది. సాధా రణంగా గ్రహాలు ఇతర గ్రహాలతో కలిసినప్పుడు ఒక రకమైన ఫలితాలను, ఒంటరిగా ఉన్నప్పుడు మరో రకమైన ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది.

Astrology: ఆ రాశుల వారికి గురువు చేయూత.. ధన, అధికార యోగాలకు ఛాన్స్..!
Jupiter Impact
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 24, 2024 | 6:36 PM

గత మే 3వ తేదీన వృషభ రాశిలో ప్రవేశించిన దగ్గర నుంచి ఏదో ఒక గ్రహంతో కలిసి ఉన్న గురువు ఈ నెల 26వ తేదీ నుంచి ఒంటరిగా సంచారం ప్రారంభించడం జరుగుతుంది. సాధారణంగా గ్రహాలు ఇతర గ్రహాలతో కలిసినప్పుడు ఒక రకమైన ఫలితాలను, ఒంటరిగా ఉన్నప్పుడు మరో రకమైన ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ ఏడాది చివరి వరకూ గురువు వృషభ రాశిలో ఒంటరిగా ప్రయాణం చేస్తున్నందువల్ల కొన్ని రాశులకు తానివ్వ వలసిన శుభ ఫలితాలను, శుభ యోగాలను పూర్తి స్థాయిలో ఇవ్వడం జరుగుతుంది. మేషం, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశులకు ధన యోగాలు, అధికార యోగాలు పట్టడానికి అవకాశాలు మరింతగా మెరుగుపడ్డాయి.

  1. మేషం: ఈ రాశికి ధన స్థానంలో భాగ్యాధిపతిగా గురువు సంచారం వల్ల తప్పకుండా ధన యోగాలు పడ తాయి. అనేక విధాలుగా డబ్బు కలిసి వస్తుంది. రావలసిన డబ్బు అప్రయత్నంగా చేతికి అందు తుంది. ఉద్యోగంలో జీతాలు పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందడం వంటివి జరుగు తుంది. తండ్రి నుంచి ఆస్తిపాస్తులు లభిస్తాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవు తాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
  2. వృషభం: ఈ రాశిలో లాభాధిపతిగా గురువు సంచారం వల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆదా యపరంగానే కాక, ఆరోగ్యపరంగా కూడా మెరుగుదల కనిపిస్తుంది. ఆదాయం పెంచుకోవడానికి అనేక మార్గాలు, అనేక అవకాశాలు మీ ముందుకు వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు భారీ జీత భత్యాలతో కూడిన ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. అనారోగ్యాలకు సరైన చికిత్స లభిస్తుంది.
  3. కర్కాటకం: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన గురువు లాభ స్థానంలో సంచారం వల్ల పిత్రార్జితం సంక్రమిస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లవలసిన అవసరం ఏర్పడుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. గృహ, వాహన సౌకర్యాలు వృద్ధి చెందు తాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
  4. కన్య: ఈ రాశివారికి చతుర్థ, సప్తమాధిపతిగా గురువు భాగ్య స్థానంలో ఉన్నందువల్ల గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆస్తిపాస్తులు లభిస్తాయి. మాతృమూలక ధన లాభం ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి ఖాయం కావడం జరుగుతుంది. విదేశీ యానానికి అవకాశం ఉంది. సేవా కార్యక్రమాల ద్వారా పేరు ప్రఖ్యాతులు వృద్ధి చెందుతాయి.
  5. వృశ్చికం: ఈ రాశికి సప్తమ స్థానంలో ధన స్థానాధిపతి గురువు సంచారం వల్ల ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో హోదాతో పాటు జీతభత్యాలు కూడా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడి లాభాల బాట పట్టే అవకాశం ఉంది. మాటకు విలువ పెరుగుతుంది. మీ సలహాలు, సూచనల వల్ల ఉద్యోగ సంస్థ బాగా లభ్ధి పొందే అవకాశం ఉంటుంది.
  6. మకరం: ఈ రాశికి పంచమ స్థానంలో ధన కారకుడు గురువు సంచారం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభ సూచనలు కూడా ఉన్నాయి. ఉద్యోగంలో శక్తి సామ ర్థ్యాలు బాగా వెలుగులోకి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. సర్వత్రా మీ మాట చెల్లుబాటవుతుంది.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి