AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మే 31 రాశిఫలాలు: ఆదాయం, ఉద్యోగం, వ్యాపారంలో ఆ రాశులకు అదృష్టం..!

మే 31, 2026 ఆదివారం రాశిఫలాల ప్రకారం మేష రాశి వారికి ఉద్యోగంలో శుభవార్తలు అందుతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగ స్థిరత్వం, వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తాయి. మిథున రాశి వారికి పనిభారం పెరిగినా గుర్తింపు, ప్రోత్సాహకాలు లభిస్తాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఈ రోజు గ్రహస్థితులు ఎలా ప్రభావం చూపనున్నాయో తెలుసుకోండి.

మే 31 రాశిఫలాలు: ఆదాయం, ఉద్యోగం, వ్యాపారంలో ఆ రాశులకు అదృష్టం..!
Rashifal In Telugu 31 May 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 31, 2026 | 5:45 AM

Share

దిన ఫలాలు (మే 31, 2026): మేష రాశి వారు ఉద్యోగ జీవితంలో ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండడం వల్ల విలాసాల మీద ఖర్చు పెరుగుతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం ఏర్పడుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులకు, శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో పనిభారం పెరిగినప్పటికీ ఆశించిన గుర్తింపు, ప్రోత్సాహకాలు లభిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

రోజంతా చాలావరకు అనుకూలంగా సాగిపోతుంది. ఉద్యోగ జీవితంలో ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టి లాభాలు ఆర్జిస్తారు. సర్వత్రా మాట చెల్లు బాటవుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండడం వల్ల విలాసాల మీద ఖర్చు పెరుగుతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశముంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒకరిద్దరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం ఏర్పడుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులకు, శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. వృత్తి జీవితంలో గుర్తింపు ఏర్పడుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. కొన్ని ముఖ్యమైన కార్యకలాపాల్ని సకాలంలో పూర్తి చేస్తారు. గతంలో మీ నుంచి ఆర్థికంగా సహాయం పొందినవారు ముఖం చాటేసే అవకాశం ఉంది. కొత్త ప్రయత్నాలు చేపడతారు. సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంతా మంచే జరుగుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో పనిభారం పెరిగినప్పటికీ ఆశించిన గుర్తింపు, ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృత్తి జీవితంలో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక లాభాలు అధికంగా ఉంటాయి. ముఖ్యమైన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. కొత్త ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. దూర ప్రాంతం నుంచి ఎదురు చూస్తున్న ఒక శుభ సమాచారం అందుతుంది. కుటుంబ ‍సభ్యుల నుంచి ఆశించిన సుఖ సంతోషాలు అందుతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాలు చాలావరకు సజావుగా సాగిపోతాయి. అధికారుల వల్ల కొద్దిగా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. మిత్రుల తోడ్పాటుతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేసుకుంటారు. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. కుటుంబంలో మధ్య మధ్య చికాకులు, ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. ఆదాయం కొద్దిగా వృద్ది చెందుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో కొత్త లక్ష్యాలు, బాద్యతలను పూర్తి చేయాల్సి వస్తుంది. అధికారులతో సామరస్యం పెరుగుతుంది. సహోద్యోగులతో సమస్యలు తలెత్తుతాయి. ఆదాయం అనుకూలంగా ఉంటుంది. బాగా ఆలోచించి ఖర్చు చేయడం మంచిది. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. పెండింగులో ఉన్న ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. వ్యక్తిగత, కుటుంబ సమస్యల్ని సమయస్ఫూర్తితో పరిష్కరించుకుంటారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. వృత్తి జీవితంలో కొద్దిగా ఒత్తిడి ఉండవచ్చు. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. ఆస్తి వ్యవహారం ఒకటి ఒక కొలిక్కి వస్తుంది. ఇల్లు గానీ, స్థలంగానీ కొనే విషయం ఆలోచిస్తారు. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద ఖర్చు చేస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు. కొందరు మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. సామాజిక సహాయ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తారు. కుటుంబపరంగా సంపాదన పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. తల్లితండ్రులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు, లక్ష్యాలు పెరిగే సూచనలున్నాయి. వ్యాపారాలు లాభసాటిగా పురో గమిస్తాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలకు ఆశించిన పరిష్కారం లభిస్తుంది. ఇతరుల పనుల కంటే సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆర్థిక ప్రయత్నాలు చాలావరకు లాభిస్తాయి. ముఖ్యమైన పనులు ఆలస్యం కావడం, శ్రమ, తిప్పట ఉండడం, తరచూ స్వల్ప అనారోగ్యాలకు గురి కావడం వంటివి జరుగుతాయి. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో పదోన్నతి కలిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు అమలు చేసి లాభాలు గడిస్తారు. కీలక విషయాల్లో గోచారం చాలావరకు అనుకూలంగా ఉంది. ఆదాయం పెరిగే సూచనలున్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి కొత్త ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు, సహోద్యోగులు ఎక్కువగా మీ మీద ఆధార పడడం జరుగుతుంది. వృత్తి జీవితంలో బాగా బిజీ అవుతారు. వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక విషయాలు బాగా అనుకూలంగా ఉంటాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాల వల్ల ఆర్థిక లాభాలు కలుగుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ఆదరణ, ప్రోత్సాహకాలు లభిస్తాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా కొనసాగుతాయి. ఆదాయం కొద్దిగా పెరుగుతుంది. ఖర్చుల్ని అదుపు చేస్తారు. సన్నిహితుల వల్ల కొద్దిగా నష్టపోయే అవకాశం ఉంది. ఎవరినీ తేలికగా నమ్మకపోవడం మంచిది. కొత్త ఉద్యోగావకాశాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో అశ్రద్ధ పనికి రాదు. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలకు విలువనివ్వడం మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో అటు అధికారులకు, ఇటు సహోద్యోగులకు సహాయంగా ఉంటారు. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారు బాగా బిజీ అయిపోతారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆదాయం, ఆరోగ్యాలు చాలావరకు నిలకడగా ఉంటాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. తోబుట్టువులతో వివాదాలు తొలగిపోయి సామరస్యం ఏర్పడుతుంది. కుటుంబ పెద్దల్లో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యంలో పాల్గొంటారు.

Follow Us