Horoscope Today: వీరు ఉద్యోగంలో ఉన్నతిని సాధిస్తారు.. సోమవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?

ఈ రాశివారు ఉద్యోగంలో ఉన్నతిని సాధిస్తారు. తోటి వారి సహకారంతో సత్ఫలితాలు పొందుతారు. మొహమాటాన్ని దరిచేరనీయకండి. అనవరసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. లక్ష్మీనామాన్ని జపిస్తే మంచిది.

Horoscope Today: వీరు ఉద్యోగంలో ఉన్నతిని సాధిస్తారు.. సోమవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?
Horoscope Today
Follow us
Basha Shek

|

Updated on: Oct 10, 2022 | 5:45 AM

మేషం

ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. కొన్ని విషయాల్లో తోటివారిని కలుపుకోని వెళ్లాలి. దీనివల్ల ఇబ్బందులు తగ్గుతాయి. ఆరోగ్యం, ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు అవసరం. చంద్ర ధ్యాన శ్లోకం పఠిస్తే మేలు జరుగుతుంది.

వృషభం

కీలక విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లాభిస్తుంది. సానుకూల ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇష్టదైవారాధనతో సానుకూల ఫలితాలు అందుకుంటారు.

మిథునం

ఇవి కూడా చదవండి

చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. సంబంధంలేని వ్యవహారాలు, పనుల్లో తలదూర్చకుండా ఉండటం మేలు. నారాయణ మంత్రాన్ని జపిస్తే మంచిది.

కర్కాటకం

ఈ రాశివారికి అనుకూల ఫలితాలున్నాయి. స్థిరాస్తి విషయంలో సానుకూలత లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం కలదు. కీలక వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం.

సింహం

సమయస్ఫూర్తి, తెలివితో సమస్యలను ఎదుర్కొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భవిష్యత్ ప్రణాళికల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొందరితో అభిప్రాయ భేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. సూర్య దేవుడిని పూజిస్తే మంచిది.

కన్య

ఈ రాశివారికి మధ్యమ ఫలితాలున్నాయి. చేపట్టిన రంగాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఒత్తిడి, ఆందోళన పెరగకుండా జాగ్రత్తపడాలి. ఆలస్యం పనికిరాదు. గణపతి సహస్రనామ పారాయణంతో మంచి ఫలితాలు అదుకుంటారు.

తుల

మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఆలోచించి మాట్లాడాలి. లేకపోతే అనవసర వివాదాలు కొని తెచ్చుకుంటారు. కీలక పనుల్లో ఆచితూచి స్పందించాలి. శ్రీరామరక్ష స్తోత్రం చదివితే శుభం కలుగుతుంది.

వృశ్చికం

ఈ రాశివారు ఉద్యోగంలో ఉన్నతిని సాధిస్తారు. తోటి వారి సహకారంతో సత్ఫలితాలు పొందుతారు. మొహమాటాన్ని దరిచేరనీయకండి. అనవరసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. లక్ష్మీనామాన్ని జపిస్తే మంచిది.

ధనస్సు

కీలక పనులు, వ్యవహారాల్లో ఓపికతో ముందుకు సాగాలి. విరోధులపై పైచేయి సాధిస్తారు. చెడు సహవాసంతో ఇబ్బందులు పడతారు. ఎవ్వరినీ అతిగా నమ్మకండి. ఇష్టదైవారాధన మాత్రం మానవద్దు.

మకరం

కీలక పనులు, వ్యవహారాల్లో పెద్దల సలహాలు, సూచనలు లాభిస్తాయి. సానుకూల ఫలితాలు పొందుతారు. ఆటంకాలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. సాయి బాబాను దర్శించుకుంటే మేలు కలుగుతుంది.

కుంభం

బద్ధకం అస్సలు పనికిరాదు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. శ్రీరామనామంతో మంచి ఫలితాలు అందుకుంటారు.

మీనం

సమయస్ఫూర్తి, బుద్ధిబలంతో సమస్యలను అధిగమిస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. శివుడిని పూజిస్తే శుభం కలుగుతుంది.

NOTE: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..