Horoscope Today: నేడు సూర్యగ్రహణం వేళ.. ఈ రాశివారికి అంతా శుభమే.. ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

వెంటనే తమ దిన ఫలాలను తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (అక్టోబర్ 25వ తేదీ ) సూర్యగ్రహణం రోజున  రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Horoscope Today: నేడు సూర్యగ్రహణం వేళ.. ఈ రాశివారికి అంతా శుభమే.. ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope
Follow us
Surya Kala

|

Updated on: Oct 25, 2022 | 6:47 AM

Horoscope Today (24-10-2022): రోజు మొదలైతే మనిషి ముందుగా ఆలోచించేది..ఈరోజు తమకు ఎలా ఉంటుందో అని ఆలోచిస్తారు. వెంటనే తమ దిన ఫలాలను తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (అక్టోబర్ 25వ తేదీ ) సూర్యగ్రహణం రోజున  రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేష రాశి: ఈ  రోజు ఈ రాశివారికి మధ్యమ ఫలాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. పట్టుదలతో పూర్తి చేస్తారు. మానసికంగా దైర్యంగా ముందుకు అడుగు వేయాలి. అనవసరమైన ఆందోళన నుంచి దూరంగా ఉండడం మేలు.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారికి సూర్యగ్రహణం శుభఫలితాలను ఇస్తుంది. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ పనితీరుతో ప్రశంసలను అందుకుంటారు.

ఇవి కూడా చదవండి

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారికి సూర్యగ్రహణం మధ్యమ ఫలితాలను ఇస్తుంది. మీ ఆలోచనలతో అందరినీ ఆకట్టుకుంటారు.  ఇతరులతో అభిప్రాయబేధాలు వచ్చే అవకాశాలున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

కర్కాటక రాశి: ఈరోజు ఈ రాశివారికి సూర్యగ్రహణం అధమ ఫలితాలను ఇస్తుంది. చేపట్టిన పనుల్లో అధిక శ్రమ పడాల్సి ఉంటుంది. ఆశించిన ఫలితాలను అందుకుంటారు. బాధాకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. కుటుంబ సభ్యులతో అనవసర విబేధాలు రాకుండా చూసుకోవాలి.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారికి సూర్యగ్రహణం శుభఫలితాలను ఇస్తుంది. విశ్వాసంతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రణాళికలతో  నిర్ణయాలను తీసుకుని అభివృద్ధి బాటలో పయనిస్తారు. శుభకాలం. కీలక విషయాలతో శుభఫలితాలను అందుకుంటారు. ఆర్ధికంగా అభివృద్ధిని అందుకుంటారు.

కన్య రాశి: ఈ రాశివారికి ఈ రోజు సూర్యగ్రహణం మధ్యమ ఫలితాలను ఇస్తుంది. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్ధికంగా ఇబ్బందులు పడకుండా సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకోవాలి.

తుల రాశి: ఈ రోజు సూర్యగ్రహణం ఈ రాశిలోనే ఏర్పడనుంది. ఈ రాశివారికి అధమ ఫలితాలను ఇస్తుంది. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ప్రణాళికలతో చేపట్టిన పనుల్లో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది.

వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశివారికి అధమ ఫలితాలను ఇస్తుంది. ముఖ్యమైన వ్యవహారంలో తగిన జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇతరులను కలుపుకుని ముందుకు వెళ్లడం మేలు.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారికి సూర్యగ్రహణం శుభఫలితాలను ఇస్తుంది. చేపట్టిన పనుల్లో శుభఫలితాను ఇస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. శుభవార్త వింటారు.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారికి సూర్యగ్రహణం శుభఫలితాలను ఇస్తుంది. ముఖ్యమైన పనులను మొదలు పెడతారు. చేపట్టిన పనులను సులభంగా పూర్తి చేస్తారు. బంధు, మిత్రులతో సంతోషముగా గడుపుతారు. శుభకాలం.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారికి సూర్యగ్రహణం మధ్యమ ఫలితాలను ఇస్తుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మానసికంగా బలం తగ్గకుండా చూసుకోవాలి. అనవసర విషయాలకు దూరంగా ఉండడం మేలు.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు సూర్యగ్రహణం అధమ ఫలితాలను ఇస్తుంది. ఇతరుల ప్రవర్తనతో మానసికంగా ఇబ్బంది పడతారు. కీలక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)