AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lucky Zodiacs: ఈ రాశుల వారితో చేతులు కలిపితే.. మీకు అదృష్టం తలుపు తట్టినట్టే..!

ఈ ఏడాదంతా కొన్ని రాశుల వారిని అదృష్టం అనేక విధాలుగా వరించబోతోంది. ఈ రాశుల వారితో భాగస్వామ్య వ్యాపారాలు చేసినా, సంబంధ బాంధవ్యాలు ఏర్పడినా, వీరితో పెళ్లి జరిగినా, ప్రేమలో పడినా తప్పకుండా పట్టిందల్లా బంగారం అవుతుంది. వారు కూడా అదృష్టవంతులు, భాగ్యవంతులు అవుతారు. వృషభం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి ఏడు గ్రహాల బలం తోడవుతున్నందువల్ల ఈ రాశులవారికి సన్నిహితులైన వారు కూడా బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 22, 2025 | 5:42 PM

Share
వృషభం: ఒక్క రాహు కేతువులు తప్ప ఈ రాశివారికి మిగిలిన గ్రహాలన్నీ అనుకూలంగా మారడం జరిగింది. ఫలితంగా వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది. విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా అను భవానికి వస్తాయి. వీరితో ప్రేమలో పడినా, పెళ్లి జరిగినా, వియ్యమందినా, భాగస్వాములైనా, పరిచయాలు పెరిగినా తప్పకుండా అదృష్టం పట్టే అవకాశం ఉంది. ఈ రాశివారిని లక్ష్మీదేవి గతంలో ఎన్నడూ లేనంతగా వరించబోతోంది. ఈ రాశివారు తప్పకుండా సంపన్నులు కావడం జరుగుతుంది.

1 / 6
కర్కాటకం: గురు బలంతో ఈ రాశికి దాదాపు అన్ని గ్రహాలు అనుకూలంగా మారుతున్నందువల్ల ఈ రాశి వారు ఏ ప్రయత్నం చేపట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిం చినా, పెళ్లి ప్రయత్నాలు సాగించినా, ఆదాయ వృద్ది ప్రయత్నాలు చేపట్టినా అంతిమ విజయం వీరిదే అవుతుంది. శత్రువులు, ప్రత్యర్థులు, పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. వీరి సారథ్యంలో వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది.

2 / 6
తుల: ఈ రాశికి రాశ్యధిపతి శుక్రుడితో సహా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశివారితో ఎవరైనా వ్యాపారాలు చేసినా, ఈ రాశివారి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినా, చివరికి ఈ రాశుల వారి సలహాలు, సూచనలు స్వీకరించినా వారు తప్పకుండా ఉచ్ఛ స్థితికి వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఈ రాశివారి సలహాలు, సూచనలతో అధికారులు బాగా లబ్ధి పొందుతారు. వీరి మధ్యవర్తిత్వంతో బంధువుల ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.

3 / 6
వృశ్చికం: రాశ్యధిపతి కుజుడితో సహా ఆరు గ్రహాలు ఈ రాశి మీద దృష్టి పెట్టినందువల్ల ఈ రాశివారు ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. వివిధ రకాల ప్రముఖులతో సన్నిహిత సంబంధాల వల్ల పలుకుబడి బాగా పెరుగుతుంది. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. వీరితో భాగస్వామ్య వ్యాపా రాలు చేపట్టినవారు తప్పకుండా పురోగతి చెందుతారు. వీరితో ప్రేమలోపడినా, వీరితో  పెళ్లి సంబం ధం కుదిరినా అదృష్టవంతులవుతారు. కొద్ది ప్రయత్నంతో వీరు అపర కుబేరులయ్యే అవకాశం ఉంది.

4 / 6
మకరం: రాశ్యధిపతి శనితో పాటు దాదాపు అన్ని గ్రహాలూ ఈ రాశికి అనుకూలంగా సంచారం చేస్తున్నందు వల్ల ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ రాశివారితో ఎటువంటి  సంబంధ బాంధవ్యాలు ఏర్పడినా వారు తప్పకుండా ఉచ్ఛ స్థితికి చేరుకుంటారు. ఈ రాశివారికి ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు లాభాల పంట పండిస్తాయి. ఏ వ్యాపారం చేపట్టినా విజయం సాధిస్తారు. వీరికి పట్టిన ధన యోగాలు, రాజయోగాలు ఇతరులకు కూడా కలిసి వస్తాయి.

5 / 6
మీనం: రాశ్యధిపతి గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడంతోపాటు ప్రధాన గ్రహాలన్నీ భాగ్య, దశమ స్థానాల్లో బలం పట్టి ఉన్నందు వల్ల వీరి దశ తిరుగుతుంది. సంపద వృద్ది చెందడం, అధికార యోగం పట్టడంతో పాటు ఈ రాశివారు ఒక సంస్థకు అధిపతి అయ్యే అవకాశం ఉంది. లక్ష్మీకటాక్షం ఎక్కువగా ఉన్నందువల్ల వీరు చేపట్టే ప్రతి ఆదాయ వృద్ధి ప్రయత్నమూ విజయవంతం అవుతుంది. ఈ రాశివారితో వ్యాపారాలు చేయడం, సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకోవడం చాలా మంచిది.

6 / 6