AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raja The Raja: మైత్రి మూవీస్ నుంచి మరో క్రేజీ మూవీ.. రాజా ది రాజా రిలీజ్ ఎప్పుడంటే

రుత్విక్, విశాఖ ధిమాన్ కలిసి నటిస్తున్న 'రాజా ది రాజా' జూలై 17న మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాను వృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై కె. నిహారికా దాసరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కె. శ్రీలతా రెడ్డి సమర్పిస్తున్నారు. 

Raja The Raja: మైత్రి మూవీస్ నుంచి మరో క్రేజీ మూవీ.. రాజా ది రాజా రిలీజ్ ఎప్పుడంటే
Raja The Raja
Rajeev Rayala
|

Updated on: Jun 23, 2026 | 6:41 AM

Share

యూత్‌ఫుల్ ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిన ‘రాజా ది రాజా’ చిత్రం మూవీ లవర్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేస్తోంది. రుత్విక్, విశాఖ ధీమన్ జంటగా నటిస్తున్న ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కు అనిల్ బోయిడపు దర్శకత్వం వహిస్తున్నారు. వృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై కె. నిహారికా దాసరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కె. శ్రీలతా రెడ్డి సమర్పిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం ఈ సినిమాను జూలై 17న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ముందుకు రావడం విశేషం. దీంతో సినిమా మరింత గ్రాండ్ గా ప్రేక్షకులను చేరుకునే అవకాశం లభించనుంది.

రిలీజ్ డేట్ పోస్టర్‌లో హీరో, హీరోయిన్‌ల మధ్య కెమిస్ట్రీతో పాటు వారి సరదా ప్రయాణాన్ని హైలైట్ చేశారు. కలర్ ఫుల్ విజువల్స్, ఆకట్టుకునే డిజైన్ చిత్రంలోని రొమాంటిక్ మూడ్‌ను ప్రజెంట్ చేస్తోంది. రుత్విక్, విశాఖ ధీమన్ ఉత్సాహంగా, ఎనర్జీతో కనిపిస్తున్నారు. వీరిద్దరి కెమిస్ట్రీ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా మారింది.ఈ చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. రవికిరణ్ బోయిడపు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, విజయ్ కుమార్ పసుపులేటి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

ఈ చిత్రంలో సాయికుమార్, డాక్టర్ నరేష్ విజయకృష్ణ, అవసరాల శ్రీనివాస్, విష్ణు ఓయి, పార్వతీశం, రాజశ్రీ నాయర్, రోహిణి, బద్రం, మైమ్ మధు, ఆనంద్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ వంటి ప్రముఖ పంపిణీ సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేయడం ట్రేడ్ వర్గాల్లో సినిమాపై పెరుగుతున్న నమ్మకాన్ని సూచిస్తోంది. విడుదల తేదీ ఖరారవడంతో పాటు ప్రమోషన్స్ కూడా వేగం పుంజుకున్నాయి. చిత్ర బృందం ప్రచారం ముమ్మరం చేయడానికి సిద్ధంగా ఉంది. ‘రాజా ది రాజా’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే రిఫ్రెషింగ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులని అలరించనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us