AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashi Phalalu: గతం కంటే మెరుగ్గా ఆ రాశి వారి ఆర్థిక పరిస్థితి.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today (November 22, 2025): మేష రాశి వారికి ఆదాయం అనేక విధాలుగా వృద్ధి చెందుతుంది. బంధువులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. వృషభ రాశ వారికి వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. మిథున రాశ వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Rashi Phalalu: గతం కంటే మెరుగ్గా ఆ రాశి వారి ఆర్థిక పరిస్థితి.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Rashi Phalalu 22 November 2025
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 22, 2025 | 5:31 AM

Share

దిన ఫలాలు (నవంబర్ 22, 2025): మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఉద్యోగంలో బరువు బాధ్యతలతో పాటు ప్రాధాన్యం కూడా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. పిల్లలు పోటీ పరీక్షల్లోనూ, ఇంటర్వ్యూల్లోనూ విజయాలు సాధిస్తారు. ఆదాయం అనేక విధాలుగా వృద్ధి చెందుతుంది. బంధువులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. మీ ఆలోచనలు, ప్రయత్నాలను ఆచరణలో పెట్టడానికి ఇది మంచి సమయం. ఆర్థిక పరిస్థితి బాగా చక్కబడుతుంది. కుటుంబ బాధ్యతలు కొద్దిగా పెరుగుతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా కొనసాగుతుంది. కొద్ది శ్రమతో కొన్ని ముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తవుతాయి. ఇంటా బయటా అనుకూలతలు ఉంటాయి. మనసులోని కోరికల్లో ఒకటి రెండు అనుకోకుండా నెరవేరుతాయి. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన స్పందన లభిస్తుంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చు పెరుగు తుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆర్థికంగా రోజంతా అనుకూలంగా జరిగిపోతుంది. కొన్ని ముఖ్యమైన పనులు, వ్యవహారాలు అనుకున్నవి అనుకున్నట్టు పూర్తవుతాయి. వ్యక్తిగత జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. కుటుంబ సభ్యులతో కొద్దిగా పారదర్శకంగా వ్యవహరించడం మంచిది. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు లాభిస్తాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): వృత్తి, ఉద్యోగాల వాతావరణం బాగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. అనుకోకుండా కొన్ని మంచి పరిచయాలు ఏర్పడతాయి. పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సంతృప్తికరంగా నెరవేరుతాయి. కుటుంబ సభ్యులతో ఇష్టమైన ఆలయాలు సందర్శించే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): వృత్తి, ఉద్యోగాలు సాదాసీదాగా, నిలకడగా సాగిపోతాయి. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. పిల్లలు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు విజయం సాధించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి పరవాలేదనిపిస్తుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. బంధువులకు అండగా ఉంటారు. కుటుంబానికి సంబంధించి ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఉద్యోగంలో కొద్దిగా పని ఒత్తిడి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. కుటుంబ జీవితం ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితులు బాగా మెరుగ్గా ఉంటాయి. ఇంటా బయటా చిన్నపాటి సమస్యలున్నా వాటిని తేలికగా అధిగమిస్తారు. జీవిత భాగస్వామి అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, కుటుంబ ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): రోజంతా చాలావరకు హ్యాపీగా గడిచిపోతుంది. ఉద్యోగ జీవితం ఆశాజనకంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు. ఆర్థిక సమస్యల ఒత్తిడి చాలావరకు తగ్గుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడడానికి కొత్త ప్రయత్నాలు చేపడతారు. కొద్దిపాటి శ్రమతో ఒకటి రెండు ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉత్సాహంగా ముందుకు సాగుతారు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశముంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ముఖ్యమైన వ్యవహారాలను చాలావరకు పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఒక వ్యక్తిగత సమస్యను కొద్ది ప్రయత్నంతో పరిష్కరించుకుంటారు. సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు నిలకడగా ఉంటాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. ఉద్యోగులకు ఆర్థికంగా కూడా ఊహించని అదృష్టం పడు తుంది. అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నమైనా సఫలం అవు తుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా అండగా నిలబడతారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ, సకాలంలో, సంతృప్తికరంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. వ్యాపారాల్లో కూడా అంచనాలను అందుకుంటారు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఆర్థిక పరి స్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. మిత్రుల నుంచి ఆర్థిక సహాయం కోసం ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు తేలికగా పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు బాగా మెరుగ్గా ఉంటాయి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చ వద్దు. సొంత వ్యవహారాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. పిల్లల నుంచి శుభవార్త అందుతుంది. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఆస్తి వ్యవహారాల్లో సానుకూలతలు కనిపిస్తాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఉద్యోగంలో అధికారుల సహాయంతో పదోన్నతులు సంపాదించే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపా రాలు చాలావరకు నిలకడగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగపరంగా రావాల్సిన బకాయీలు కూడా వసూలవుతాయి. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. సన్నిహితుల నుంచి అవసరమైన సహాయ సహ కారాలు అందుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

Follow Us