AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Today Horoscope: ఈ రాశుల వారికి ఈ రోజు తిరుగుండదు.. అనుకున్నది సాధిస్తారు

Today Horoscope: 25వ తేదీ రాశిఫలాల్లో ఎక్కువ రాశులకు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాలు, వ్యాపారాల్లో పురోగతి, ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. అలాగే వివాహ–ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు అందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొందరికి స్వల్ప ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ మొత్తం మీద రోజు అనుకూలంగా సాగనుంది.

Today Horoscope: ఈ రాశుల వారికి ఈ రోజు తిరుగుండదు.. అనుకున్నది సాధిస్తారు
Today Horoscope
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 26, 2026 | 6:35 AM

Share

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగుల పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు కూడా లభి స్తాయి. వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో అనుకూలంగా సాగిపోతాయి. ఇష్టమైన బంధు మిత్రుల్ని కలుసుకుంటారు. సేవా కార్యక్రమాలకు సహాయం చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబ జీవితం ప్రశాంతంగా, సామరస్యంగా సాగిపోతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. నిరు ద్యోగులకే కాకుండా, ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఆస్తి, ఆర్థిక వ్యవ హారాల్లో ఆచితూచి అడుగులు వేయడం మంచిది. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఇంటా బయటా అదనపు బాధ్యతలు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవ కాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగ వాతావరణం సానుకూలంగా సాగిపోతుంది. అధికారుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొం టారు. బంధువుల నంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ముఖ్యమైన వ్యవహారాలు విజయ వంతంగా పూర్తవుతాయి. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు అందుతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, వ్యాపారాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగంలో అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. పెండింగ్ పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. జీవిత భాగ స్వామితో కలిసి దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా ఇబ్బందులున్నప్పటికీ కొందరు మిత్రులకు సాయం చేస్తారు. కుటుంబం మీద ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం బాగానేఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు, వ్యవహారాలు కొంత ఉత్సాహం కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యాపారాలు సంతృప్తికరంగా పురోగమిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి శుభ వార్త వింటారు. బంధుమిత్రులతో కొద్దిగా అపార్థాలు చోటు చేసుకుంటాయి. తలపెట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి ఢోకా ఉండదు కానీ, ఖర్చులు బాగా తగ్గించుకోవాలి. ఎవరికీ హామీలు ఉండవద్దు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలను ప్రవేశపెట్టి లాభాలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు తగిన స్పందన లభిస్తుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశముంది. అదనపు ఆదాయ ప్రయత్నాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆరోగ్యానికి లోటుండదు. కొందరు బంధుమిత్రులకు సాయం చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరు గుతుంది. చిన్ననాటి మిత్రులతో సరదాగా గడుపుతారు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభి స్తుంది. మంచి స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. బంధువులతో జాగ్రత్తగా ఉండడం మంచిది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాల్లో ముఖ్యమైన లక్ష్యాలు, బాధ్యతలను సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా పురోగమిస్తాయి. ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. గట్టి పట్టుదలతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ప్రముఖుల నుంచి అనుకోకుండా గుర్తింపు, సత్కారాలు లభిస్తాయి. తోబుట్టువులతో లేదా బంధు వులతో వివాదాలు పూర్తిగా సద్దుమణుగుతాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో సంపాదన పెరుగుతుంది. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు.వృత్తి, వ్యాపారాల్లో ఒత్తిడి బాగా తగ్గుతుంది. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. బంధుమిత్రులు మీ సలహాలు పాటించి లాభం పొందు తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని విందు కార్యక్రమంలో పాల్గొంటారు. కొత్త ఉద్యోగ ప్రయ త్నాలు చాలావరకు కలిసి వస్తాయి. రావాల్సిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆదాయం బాగానే ఉంటుంది. ఇంటా బయటా ఒత్తిడి కారణంగా కొన్ని పనుల్ని వాయిదా వేస్తారు. బంధుమి త్రులతో అపార్థాలు చోటు చేసుకునే సూచనలున్నాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. పని భారం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని అవకాశాలు కలిసి వస్తాయి. ఆదాయ వృద్ధికి కొత్త ప్రయత్నాలు చేపడ తారు. ఇతరుల విషయాల్లో తలదూర్చకపోవడం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొం టారు. ముఖ్యమైన వ్యవహారాలు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో కలిసి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, వ్యాపారాల్లో కొన్ని ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో పని భారం పెరు గుతుంది. ఆదాయం బాగా వృద్ది చెందే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభ రణాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను వేగంగా పూర్తి చేస్తారు. బంధు వుల రాకపోకలుంటాయి. ఇంట్లో సామరస్య వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగులకు అవకా శాలు లభిస్తాయి. పరిచయస్థుల్లో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

Follow Us