- Telugu News Photo Gallery Spiritual photos Mercury Venus Conjunction in Libra: Money Luck and Fortune for 6 Zodiac Signs
Dhana Yoga: బుధ, శుక్ర యుతి..ఆ రాశుల వారికి లక్ష్మీ యోగం పట్టబోతోంది! ఆకస్మిక ధనప్రాప్తి
జ్యోతిషశాస్త్రం ప్రకారం బుధ, శుక్రులు ఎప్పుడు కలిసినా కొన్ని రాశులవారికి ఏదో ఒక రూపంలో అదృష్టం కలుగుతుంది. ఈ నెల (నవంబర్) 23 నుంచి 28వ తేదీ వరకు ఈ రెండు గ్రహాల కలయిక తులా రాశిలో జరుగుతోంది. తులా రాశి శుక్రుడికి స్వస్థానం కాగా, బుధుడికి పరమ మిత్ర క్షేత్రం. తెలివితేటలకు కారకుడైన బుధుడు, సంపాదనకు కారకుడైన శుక్రుడు కలవడం వల్ల ధన యోగాలు పట్టే అవకాశం ఉంటుంది. మిథునం, కర్కాటకం, కన్య, తుల, ధనుస్సు, మకర రాశుల వారికి ఈ రెండు గ్రహాల యుతి వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందడం, సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం వంటివి జరిగే అవకాశం ఉంటుంది.
Updated on: Nov 21, 2025 | 8:41 PM

మిథునం: రాశ్యధిపతి బుధుడు పంచమ స్థానంలో శుక్రుడితో కలవడం వల్ల ఆదాయ వృద్దికి ఈ రాశివారు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. రావలసిన డబ్బును, బాకీలను, బకాయిలను పట్టు దలగా రాబట్టుకుంటారు. ఆస్తి వివాదాలను రాజీమార్గంలో పరిష్కరించుకుంటారు. షేర్లు, స్పెక్యు లేషన్లలో పెట్టుబడులు పెట్టి బాగా లబ్ధి పొందుతారు. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం, పెళ్లి కుదరడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం పెరుగుతుంది.

కర్కాటకం: ఈ రాశికి చతుర్థ స్థానంలో ఈ రెండు శుభ గ్రహాల యుతి వల్ల ఉద్యోగంలో ఉన్నత పదవి లభిస్తుంది. ప్రతిభకు, సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు బాగా డిమాండ్ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి.

కన్య: ఈ రాశికి ద్వితీయ స్థానంలో రాశ్యధిపతి బుధుడు ధన స్థానాధిపతి శుక్రుడితో యుతి చెందడం వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. ఆస్తిపాస్తుల విలువ అంచనాలకు మించి పెరుగుతుంది. ఆస్తి వివాదాలు, సమస్యలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. తల్లితండ్రుల నుంచి కూడా ఆస్తి లేదా సంపద లభిస్తుంది. గృహ, వాహన ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి.

తుల: ఈ రాశిలో రాశ్యధిపతి శుక్రుడు భాగ్యాధిపతి బుధుడిని కలవడం వల్ల ఒకటికి రెండుసార్లు ధన యోగాలు కలుగుతాయి. ఆర్థికంగా అనేక విధాలుగా కలిసి వస్తుంది. అనేక వైపుల నుంచి ఆదా యం లభిస్తుంది. ఉద్యోగంలో జీతభత్యాలతో పాటు ప్రాభవం కూడా బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాల పంట పండుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. కొద్ది ప్రయత్నంతో ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి.

ధనుస్సు: ఈ రాశికి లాభ స్థానంలో బుధ, శుక్రులు కలవడం వల్ల అనుకోకుండా ఆస్తుపాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందు తుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగంలో అంచనాలకు మించి జీత భత్యాలు బాగా వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి.

మకరం: ఈ రాశికి దశమ స్థానంలో బుధ, శుక్ర సంయోగం ఏర్పడడం వల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం పడుతుంది. ఊహించని విధంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ రాశివారికి రెండు మూడుసార్లు ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. లాభదాయక పరిచయాలు, లాభదాయక ఒప్పందాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది.



