AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హార్దిక్ పాండ్యా కోసం తోపు ప్లేయర్‌ను వదులుకోవడానికి రాజస్థాన్ ఫిక్స్.. ముంబై కొత్త కెప్టెన్‌గా తెలుగబ్బాయ్..?

Mumbai Indians Rajasthan Royals Trading: ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ తీసుకోబోయే ఈ నిర్ణయం ఒక సంచలనమనే చెప్పాలి. హార్దిక్ పాండ్యాను వదులుకొని యశస్వి జైస్వాల్‌ను జట్టులోకి తెచ్చుకోవడం, తిలక్ వర్మకు కెప్టెన్సీ ఇవ్వడం లాంటి మార్పులు ముంబై జట్టుకు పూర్వ వైభవాన్ని తెస్తాయో లేదో చూడాలి. ఏదేమైనా ఈ భారీ ట్రేడింగ్ క్రికెట్ ప్రపంచంలో ఒక పెద్ద కుదుపుకు కారణం కానుంది.

హార్దిక్ పాండ్యా కోసం తోపు ప్లేయర్‌ను వదులుకోవడానికి రాజస్థాన్ ఫిక్స్.. ముంబై కొత్త కెప్టెన్‌గా తెలుగబ్బాయ్..?
Mumbai Indians Trade 2027 Plans
Venkata Chari
|

Updated on: Jun 23, 2026 | 7:30 AM

Share

Mumbai Indians Rajasthan Royals Trading: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత భారీ, ఊహించని ట్రేడింగ్‌కు తెరలేచింది. వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ, తమ జట్టు భవిష్యత్తును మార్చేందుకు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను వదిలేసి, రాజస్థాన్ రాయల్స్ విధ్వంసకర ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను జట్టులోకి తెచ్చుకునేందుకు చర్చలు జరుపుతోంది.

పాతాళానికి పడిపోయిన ముంబై.. హార్దిక్‌పై వేటు తప్పదా..?

గుజరాత్ టైటాన్స్ జట్టును ఛాంపియన్‌గా నిలిపి, వరుసగా రెండుసార్లు ఫైనల్‌కు చేర్చిన హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఎంతో నమ్మకంతో తిరిగి తమ జట్టులోకి తెచ్చుకుంది. కానీ, అతడి రాక ముంబై జట్టుకు అస్సలు కలిసిరాలేదు. హార్దిక్ సారథ్యంలో జట్టు ప్రదర్శన ఘోరంగా పడిపోయింది. 2026 ఐపీఎల్ సీజన్ ముంబైకి ఒక పీడకలలా మిగిలింది. ఆడిన 14 మ్యాచ్‌లలో కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే గెలిచి, పాయింట్ల పట్టికలో 9వ స్థానంతో ప్లేఆఫ్స్ రేసు నుంచి ఘోరంగా నిష్క్రమించింది. ఈ నేపథ్యంలోనే రాబోయే సీజన్ కంటే ముందే జట్టులో సమూల మార్పులు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది.

ఇది కూడా చదవండి: IND vs ENG: ఈ ముగ్గురు ఏం తప్పు చేశారయ్యా.. తోపులా దూసుకెళ్తున్నా, ఛీ కొడుతున్న బీసీసీఐ సెలెక్టర్లు..?

ఇవి కూడా చదవండి

ముంబై, రాజస్థాన్ మధ్య భారీ ట్రేడింగ్..

ప్రముఖ క్రీడా ఛానెల్ నివేదికల ప్రకారం, హార్దిక్ పాండ్యాను రాజస్థాన్ రాయల్స్‌కు ఇచ్చి, వారి నుంచి యువ సంచలనం యశస్వి జైస్వాల్‌ను ముంబై జట్టులోకి తీసుకునేందుకు ఇరు ఫ్రాంచైజీల మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నాయి. ట్రేడ్ విండో ద్వారా ఇద్దరు స్టార్ ఆటగాళ్లను పరస్పరం మార్చుకునేందుకు ఈ ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

రోహిత్ స్థానంలో జైస్వాల్.. భవిష్యత్తు ఓపెనర్‌గా..!

ముంబై ఇండియన్స్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఒక బలమైన వ్యూహం దాగి ఉంది. ముంబై ప్రస్తుత ఓపెనర్ రోహిత్ శర్మా కెరీర్ ముగింపు దశకు చేరుకుంది. దీంతో అతడి స్థానాన్ని భర్తీ చేయగల సమర్థుడైన భారతీయ ఓపెనర్ కోసం ముంబై వెతుకుతోంది. దేశవాళీ క్రికెట్‌లో ముంబై తరపున ఆడే యశస్వి జైస్వాల్ దీనికి సరైన జోడీ అని యాజమాన్యం భావిస్తోంది. రోహిత్ స్థానంలో జైస్వాల్‌ను ఓపెనర్‌గా బరిలోకి దించితే జట్టు బ్యాటింగ్ లైనప్ సుదీర్ఘ కాలం పాటు పటిష్టంగా ఉంటుందని ముంబై యోచిస్తోంది.

ఇది కూడా చదవండి: గంభీర్‌కు తలనొప్పిలా మారిన ముగ్గురు.. ప్రపంచకప్ బెర్త్ కోసం ఇలా కర్ఛీఫ్ వేశారేంటి..?

హార్దిక్ అవుట్.. కెప్టెన్‌గా తెలుగు కుర్రాడు తిలక్ వర్మ..?

హార్దిక్ పాండ్యాను కేవలం ఆటగాడిగా జట్టులో ఉంచుకోవడం ముంబైకి ఆర్థికంగా, వ్యూహాత్మకంగా సాధ్యం కావడం లేదు. అతడి కెప్టెన్సీ ఫ్లాప్ అవ్వడమే కాకుండా, ఆటగాడిగానూ పెద్దగా రాణించలేకపోయాడు. అందుకే అతడిని వదులుకొని, జట్టు సారథ్య బాధ్యతలను తెలుగు యువ క్రికెటర్ తిలక్ వర్మాకు అప్పగించాలని ముంబై యాజమాన్యం తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. తిలక్ వర్మకు కెప్టెన్సీ ఇస్తే జట్టులో కొత్త ఉత్సాహం వస్తుందని భావిస్తున్నారు. ఈ వార్తలను బట్టి చూస్తే, రాబోయే ఐపీఎల్‌లో ముంబై సరికొత్త రూపంలో బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us