AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: వీరికి ఒకట్రెండు శుభవార్తలు, లాభాలు.. శుక్రవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే

ఉద్యోగంలో సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆదాయానికి లోటుండదు కానీ, ఆర్థిక విష యాల్లో ఇతరులకు మాట ఇవ్వకపోవడం చాలా మంచిది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆ వివరాలు ఇలా..

Horoscope Today: వీరికి ఒకట్రెండు శుభవార్తలు, లాభాలు.. శుక్రవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే
Horoscope Today
TV9 Telugu Digital Desk
| Edited By: Ravi Kiran|

Updated on: Sep 12, 2025 | 5:30 AM

Share

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగ జీవితం ప్రశాంతంగా, సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. తలపెట్టిన ప్రతి పనినీ సకా లంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. తండ్రి వైపు నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. పిల్లలు చదువుల్లో మంచి ఫలితాలు గడిస్తారు. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులను మీ పని తీరుతో ఆకట్టుకుంటారు. వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. చాలా కాలంగా పీడిస్తున్న కొన్ని వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు వచ్చే సూచనలున్నాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగులు శ్రమకు తగ్గ ప్రతిఫలం అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలకుమించు తుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనుల్లో బంధుమిత్రుల నుంచి సహాయం లభిస్తుంది. ఆస్తి వివాదాల్లో రాజీ మార్గాలను అనుసరి స్తారు. సమాజంలో పలుకుబడి బాగా పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు విస్త రిస్తాయి. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో ఎవరికీ మాట ఇవ్వవద్దు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఏ ప్రయత్నం తలపెట్టినా అనుకూల ఫలితాలనిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారు మరింత మంచి ఉద్యోగంలోకి మారే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. తలపెట్టిన ప్రతి పని నెరవేరుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగుల సహాయంతో బాధ్యతలను పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు చిన్న ప్రయత్నంతో మంచి ఆఫర్లు అందుతాయి. స్వల్ప అనారోగ్యాలు ఇబ్బంది పెడతాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో జాగ్ర త్తగా ఉండడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక విషయాల్లో ఎవరినీ అతిగా నమ్మవద్దు. వృత్తి, ఉద్యోగాల్లో సమర్థతను నిరూపించుకుంటారు. వ్యాపారాల్లో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తకుండా చూసుకోవాలి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. శుభవార్తలు వింటారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయాలి. వృత్తి, వ్యాపారాల్లో పెద్దల సలహాలు తీసు కోవడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వృథా ఖర్చులు తగ్గించుకోవడం ఉత్తమం. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరగడం వల్ల కొద్దిగా విశ్రాంతి లోపిస్తుంది. గతంలో మీ నుంచి ఆర్థిక సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకోని అడ్డంకులు ఎదురవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. పెండింగ్ పనులు, ముఖ్యమైన వ్యవహారా లన్నీ తేలికగా పూర్తవుతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. అనారోగ్యం నుంచి ఉపశ మనం పొందుతారు. జీవిత భాగస్వామితో వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వ్యవహా రాల్లో లాభాలు పొందుతారు. మిత్రులకు సహాయ సహకారాలు అందిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. నిరుద్యోగులు శుభవార్తలువింటారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన దాని కంటే ఎక్కువ రాబడి ఉంటుంది. ఆరోగ్య స్థితి బాగా మెరుగు పడుతుంది. అనుకోకుండా ఆదాయం కలిసి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్త వుతాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. కోర్టు కేసు ఒకటి అనుకూలంగా పరిష్కారమవుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులు ఆశించిన శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో వ్యూహాలు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపో తుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కొద్ది జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. కుటుంబ వాతావరణం ప్రశాం తంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఉద్యోగంలో ప్రాభవం పెరుగు తుంది. అధికారుల ఆదరణ లభిస్తుంది. బాకీలు, బకాయిలు వసూలవుతాయి. ఇతరుల వివాదాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. ఆకస్మిక ధన లాభం ఉంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగులకు సాఫీగా సాగిపోతుంది. అధికారుల సహాయ సహకారాలుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలం ఉంటుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రయాణాలు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. ఇంటా బయటా ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది కానీ, చేతిలో డబ్బు నిలవదు. రాజకీయ వర్గాలతో పరిచయాలు పెరుగుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆదాయానికి లోటుండదు కానీ, ఆర్థిక విషయాల్లో ఇతరులకు మాట ఇవ్వకపోవడం చాలా మంచిది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కారమయ్యే అవ కాశం ఉంది.  కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఆశించిన శుభవార్తలు వింటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా ఆశించిన దాని కంటే ఎక్కువగా పురోగతి సాధిస్తారు. సోదరులతో ఆస్తి వివాదానికి సంబంధించి రాజీ మార్గం అనుసరిస్తారు. నిరు ద్యోగులకు కోరుకున్న కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి దైవకా ర్యాల్లో పాల్గొంటారు. ఆశించిన శుభవార్తలు అందుతాయి. ఆర్థికంగా ఎవరికీ వాగ్దానాలు చేయ వద్దు.

ఉన్నది పోయే.. ఉంచుకున్నది పోయే.. పాపం.! ఈ ఎస్సై పరిస్థితి చూస్తే
ఉన్నది పోయే.. ఉంచుకున్నది పోయే.. పాపం.! ఈ ఎస్సై పరిస్థితి చూస్తే
39 మ్యాచ్‌ల్లో 1109 పరుగులు.. టీమిండియా నయా ఛేజింగ్ మాస్టర్
39 మ్యాచ్‌ల్లో 1109 పరుగులు.. టీమిండియా నయా ఛేజింగ్ మాస్టర్
చేపలతో వీటిని కలిపి తింటే మీ పని అయిపోయినట్లే.. ఈ సమస్యలు ఖాయం..
చేపలతో వీటిని కలిపి తింటే మీ పని అయిపోయినట్లే.. ఈ సమస్యలు ఖాయం..
హైదరాబాద్‌లో ఒక్క రూపాయికే కడుపు నిండా భోజనం.. ఎక్కడో తెలుసా..?
హైదరాబాద్‌లో ఒక్క రూపాయికే కడుపు నిండా భోజనం.. ఎక్కడో తెలుసా..?
మీ ఇంట్లో ఈ వస్తువులు ఉంటే.. ఎలాంటి వాస్తు దోషం అయినా ఇట్టే మాయం.
మీ ఇంట్లో ఈ వస్తువులు ఉంటే.. ఎలాంటి వాస్తు దోషం అయినా ఇట్టే మాయం.
న్యూస్‌ పేపర్లలో ఫుడ్ తినడంపై ఎక్స్‌పర్ట్స్ ఏం చెప్తున్నారు?
న్యూస్‌ పేపర్లలో ఫుడ్ తినడంపై ఎక్స్‌పర్ట్స్ ఏం చెప్తున్నారు?
బొద్దింకలతో జర భద్రం..! లేదంటే..భయంకరమైన రోగాలకు స్వాగతం
బొద్దింకలతో జర భద్రం..! లేదంటే..భయంకరమైన రోగాలకు స్వాగతం
జియో న్యూ ఇయర్‌ గిఫ్ట్‌.. చౌకగా 3 కొత్త ప్లాన్స్‌..బెనిఫిట్స్ ఇవే
జియో న్యూ ఇయర్‌ గిఫ్ట్‌.. చౌకగా 3 కొత్త ప్లాన్స్‌..బెనిఫిట్స్ ఇవే
ఈ భామ బయట గత్తరలేపిందిగా..
ఈ భామ బయట గత్తరలేపిందిగా..
మీ కాళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్‌ అవ్వండి..
మీ కాళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్‌ అవ్వండి..