Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Today Horoscooe in Telugu (January 20, 2026): మేష రాశి వారికి ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అందుతాయి. వృషభ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు బాగా అనుకూలంగా సాగుతాయి. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్ల నుంచి చాలావరకు బయటపడతారు. మిథున రాశి వారికి ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. కొత్త ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

దిన ఫలాలు (జనవరి 20, 2026): మేష రాశి వారికి ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగే అవకాశముంది. వృషభ రాశి వారు ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్ల నుంచి చాలావరకు బయటపడే అవకాశముంది. మిథున రాశి వారికి ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి, ఉద్యోగాలలో కొత్త ప్రోత్సాహకాలను అందుకుంటారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. తోబుట్టువులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. దూర ప్రయాణాలలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యాపారాల్లో ఉన్న కొన్ని ప్రధానమైన అడ్డంకులను తొలగించుకుంటారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అందుతాయి. కుటుంబ జీవితం చాలావరకు హ్యాపీగా సాగిపోతుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగంలో సహచరుల బాధ్యతల్ని కూడా నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాల పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు బాగా అనుకూలంగా సాగుతాయి. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్ల నుంచి చాలావరకు బయటపడతారు. ఆస్తి వివాదాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. అదనపు ఆదాయానికి అవకాశముంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండాల్సిన అవ సరం ఉంది. దాంపత్య జీవితం మెరుగ్గా ఉంటుంది. ఇతరుల విషయాల్లో కల్పించుకోకపోవడం మంచిది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆర్థిక పరిస్థితి విషయంలో ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. కొత్త ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. చిన్ననాటి మిత్రులతో విందుల, వినోదాల్లో పాల్గొంటారు. ఆస్తి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగులు తమ ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఎటువంటి ప్రయత్నమైనా సఫలమవుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్నేహితుల విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండాల్సిన అవ సరం ఉంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఆశించిన శుభవార్తలు వింటారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది. డబ్బు నష్టపోయే అవకాశముంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. వృత్తి జీవితంలో ఏమాత్రం తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలు నిలకడగా, ఆశాజనకంగా పురోగమిస్తాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ప్రతి పనిలోనూ వ్యయ ప్రయాసలుంటాయి. చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. తలపెట్టిన పనుల్ని అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలకు అనుకోకుండా పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. కుటుంబసమేతంగా ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. ఆర్థిక ప్రయత్నాలు ఆశించిన దాని కంటే ఎక్కువగా సత్ఫలితాలనిస్తాయి. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. ఉద్యోగులు, నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందే అవకాశముంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగా కుటుంబ ఖర్చులు కూడా పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని ధన లాభం ఉంటుంది. వృత్తి జీవితం బాగా బిజీగా, లాభదాయకంగా సాగిపోతుంది. వ్యాపారాలలో కొన్ని మార్పులు చేపట్టి ఆర్థికంగా లబ్ధి పొందుతారు. ప్రయాణాల వల్ల ప్రయోజనాలు కలుగుతాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో పనిభారం ఉంటుంది. అధికారులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలను పట్టుదలగా వసూలు చేస్తారు. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. కొన్ని ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు కూడా తీసుకోవడం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు అందివస్తాయి. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాడ 1)
వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల, సంతృప్తికర వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు సాఫీగా, ఉత్సాహంగా సాగిపోతాయి. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇతరులకు సహాయం చేయడం జరుగుతుంది. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగ జీవితంలో పని భారం పెరిగే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో కూడా కొద్దిగా ఒత్తిడి, శ్రమ తప్పకపోవచ్చు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. అనుకున్న పనులు అనుకు న్నట్టు పూర్తవుతాయి. మనసులోని కోరికలు కొన్ని నెరవేరుతాయి. ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం లభిస్తుంది. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. సన్నిహితులతో వాదోపవాదాలకు దిగవద్దు. కొత్త వ్యక్తులతో స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. ఆరోగ్యం పరవాలేదు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
రోజంతా మీరు ఆశించిన విధంగా గడిచిపోతుంది. వృత్తి, ఉద్యోగాల మీద శ్రద్ధ పెంచుతారు. వ్యాపారాల్లో కార్యకలాపాలు పెరుగుతాయి. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనుల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలను చక్కబెడతారు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలను పట్టుదలగా కొనసాగిస్తారు. ప్రయాణాల్లో, ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
రోజంగా హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. ముఖ్యంగా ఆరోగ్యానికి, ఆదాయానికి ఇబ్బంది ఉండదు. వృత్తి, ఉద్యోగాలు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆర్థిక పరి స్థితి బాగా మెరుగుపడుతుంది. ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అంది వస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్య, ఆర్థిక సమస్యల నుంచి అనుకోకుండా ఉపశమనం లభిస్తుంది. బంధుమిత్రులతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త పడడం మంచిది.