AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకరిద్దరు కాదు షేర్‌ఖాన్.. ఆరో నంబర్ దాకా యమగండాలే.. ఐర్లాండ్‌తో తలపడే భారత్ విధ్వంసక జట్టు ఇదే?

India Playing XI vs Ireland: యువ ఆటగాళ్ల జోరు, కొత్త కెప్టెన్ జోష్‌తో ఉన్న భారత్.. ఐర్లాండ్‌పై ఘనవిజయంతో సిరీస్‌ను ప్రారంభించాలని పట్టుదలగా ఉంది. ముఖ్యంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం మ్యాచ్‌లో ఎలాంటి విన్యాసాలు చేస్తాడో చూడాలని క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఒకరిద్దరు కాదు షేర్‌ఖాన్.. ఆరో నంబర్ దాకా యమగండాలే.. ఐర్లాండ్‌తో తలపడే భారత్ విధ్వంసక జట్టు ఇదే?
Ind Vs Ire 1st T20i
Venkata Chari
|

Updated on: Jun 22, 2026 | 4:47 PM

Share

India Playing XI vs Ireland: అఫ్గానిస్థాన్‌పై స్వదేశంలో ఏకపక్ష విజయాలతో సత్తా చాటిన టీమిండియా.. ఇప్పుడు విదేశీ గడ్డపై సరికొత్త సవాలుకు సిద్ధమైంది. జూన్ 26 నుంచి బెల్‌ఫాస్ట్ వేదికగా ఐర్లాండ్‌తో జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌తో ఈ పర్యటన ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ద్వారా కొత్త కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ బాధ్యతలు చేపట్టనుండటంతో తుది జట్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఐర్లాండ్ వేదికగా సరికొత్త పోరు.. శ్రేయస్ అయ్యర్‌కు అగ్నిపరీక్ష..

స్వదేశంలో అఫ్గానిస్థాన్‌తో జరిగిన టెస్ట్, వన్డే సిరీస్‌లలో భారత్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ప్రత్యర్థి జట్టు నుంచి గట్టి పోటీ లేకపోవడంతో అన్ని మ్యాచ్‌లను భారత్ వన్‌సైడ్ చేసింది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. జూన్ ఆఖరి వారంలో ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్, ఆ తర్వాత జూలైలో ఇంగ్లాండ్ పర్యటన ఉండటంతో టీమిండియాకు అసలైన పరీక్ష ఎదురుకానుంది. ముఖ్యంగా అంతర్జాతీయ టీ20ల్లో భారత్‌కు తొలిసారి సారథ్యం వహిస్తున్న శ్రేయస్ అయ్యర్‌కు ఈ సిరీస్ అత్యంత కీలకంగా మారింది. యువ రక్తం, అనుభవజ్ఞుల కలయికతో ఐర్లాండ్‌ను వారి సొంత గడ్డపై ఢీకొట్టేందుకు కెప్టెన్ వ్యూహాలు రచిస్తున్నారు.

15 ఏళ్ల వండర్ కిడ్ ఎంట్రీ.. సంచలన ఓపెనింగ్ జోడీ..!

ఈ సిరీస్‌లో అందరి కళ్ళు 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే ఉన్నాయి. ఐపీఎల్ 2026లో ఆరెంజ్ క్యాప్ సాధించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన వైభవ్.. ఇటీవలే శ్రీలంక-ఎ జట్టుతో జరిగిన ట్రై సిరీస్ ఫైనల్‌లో కేవలం 29 బంతుల్లోనే 94 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఇందులో కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కును అందుకోవడం విశేషం. ఈ అద్భుత ఫామ్ నేపథ్యంలో తొలి టీ20లోనే వైభవ్ అంతర్జాతీయ అరంగేట్రం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. దూకుడుగా ఆడే అభిషేక్ శర్మతో కలిసి వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. ఈ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ ప్రత్యర్థి బౌలర్లకు పీడకలగా మారడం ఖాయం. ఇక నయా రన్ మెషీన్ సంజూ శాంసన్ ఈ మ్యాచ్‌లో కీలకమైన మూడో స్థానంలో బరిలోకి దిగనున్నాడు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: గంభీర్‌కు తలనొప్పిలా మారిన ముగ్గురు.. ప్రపంచకప్ బెర్త్ కోసం ఇలా కర్ఛీఫ్ వేశారేంటి..?

బలిష్టమైన మిడిలార్డర్.. ముగ్గురు ఆల్‌రౌండర్లతో పటిష్టంగా భారత్..

వికెట్ కీపర్ బ్యాటర్ ఈషాన్ కిషన్ ఈ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో ఆడే అవకాశం ఉంది. సాధారణంగా టాప్ ఆర్డర్‌లో ఆడే ఈషాన్.. శాంసన్ కోసం తన స్థానాన్ని త్యాగం చేయాల్సి వస్తోంది. ఐదో స్థానంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్వయంగా బ్యాటింగ్‌కు రానున్నాడు. మిడిలార్డర్‌ను మరింత బలోపేతం చేస్తూ జట్టులో ముగ్గురు నాణ్యమైన ఆల్‌రౌండర్లకు చోటు దక్కనుంది. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డితో పాటు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ తుది జట్టులో భాగం కానున్నారు. వీరి రాకతో భారత బ్యాటింగ్ లైన్అప్ లోతు పెరగడమే కాకుండా, కెప్టెన్‌కు అదనపు బౌలింగ్ ఆప్షన్లు లభిస్తాయి.

స్పిన్ మాయాజాలం లేదు.. పేస్ అటాక్‌పైనే భారం..

బెల్‌ఫాస్ట్ పిచ్ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా భారత్ ఈ మ్యాచ్‌లో స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకుండానే బరిలోకి దిగేలా కనిపిస్తోంది. స్పిన్ బాధ్యతలను ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ పంచుకోనున్నారు. ఇక పేస్ విభాగంలో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ హర్షదీప్ సింగ్ జట్టును ముందుండి నడిపించనున్నాడు. ఐపీఎల్ స్టార్ హర్షిత్ రాణాతో పాటు యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ ఈ మ్యాచ్‌లో పేస్ గుర్రాలుగా బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇది కూడా చదవండి: IND vs ENG: ఈ ముగ్గురు ఏం తప్పు చేశారయ్యా.. తోపులా దూసుకెళ్తున్నా, ఛీ కొడుతున్న బీసీసీఐ సెలెక్టర్లు..?

తొలి టీ20కి భారత సంభావ్య తుది జట్టు (Playing XI):

వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్, హర్షదీప్ సింగ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us