AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: వారు ఏ పని తలపెట్టినా విజయవంతం అవుతుంది.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (జూన్ 17, 2025): మేష రాశి వారికి ఈ రోజు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తయ్యే అవకాశముంది. వృషభ రాశి వారికి ఆదాయానికి లోటుండదు కానీ, వృథా ఖర్చులతో పాటు కుటుంబ ఖర్చులు కూడా పెరుగుతాయి. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉండే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: వారు ఏ పని తలపెట్టినా విజయవంతం అవుతుంది.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Horoscope Today 17 June 2025
TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Jun 17, 2025 | 5:31 AM

Share

దిన ఫలాలు (జూన్ 17, 2025): మేష రాశి వారికి ఈ రోజు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఆదాయానికి లోటుండదు కానీ, వృథా ఖర్చులతో పాటు కుటుంబ ఖర్చులు కూడా పెరుగుతాయి. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలన్నీ సునాయాసంగా పూర్తవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. నిరుద్యోగులకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. గృహ, వాహన ప్రయత్నాల మీద దృష్టి పెడతారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. కుటుంబ జీవితం చాలావరకు హ్యాపీగా సాగిపోతుంది. విద్యార్థులు చదువుల్లో పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిపాటి పురోగతి సాధిస్తారు. సహోద్యోగులతో అపార్థాలు తొలగిపోతాయి. వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆదాయానికి లోటుండదు కానీ, వృథా ఖర్చులతో పాటు కుటుంబ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు బాగా అనుకూలంగా ఉంటాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. వ్యాపారాలు అనుకూల ఫలితాలనిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలన్నీ సునాయాసంగా పూర్తవుతాయి. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. విద్యార్థులు చదువుల్లో పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

కొన్ని కష్టనష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఆదాయానికి లోటుండదు. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచి తూచి వ్యవహరించడం మంచిది. కుటుంబపరమైన ఒత్తిడి తప్పకపోవచ్చు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగ బాధ్యతల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు సానుకూలపడతాయి. వ్యక్తిగత, కుటుంబ సమస్యలు తగ్గుముఖం పట్టి, మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఆదాయం బాగానే ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగ జీవితంలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కొద్దిగా ఆదాయ వృద్ధికి అవకాశముంటుంది. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక సమస్యలు బాగా తగ్గే అవకాశం ఉంది. ఆస్తి వివాదాన్ని పరిష్కరించుకోవడం మీద దృష్టి పెడతారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించవచ్చు. విద్యార్థులకు కొద్దిగా శ్రమ తప్పదు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు బాగా అనుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. వృత్తి జీవితంలో రాబడి పెరగడమే తప్ప తరగడమంటూ ఉండదు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభించే అవకాశం ఉంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన శుభ వార్త అందుతుంది. విద్యార్థులు చదువుల్లో విజయాలు సాధిస్తారు. ప్రేమల్లో దూసుకుపోతారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో తప్పకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి జీవితంలో బాగా పురోగతి ఉంటుంది. వ్యాపారాల్లో అనేక విధాలుగా రాబడి పెరుగుతుంది. ఆదాయానికి లోటుండదు కానీ, వృథా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. ఆస్తి వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. విద్యార్థులకు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో చికాకులుంటాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది. జీతభత్యాల పెరుగుదలకు సంబంధించి శుభవార్త వింటారు. వృత్తి, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. ఏ పని తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యల ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగులకు, నిరుద్యోగుల విదేశాల నుంచి ఆశించిన ఆఫర్లు అందుతాయి. పరిచయస్థులలో పెళ్లి సంబంధం కుదురుతుంది. విద్యార్థులు తేలికగా పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆదాయం బాగా పెరుగుతుంది. ఆరోగ్యానికి కూడా ఇబ్బంది ఉండదు. ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా బయటపడతారు. వృత్తి, ఉద్యోగాల్లో హోదాలు పెరగవచ్చు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. తోబుట్టువులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభ వార్తలు వింటారు. విద్యార్థులు కొద్ది శ్రమతో విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో పని భారం, పని ఒత్తిడి బాగా పెరుగుతాయి. అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వ్యాపారాల్లో కొద్దిగా రాబడి పెరుగుతుంది. ప్రతి పనీ, ప్రతి ప్రయత్నమూ నిదానంగా పూర్తవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు అనుకూల ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగిపోతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు కొద్దిగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

సమస్యలు, ఒత్తిళ్లు, ఇబ్బందుల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది. అదృష్టం కలిసి వస్తుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో గుర్తింపు లభిస్తుంది. ఏ ప్రయత్నం చేసినా సఫలం అవుతుంది. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి శుభవార్త వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు చదువుల్లో బాగా రాణిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.

రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..
ఇంట్లోని పగిలిన ఇత్తడి విగ్రహాలను ఏం చేయాలి?
ఇంట్లోని పగిలిన ఇత్తడి విగ్రహాలను ఏం చేయాలి?
ఈ లక్షణాలు కనిపిస్తే కాలేయ క్యాన్సర్ ఉన్నట్లే.. జాగ్రత్తపడాలి
ఈ లక్షణాలు కనిపిస్తే కాలేయ క్యాన్సర్ ఉన్నట్లే.. జాగ్రత్తపడాలి