AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: మీన రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా..!

కుజ, బుధులు కలిసినప్పుడు జీవితంలో తప్పకుండా మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు పోరాటపటిమ, పట్టుదల, ఆత్మవిశ్వాసం వంటివి పెరుగుతాయి. జీవితం తీరును మార్చుకోవాలనే తపన పెరుగుతుంది. పోరాడైనా తమకు కావలసింది సాధించుకోవాలనే నిర్ణయానికి వస్తారు.

Zodiac Signs: మీన రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా..!
Zodiac Signs
TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Apr 25, 2024 | 6:12 PM

Share

కుజ, బుధులు కలిసినప్పుడు జీవితంలో తప్పకుండా మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు పోరాటపటిమ, పట్టుదల, ఆత్మవిశ్వాసం వంటివి పెరుగుతాయి. జీవితం తీరును మార్చుకోవాలనే తపన పెరుగుతుంది. పోరాడైనా తమకు కావలసింది సాధించుకోవాలనే నిర్ణయానికి వస్తారు. ఇప్పటి నుంచి మే 9 వరకు ఈ రెండు గ్రహాలు మీన రాశిలో కలిసి ఉంటున్నందువల్ల, వృషభం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకర రాశుల వారిలో పట్టుదల విపరీతంగా పెరుగుతుంది. ఆదాయ వృద్ధిని, ఆర్థిక సమస్యల పరిష్కారాన్ని, ఉద్యోగాల్లో పదోన్నతులను, వృత్తి, వ్యాపారాల్లో లాభాలను గట్టి ప్రయత్నంతో సాధించుకుంటారు.

  1. వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో కుజ, బుధుల యుతి ఏర్పడుతున్నందువల్ల ఈ రాశివారు ఉద్యోగంలో పదోన్నతిని, జీతభత్యాల్లో పెరుగుదలను అతి కష్టం మీద సాధించుకుంటారు. తమకు న్యాయంగా దక్కవలసిన వాటిని పట్టుదలగా దక్కించుకుంటారు. ఆస్తి వివాదాల్లో విజయం సాధిస్తారు. కోర్టు కేసును రాజీమార్గం ద్వారా పరిష్కరించుకుంటారు. ప్రణాళికాబద్ధంగా ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. రావలసిన డబ్బును రాబట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితిని బాగా చక్కబెట్టుకుంటారు.
  2. మిథునం: ఈ రాశివారికి దశమ స్థానంలో కుజ, బుధుల కలయిక వల్ల ఉద్యోగంలో ఎటువంటి సమస్యలున్నా పరిష్కరించుకోవడం జరుగుతుంది. ఒక వ్యూహం ప్రకారం అధికారులను తన వైపునకు తిప్పుకోవడం జరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఉద్యోగ పరంగా రావాల్సిన బకాయిలను రాబట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టి వాటిని లాభాల బాటపట్టిస్తారు. కుటుంబ పరిస్థితుల్ని, వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరిస్తారు.
  3. కర్కాటకం: ఈ రాశికి భాగ్య స్థానంలో కుజ, బుధుల సంచారం వల్ల విపరీత రాజయోగం పడుతుంది. విదేశీ యానానికి సంబంధించిన ఆటంకాలను తొలగించుకోవడం జరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగం సంపాదించుకునే అవకాశముంది. తీవ్రంగా కృషి చేసి పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజ యాలు సాధిస్తారు. ఆలోచనా విధానాన్ని, జీవన శైలిని మార్చుకుంటారు. ఆదాయ మార్గాలను పెంచుకుని, ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తారు. అనారోగ్యాన్ని తగ్గించుకుంటారు.
  4. తుల: ఈ రాశికి ఆరవ స్థానంలో కుజ, బుధుల కలయిక చోటు చేసుకోవడం వల్ల ఈ రాశివారు ఆస్తి వివాదాలు, కోర్టు కేసుల్లో తప్పకుండా విజయాలు సాధించే అవకాశం ఉంది. ఉద్యోగంలో చాలా కాలంగా ఆగి ఉన్న పదోన్నతి ఎట్టకేలకు లభిస్తుంది. పెండింగులో ఉన్న ఇంక్రిమెంట్లు కూడా భారీ స్థాయిలో అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. ప్రతిభా పాటవాలకు గుర్తింపు లభిస్తుంది. జీవితంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి.
  5. వృశ్చికం: ఈ రాశికి పంచమ స్థానంలో రాశ్యధిపతి కుజుడితో బుధుడు కలిసినందువల్ల, పట్టుదలగా తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడం జరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు అనేక ఆదాయ మార్గాలను చేపడతారు. ఉద్యోగంలో ఎంతో శ్రమకు ఓర్చి పదోన్నతి పొందుతారు. తమ ప్రతిభా పాటవాలకు పదును పెడతారు. సానుకూల దృక్పథంతో వ్యవహరించి కుటుంబ పరిస్థితులను చక్కదిద్దడంతో పాటు, ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలను కూడా పరిష్కరించుకుంటారు.
  6. మకరం: ఈ రాశికి తృతీయ స్థానంలో ఈ రెండు గ్రహాలు కలవడం ఆదాయ వృద్ధికి, ఆరోగ్యం మెరుగుదలకు ఎంతో తోడ్పడుతుంది. ఆదాయాన్ని పెంచుకుని జీవితాన్ని సౌకర్యవంతం, సుఖమయం చేసు కోవడానికి వీరు ఎక్కువగా శ్రమపడే అవకాశముంటుంది. కొత్త ఆదాయ ప్రయత్నాలు చేపడ తారు. ఆదాయం, పదోన్నతుల వంటి జీవిత లక్ష్యాలను సాధించుకోవడానికి ఉద్యోగాలు మారే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి.

NCP అధినేత శరద్ పవార్ విందుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
NCP అధినేత శరద్ పవార్ విందుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..