AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: ఈ రాశుల పిల్లలను తెగ బుజ్జగించాలి.. బాగా అల్లరి చేస్తుంటారు.. ఆ రాశులేంటో తెలుసా.?

సాధారణంగా పిల్లలను పెంచడమనేది అంత తేలికైన విషయం కాదు. వారికి అపారమైన ప్రేమను అందిస్తూనే.. సంరక్షణలో శ్రద్ద..

Zodiac Signs: ఈ రాశుల పిల్లలను తెగ బుజ్జగించాలి.. బాగా అల్లరి చేస్తుంటారు.. ఆ రాశులేంటో తెలుసా.?
Zodiac Signs
Rajitha Chanti
|

Updated on: Jan 20, 2022 | 11:19 AM

Share

సాధారణంగా పిల్లలను పెంచడమనేది అంత తేలికైన విషయం కాదు. వారికి అపారమైన ప్రేమను అందిస్తూనే.. సంరక్షణలో శ్రద్ద.. క్రమశిక్షణ.. వారి ప్రవర్తనలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల నుంచి పొందే ప్రేమ.. పిల్లలను మరింత గారబంగా మార్చేస్తుంది. అదే సమయంలో వారు క్రమశిక్షణ లేకుండా..అల్లరి చేయడం జరుగుతుంది. తల్లిదండ్రుల ప్రవర్తనను బట్టి పిల్లల ప్రవర్తన.. స్వభావం ఆధారపడి ఉంటుంది. పేరెంట్స్ అందించే అంతులేని ప్రేమ.. వారి క్రమశిక్షణను మర్చిపోయేలా చేస్తుంటాయి. అలాగని.. మితిమీరిన శ్రద్ద.. క్రమశిక్షణ వారి బాల్యంపై ప్రభావం చూపిస్తుంది. కొందరు పిల్లలకు.. వారి పేరెంట్స్ ఎక్కు వగా బుజ్జగించడం.. ప్రేమను చూపించడం ఇష్టం. తమ తల్లిదండ్రుల ప్రేమను ఎంతో ఆస్వాదిస్తుంటారు. అయితే కొన్ని రాశుల పరంగా పిల్లల స్వభావాలు ఉంటాయి. ఈ క్రమంలోనే కొన్ని రాశుల కలిగిన పిల్లలు ఎక్కువగా కేరింగ్ తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. మరీ రాశులెంటో తెలుసుకుందామా.

వృషభ రాశి.. ప్రేమ, అందం కలసి ఉండేదే వృషభం. ఈ రాశి వ్యక్తులు.. తాము చూసే ప్రతి వస్తువును ఎంతో ఇష్టపడుతుంటారు. అందుకోసం ఎంత ఖర్చుచేయడానికైనా సిద్ధపడిపోతుంటారు. ఈ రాశి పిల్లలు ప్రేమ, అప్యాయత.. సంరక్షణను అందరికంటే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వీరు ప్రేమ, అప్యాయత.. బహుమతులు ఇతరులకు ఇచ్చినట్లే వారి నుంచి వాటిని ఆశిస్తుంటారు.

తులా రాశి.. ఈరాశిని శుక్రుడు పాలిస్తాడు. ప్రేమ, అందం, విలాసానికి సంబంధించినవి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. తులారాశి పిల్లలు పరిశోధనాత్మకత.. మాట తీరులో ఎక్కువగా ఉత్సాహంగా ఉన్నప్పటికీ వీరు భౌతిక బహుమతులు.. శారీరక ప్రేమను సమానంగా చూస్తారు. తులారాశి పిల్లలకు ఎక్కువగా చిన్న చిన్న ప్రేమతో కూడిన పనులు చేస్తూ ఉండాలి.

సింహరాశి.. ఈ రాశి పిల్లలు ఎక్కువగా పాజిటివిటిని ఇష్టపడుతుంటారు. ఈ రాశి పిల్లలు తమకు ఇష్టమైనవారు.. తమ జీవితాలలో ఎంత ముఖ్యమైనవారనేది సంజ్ఞలను నమ్ముతుంటారు. అంతేకాకుండా.. వీరు ఎప్పుడూ తమకోసం చాలా ఎక్కువగా ఆశిస్తుంటారు. వీరి మనస్సు విశాలంగా ఉంటుంది. అలాగే చేసే ప్రతి పనిపై శ్రద్ద ఉంటుంది.

మీన రాశి.. ఈ రాశి చివరిది. అందుకే ఈ రాశి వారు పూర్తిగా సంపూర్ణంగా ఆశిస్తారు. మీనం అంటే నీటిలో నివసించేది. ఈ రాశి పిల్లలు చాలా సున్నితమైనవారు. ఎక్కువగా ప్రేమిస్తారు. షరతులు లేని ప్రేమను పంచడంలో వీరు ముందుంటారు. ఈ రాశి పిల్లలతో తల్లిదండ్రులు… మర్యాదపూర్వకంగా.. అప్యాయంగా ఉండేలా చూసుకోవాలి. వారిని ప్రేమతో అవసరమైన అన్ని అందించేలా చూసుకోవాలి.

కర్కాటక రాశి.. ఈ రాశి వారు చూడటానికి కఠినంగా కనిపించిన మనసు సున్నితంగా ఉంటుంది. ఈ రాశి పిల్లలు ప్రేమ, సంరక్షణ, పాంపరింగ్ అనుబంధంలో ఎక్కువగా ఉంటారు. ఈ రాశిని చంద్రుడు పాలిస్తాడు. వీరు ఎక్కువగా భావోద్వేగాలకు గురవుతుంటారు. అలాగే పాంపర్డ్ గా ఉండటానికి ఇష్టపడుతుంటారు. ఈరాశి పిల్లలు ఎక్కువగా తల్లితో కనెక్ట్ అయి ఉంటారు. వారి నుంచి అమితమైన ప్రేమను.. సంరక్షణను ఆశిస్తారు.

Also Read: Kriti Sanon : నేనేం ప్లాస్టిక్ బొమ్మను కాదు కదా.. బాడీషేమింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కృతి ..

Shah Rukh Khan: కింగ్ ఈజ్ బ్యాక్.. నాలుగు నెలల తర్వాత సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన షారుఖ్.. మొదటి పోస్ట్ ఏంటంటే..

Dhanush- Aishwarya: ధనుష్, ఐశ్వర్య విడాకులపై ధనుష్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు.. వారు మళ్లీ కలుస్తారంటూ..