Rare Yoga: గురు, బుధ గ్రహాల పరస్పర వీక్షణ.. ఆ రాశుల వారికి అరుదైన యోగం..!

గురువు జ్ఞానకారకుడు కాగా, బుధుడు బుద్ధి, విజ్ఞాన కారకుడు. అందువల్ల ఈ రెండు గ్రహాల కలయికకు, పరస్పర వీక్షణకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇదే సూత్రం గ్రహ సంచారానికి కూడా వర్తిస్తుంది. నవంబర్ 6 వరకు ఈ రెండు గ్రహాల మధ్య వీక్షణ ఏర్పడుతున్నందువల్ల, ఈ సమయంలో ఎటువంటి కార్యం తలపెట్టినా, ఎటువంటి ప్రయత్నం చేపట్టినా, ఎటువంటి ఆలోచన చేసినా తప్పకుండా అవి నెరవేరడం జరుగుతుంది. ఆదాయం లోనూ, అధికారంలోనూ ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి.

Rare Yoga: గురు, బుధ గ్రహాల పరస్పర వీక్షణ.. ఆ రాశుల వారికి అరుదైన యోగం..!
Very Rare Yoga
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Oct 23, 2023 | 6:38 AM

జాతక చక్రంలో గురు, బుధ గ్రహాలు పరస్పరం చూసుకున్నా, కలిసి ఉన్నా అది ఒక విధమైన భాగ్య యోగమని చెబుతారు. గురు, బుధులు పరస్పరం చూసుకోవడం వల్ల ఉద్యోగ, అధికార స్థాయిలోనే కాకుండా సామాజిక స్థాయిలో కూడా మంచి మార్పు వస్తుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఇందులో గురువు జ్ఞానకారకుడు కాగా, బుధుడు బుద్ధి, విజ్ఞాన కారకుడు. అందువల్ల ఈ రెండు గ్రహాల కలయికకు, పరస్పర వీక్షణకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇదే సూత్రం గ్రహ సంచారానికి కూడా వర్తిస్తుంది. నవంబర్ 6 వరకు ఈ రెండు గ్రహాల మధ్య వీక్షణ ఏర్పడుతున్నందువల్ల, ఈ సమయంలో ఎటువంటి కార్యం తలపెట్టినా, ఎటువంటి ప్రయత్నం చేపట్టినా, ఎటువంటి ఆలోచన చేసినా తప్పకుండా అవి నెరవేరడం జరుగుతుంది. ఆదాయం లోనూ, అధికారంలోనూ ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఏడు రాశులకు ఈ యోగం చాలావరకు వర్తిస్తుందని చెప్పవచ్చు. అవిః మేషం, మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, మకరం, మీనం.

  1. మేషం: ఈ రాశిలో ఉన్న గురువు సప్తమ కేంద్రంలో ఉన్న బుధువు పరస్పరం వీక్షించుకోవడం వల్ల వృత్తి, వ్యాపారాల పరంగా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. ఉద్యోగంలో కూడా అధికారులతో కొన్ని సమస్యలు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేస్తూనే అదనపు ఆదాయ మార్గంగా ఏదైనా వ్యాపారాన్ని ఎంచుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎంతో సమయస్ఫూర్తితో వ్యక్తిగత సమస్యలను కూడా పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది.
  2. మిథునం: ఈ రాశినాథుడైన బుధుడి మీద గురువు వీక్షణ పడడం చాలా మంచిది. ప్రతిభా పాటవాలు బాగా వికసిస్తాయి. ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకోగల సామర్థ్యం ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపా రాలు వృద్ధి చెందడం, విస్తరించడం వంటివి జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఆలోచనా స్థానం మీద దీని ప్రభావం పడుతున్నందువల్ల తప్పకుండా మీ ఆలోచనలు, అభిప్రాయాలు వృత్తి, ఉద్యో గాలను, కుటుంబ పరిస్థితులను సానుకూలంగా ప్రభావితం చేస్తాయి. సృజనాత్మక శక్తి పెరుగుతుంది.
  3. కర్కాటకం: ఈ రాశివారికి దశమ స్థానంలో సంచరిస్తున్న గురువుతో, చతుర్థ స్థానంలో ఉన్నబుధుడికి వీక్షణ ఏర్పడినందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా మంచి గుర్తింపు వస్తుంది. విద్యార్థులు చదువుల్లో ఘన విజయాలు సాధించడం, మేధావులుగా గుర్తింపు పొందడం కూడా జరుగుతుంది. ఉద్యోగా ల్లోనే కాక, సామాజికంగా కూడా హోదా పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. వృత్తి, ఉద్యోగ, చదువులపరంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది.
  4. తుల: ఈ రాశిలో ఉన్న బుధుడితో సప్తమంలో ఉన్న గురువుకు వీక్షణ ఏర్పడడం వల్ల వృత్తి, వ్యాపా రాలకు సంబంధించిన ఏ నిర్ణయమైనా, ఏ ప్రయత్నమైనా నూటికి నూరు పాళ్లు విజయవంతం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రాశివారికే కాకుండా, సతీమణికి కూడా పురోగతి ఉంటుంది. ఉద్యో గం చేయని వారికి కూడా మంచి అవకాశాలు అందే అవకాశం ఉంటుంది. ఏ రంగానికి చెందిన వారైనప్పటికీ తప్పకుండా పురోగతి ఉంటుంది. మనసులోని కోరిక నెరవేరడానికి అవకాశం ఉంది.
  5. ధనుస్సు: ఈ రాశివారికి పంచమ, లాభ స్థానాల్లో ఈ రెండు శుభ గ్రహాల వీక్షణ ఏర్పడినందువల్ల, వృత్తి, ఉద్యోగాలలో పురోగతికి సంబంధించిన ఆటంకాలు అప్రయత్నంగా తొలగిపోయే సూచనలు న్నాయి. సంతానం లేనివారికి సంతానం కలిగే అవకాశం ఉంది. ఏ ప్రయత్నమైనా, ఏ వ్యవహార మైనా కలిసి వస్తుంది. ముఖ్యంగా లాభ స్థానంపైన దీని ప్రభావం పడినందువల్ల ఆదాయం పెరగడం, ఆర్థిక స్థితి మెరుగుపడడంతో పాటు అన్ని రంగాల్లోనూ ఆశించిన పురోగతి ఉంటుంది.
  6. మకరం: ఈ రాశివారికి చతుర్థ, దశమ స్థానాల పైగా ఈ రెండు గ్రహాల ప్రభావం పడినందువల్ల గృహ, వాహన సౌకర్యాలు అభివృద్ధి చెందడం, సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడం వంటివి జరుగు తాయి. ఆస్తి వివాదం కొద్ది ప్రయత్నంతో పరిష్కారం కావడం, ఆస్తి విలువ పెరగడం, ఆస్తులు సంపాదించుకోవడం, ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభించడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి సామాజిక హోదా పెరిగే సూచనలు కూడా ఉన్నాయి.
  7. మీనం: ఈ రాశికి ధన స్థానం మీద ఈ గురు, బుధుల పరస్పర వీక్షణ ప్రభావం పడినందువల్ల, ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. అధికారులకు మీ సలహాలు, సూచనలు ఉపయోగపడతాయి. కొద్ది ప్రయత్నంతో ఆదాయ మార్గాలు, ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కుటుంబపరంగా శుభకార్యాలు జరుగుతాయి. దైవకార్యాలు పెరుగుతాయి.

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి