AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Relationship Astrology: ఈ రాశుల వారికి ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకీల మోత!

కుజ, శుక్రులు ఎక్కడ కలిసినా కొన్ని రాశులకు ఆదాయం బాగా పెరగడం, ఉద్యోగంలో పదోన్నతులు కలగడం తప్పకుండా జరుగుతుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో విజయాలు సాధిస్తారు. సృజనాత్మక శక్తి, నైపుణ్యాలు పెరుగుతాయి. అయితే, దాంపత్య జీవితం మాత్రం అస్త వ్యస్తమవు తుంది. దంపతుల మధ్య చిటపటలు ఎక్కువవుతాయి. శృంగార సంబంధమైన కోరికలు శృతి మించుతాయి. ఈ నెల(నవంబర్) 26 నుంచి శుక్రుడు వృశ్చిక రాశిలో కుజుడిని కలవడం వల్ల వృషభం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చిక రాశుల వారికి ఈ సుఖ దుఃఖాలు డిసెంబర్ 7 వరకు తప్పక పోవచ్చు.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 21, 2025 | 8:08 PM

Share
వృషభం: ఈ రాశికి సప్తమ స్థానంలో రాశ్యధిపతి శుక్రుడు సప్తమాధిపతి కుజుడిని కలవడం వల్ల ఉద్యోగంలో ప్రాదాన్యం బాగా పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. నిరుద్యోగులకు అరుదైన ఆఫర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. అయితే, దాంపత్య జీవితం మాత్రం ఒత్తిడికి గురవుతుంది. జీవిత భాగస్వామి ఆధిపత్యం పెరుగుతుంది. తరచూ వాదోపవాలు, అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది.

1 / 5
కర్కాటకం: ఈ రాశికి పంచమ స్థానంలో కుజ, శుక్రుల యుతి వల్ల ఉద్యోగంలో సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. హోదా, జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. అయితే, దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు తగ్గే అవకాశం ఉంది. ఈగో సమస్యల వల్ల ఎడమొహం, పెడమొహంగా మారే అవకాశం ఉంది. మాట తొందరపాటు ఉంటుంది.

2 / 5
సింహం: ఈ రాశికి చతుర్థ స్థానంలో కుజ, శుక్రుల సంచారం వల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో స్థిరత్వం లభిస్తుంది. గృహ, వాహన యోగాలు పడతాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారమవుతుంది. అయితే, దాంపత్య జీవితంలో చిటపటలు ఎక్కువగా ఉంటాయి. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన సహకారం అందకపోవచ్చు.

3 / 5
తుల: ఈ రాశికి ద్వితీయ స్థానంలో రాశ్యధిపతి శుక్రుడు కుజుడితో కలవడం వల్ల ఆదాయానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయ వృద్ధికి ఏ ప్రయత్నం చేపట్టినా సఫలం అవుతుంది. ఇంటా బయటా మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో జీతభత్యాలు వృద్ది చెందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడికి ఇబ్బంది ఉండదు. అయితే, కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. దంపతుల మధ్య వాగ్వాదాలు, వివాదాలు, విభేదాలు తలెత్తే అవకాశం ఉంది.

4 / 5
వృశ్చికం: ఈ రాశిలో కుజ, శుక్రుల సంచారం వల్ల ఈ రాశివారికి ఇంటా బయటా ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. నైపుణ్యాలు, సృజనాత్మకత వృద్ధి చెందుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. అయితే, కుటుంబంలో మాత్రం ఈగో సమస్యలు విజృంభిస్తాయి. జీవిత భాగస్వామి ఆధిపత్యం చెలాయిస్తారు. మాటలు, చేతలు ఇబ్బంది కలిగిస్తాయి.

5 / 5
Follow Us
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్

అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..

అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం

ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!

టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు

ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!

ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్

కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే

ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?

సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం