Horoscope Today: వీరికి సుడి మాములుగా లేదు.. పట్టిందల్లా బంగారం.. శుక్రవారం రాశిఫలాలు ఇలా
సమయం బాగా అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటారు. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఈ రాశివారికి సమయం చాలా అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవు తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సాను కూల స్పందన లభిస్తుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరు గుతుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తులవారికి డిమాండ్, రాబడి వృద్ధి చెందుతాయి. వ్యాపా రాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గు ముఖం పడతాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడే అవకాశం ఉంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. బంధువుల నుంచి శుభ వార్తలు వింటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూల స్పందన లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూలంగా సాగిపో తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన పనులు కొద్ది శ్రమతో పూర్తవు తాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నమ్మకాన్ని, ఆదరాభిమానాల్ని చూరగొంటారు. వ్యాపారాల్లో ఊహించని స్థాయిలో లాభాలు ఆర్జిస్తారు. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. షేర్లు. స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. మిత్రుల సాయంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా సాగిపోతాయి. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు అనుకోకుండా పరిష్కారమవుతాయి. ఆదాయం బాగానే ఉంటుంది. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగు తుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా బాగా నష్టపోతారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ప్రతి వ్యవహారంలోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉండ వచ్చు. ఏ పనైనా శ్రమతో పూర్తవుతుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. వృథా ఖర్చుల్ని తగ్గించడం మంచిది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఉద్యోగంలో అధికారులు, సహోద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో స్వల్పంగా లాభాలు కలుగుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
కొద్ది ప్రయత్నంతో ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలను సునాయాసంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. సహోద్యోగుల నుంచి ఆశించిన సహకారం ఉంటుంది. వృత్తి జీవితంలో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ముఖ్యమైన ప్రయత్నాలన్నీ విజయవంతం అవు తాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తుల్లో ఉన్నవారికి బాగా డిమాండ్ ఏర్ప డుతుంది. వ్యాపారాల్లో కూడా ఆశించిన పురోగతి కనిపిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్లతో జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆదాయం పెరిగి, ఆర్థిక సమస్యలు సర్దుమణుగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ తప్పకుండా అందు తుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగ జీవితంలో సానుకూలతలు పెరుగుతాయి. అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించే అవ కాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి రాబడి పెరుగుతుంది. వ్యాపారాల్లో కార్యక లాపాలు బాగా వృద్ధి చెందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆదాయా నికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. తోబుట్టువులతో విభేదాలు తొలగిపోతాయి. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. జీతభత్యాలు ఎక్కువగా ఇచ్చే సంస్థలోకి మారే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులకు విదేశీ కంపెనీల నుంచి సైతం ఆఫర్లు వచ్చే సూచనలున్నాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆస్తి వ్యవహారం ఒకటి అను కూలంగా మారుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. పిల్లలు విజయాలు సాధిస్తారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ఆర్థికంగా నిలదొక్కుకుంటాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు చాలావరకు చక్కబడతాయి. గృహ, వాహన ప్రయత్నాల మీద దృష్టి పెడతారు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమయ్యే సూచన లున్నాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. సొంత పనుల మీద శ్రద్ద పెట్టడం మంచిది. ఉద్యోగ, పిళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
సమయం బాగా అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటారు. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. ఉద్యోగ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. అన్నదమ్ములతో ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగు తుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. తల్లితండుల జోక్యంతో తోడ్పాటుతో ఆస్తి వివాదం పరి ష్కారం అవుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం లభిస్తుంది. ఆర్థిక స్థిరత్వం, ఉద్యోగ స్థిరత్వం కలుగుతాయి. ఆదాయం పెరిగి, ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గిపో తాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి.



