AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: వారు అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి.. 12 రాశుల వారికి సోమవారం రాశిఫలాలు

దిన ఫలాలు (అక్టోబర్ 23, 2023): మేష రాశి వారికి ఉద్యోగంలో ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. వృషభ రాశి వారు వృత్తి, ఉద్యోగాలలో కొత్త ఆలోచనలు, కొత్త ప్రణాళికలు ప్రవేశపెడతారు. మిథున రాశి వారు వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: వారు అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి.. 12 రాశుల వారికి సోమవారం రాశిఫలాలు
Horoscope Today 23rd October 2023
TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Oct 23, 2023 | 6:15 AM

Share

దిన ఫలాలు (అక్టోబర్ 23, 2023): మేష రాశి వారికి ఉద్యోగంలో ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. వృషభ రాశి వారు వృత్తి, ఉద్యోగాలలో కొత్త ఆలోచనలు, కొత్త ప్రణాళికలు ప్రవేశపెడతారు. మిథున రాశి వారు వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వ్యాపారంలో కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టి లబ్ధి పొందుతారు.ఉద్యోగంలో ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. వృత్తి జీవితంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. అనుకున్న సమయానికి పనులన్నీ పూర్తవుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. సమాజంలో ప్రముఖుల నుంచి ఆహ్వా నాలు అందుతాయి. కుటుంబ జీవితం ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిచిపోతుంది. సతీమణికి ఉద్యో గపరంగా పురోగతి ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్త అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాలలో కొత్త ఆలోచనలు, కొత్త ప్రణాళికలు ప్రవేశపెడతారు. వ్యాపారాలలో ఒక మోస్తరు లాభాలు కనిపిస్తాయి.నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. సద్వినియోగం చేసుకో వడం మంచిది. బంధువుల నుంచి ఆశించిన శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యంలో పాల్గొంటారు. శత్రు, రోగ, రుణ సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చి ఇబ్బంది పడతారు. ప్రస్తుతానికి ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది కానీ, అనవసర ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో అవరోధాలున్నప్పటికీ, పట్టుదలగా వాటిని పూర్తి చేస్తారు. బంధు మిత్రుల్లో కొందరికి మీ సలహాలు, సూచనలు బాగా ఉపకరిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, వ్యాపారాలలో అదనపు లాభాలు అందుకుం టారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి సంబంధమైన కొనుగోలు వ్యవహారాలు సఫలం అవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు, ఆదరణ పెరు గుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన శుభవార్త వింటారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో అధికారులతో సమస్యలు పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో ధైర్యంగా, ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుతారు. కృషికి తగిన ఫలితం అందుతుంది. అత్యవసర పనులను పూర్తి చేస్తారు. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలను పొందుతారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. పిల్లలతో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక లావాదేవీలకు, స్పెక్యులేషన్ కు దూరంగా ఉండడం మంచిది. స్నేహితుల వల్ల వృథా ఖర్చులు పెరుగుతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. అన్ని విషయాలలోనూ కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగులకు మీ నుంచి సహకారం లభిస్తుంది. లాభదాయక మైన స్నేహాలు ఏర్పడతాయి. కుటుంబ సమస్యల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆహార విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆదాయం బాగానే ఉన్నప్పటికీ, అవనసర ఖర్చులు తప్పకపోవచ్చు. ఆర్థికపరంగా ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో డిమాండ్ పెరుగుతుంది కానీ, ఆశించిన స్థాయిలో సంపాదన పెరగకపోవచ్చు. ఇంటా బయటా ఊహించని ఒత్తిడి ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారం ఉంటుంది. పిల్లలు విజయాలు సాధిస్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఒకేసారి అనేక వ్యవహారాలను చక్కబెట్టాలని ప్రయత్నిస్తారు. మానసిక ఒత్తిడి ఉంటుంది. ప్రణా ళికాబద్ధంగా వ్యవహరించడం మంచిది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. సన్నిహితులతో అపార్థాలు తలెత్తవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో పోటీ పెరిగే సూచనలు న్నాయి. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. నిరుద్యోగు లకు ఉద్యోగం రావచ్చు. పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యం పరవాలేదు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ పనితీరుకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో మీ ఆలోచనలు సత్ఫలితాలనిస్తాయి. ముఖ్యమైన పనులన్నీ లాభసాటిగా సాగుతాయి. బంధువుల శుభకార్యానికి సహాయ సహకారాలు అందిస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెంపొందుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. ఆదాయానికి లోటు ఉండదు కానీ, అనవసర ఖర్చులు పెరగడానికి అవకాశం ఉంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి జీవితంలో తిరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఇతరుల బాధ్యతలను మీద వేసుకుంటారు. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. బంధుమిత్రుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. సతీమణి, పిల్లలు వృద్ధిలోకి వస్తారు. విదేశీ యానానికి సంబంధించిన సమస్యలు తొలగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ముఖ్యమైన వ్యవహారాల్లో అప్రయత్నంగా విజయం సాధిస్తారు. స్థిరాస్తి సంబంధమైన వివాదం నుంచి బయటపడతారు. బంధుమిత్రులతో విందులో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారాలను చక్క దిద్దడంలో పెద్దల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో జీతభత్యాలకు సంబంధించి అధికారుల నుంచి శుభవార్త వింటారు. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. వ్యక్తిగత సమస్యలకు పరి ష్కారం దొరుకుతుంది. ఓర్పు, సహనాలతో వ్యవహరించడం మంచిది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

మీ ఆలోచనలు, నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి ఉంటుంది. వ్యాపారాల్లో అంచనాలను మించి లాభాలు గడిస్తారు. అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. సాధారణ సమస్యలను, బంధువుల విమర్శలను పట్టించుకోవద్దు. మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. పిల్లలతో కొద్దిగా సమస్యలు ఉన్నప్పటికీ, మొత్తం మీద కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది.