Horoscope Today: ఆ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Today Horoscope (August 15, 2025): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక వివాదాలు, సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వృషభ రాశి వారు ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. మిథున రాశికి చెందిన నిరుద్యోగులతో పాటు ఉద్యోగులకు కూడా విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆదాయంలో ఆశించినంతగా పెరుగుదల ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

దిన ఫలాలు (ఆగస్టు 15, 2025): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక వివాదాలు, సమస్యలు బాగా తగ్గుముఖం పట్టే అవకాశముంది. వృషభ రాశి వారు ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమయ్యే అవకాశముంది. మిథున రాశికి చెందిన నిరుద్యోగులతో పాటు ఉద్యోగులకు కూడా విదేశీ ఆఫర్లు అందే ఛాన్స్ ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల ఆదరాభిమానాలు లభిస్తాయి. మీ సలహాలు, సూచనలకు విలువ పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. కొందరు బంధుమిత్రులకు ఇతోధికంగా సహాయం చేస్తారు. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. మంచి పరిచయాలు కలుగుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఆర్థిక వివాదాలు, సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఇతరులతో బాధ్యతలు పంచుకోవాల్సి వస్తుంది. కొద్దిగా అధికారుల ఒత్తిడి కూడా ఉంటుంది. వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఇంటా బయటా మంచి గుర్తింపు లభిస్తుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. రావలసిన డబ్బు అందుతుంది. కుటుంబ అవసరాలు తీరిపోతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. నిరుద్యోగులు కొన్ని శుభవార్తలు వింటారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
విదేశీ ప్రయత్నాలు చాలావరకు సఫలమవుతాయి. నిరుద్యోగులతో పాటు ఉద్యోగులకు కూడా విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆదాయంలో ఆశించినంతగా పెరుగుదల ఉంటుంది. ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు. ఉద్యోగంలో పదోన్నతి లభించడం లేదా జీతభత్యాలు పెరగడం జరుగుతుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి అంచనాలకు మించి డిమాండ్, సంపాదన పెరుగుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల మీద శ్రద్ధ పెడతారు. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. అష్టమ రాహువు కారణంగా మధ్య మధ్య మానసిక ఒత్తిడి తప్పకపోవచ్చు. కొద్దిగా ధన నష్టానికి కూడా అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు కొంత వరకు ఫలిస్తాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో మీ పనితీరుతో అందరికీ ఆకట్టుకుంటారు. వృత్తి జీవితంలో యాక్టివిటీ పెరుగుతుంది. వ్యాపారాల్లో అనుకున్న లాభాలను సాధిస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు లాభసాటిగా సాగి పోతాయి. నిరుద్యోగులు, అవివాహితులు ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆర్థికంగా ఎలాంటి ప్రయత్నమైనా కలిసి వస్తుంది. రాజకీయ వర్గాలకు సమయం అనుకూలంగా ఉంది. మిత్రులతో సరదాగా గడుపుతారు. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి, శ్రమ కాస్తంత ఎక్కువగా ఉంటాయి. సహోద్యోగులతో ఇబ్బందులు తలెత్తవచ్చు. వ్యాపారంలో శ్రమాధిక్యత ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృథా ఖర్చులతో ఇబ్బంది పడతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. బంధు మిత్రులతో అపార్థాలు తలెత్తకుండా జాగ్రత్త పడాలి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. అధికారులు మీ సలహాలు, సూచనల వల్ల లబ్ధి పొందుతారు. వృత్తి, వ్యాపారాలు చాలావరకు లాభసాటిగా సాగిపోతాయి. పెళ్లి ప్రయత్నాల విషయంలో అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పనులు, వ్యవహారాలన్నీ విజయవంతమవుతాయి. ఎలాంటి ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో స్థిరత్వం కలుగుతుంది. జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఖర్చుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి కొద్ది ప్రయత్నంతో పరిష్కారమవుతుంది. దూరపు బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల పడతాయి. పిల్లల చదువుల మీద మరింతగా శ్రద్ధపెట్టాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం పరవాలేదు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో అధికారులకు మీ సలహాలు బాగా ఉపయోగపడతాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరిగి, రాబడి వృద్ధి చెందుతుంది. ఆదాయంలో ఆశించిన పెరుగుదల ఉంటుంది. సామాజికంగా మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఏ ప్రయ త్నం చేసినా కలిసి వస్తుంది. ఒకరిద్దరు బంధువులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉన్నతస్థాయి వ్యక్తులు పరిచయం అవుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఆదాయం నిలకడగా సాగిపోతుంది. ఒకటి రెండు వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. దాదాపు ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. మంచి వ్యక్తులు పరిచయం అవుతారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు వృద్ధి చెందుతాయి. ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి. ఆరోగ్యానికి ఏమాత్రం లోటుండకపోవచ్చు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగ జీవితం చాలావరకు సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీ అయ్యే అవకాశం ఉంది. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలన్నిటినీ పూర్తి చేస్తారు. వ్యక్తిగత సమస్యల మీద దృష్టి పెడతారు. ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగం విషయంలో విదేశాల నుంచి శుభవార్త అందుతుంది. శ్రమ, తిప్పట ఉన్నప్పటికీ, కుటుంబ బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. దైవ కార్యాలు, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో జీతభత్యాల విషయంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు ఇతర సంస్థల నుంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు, లావాదేవీలు విస్తరిస్తాయి. ఆర్థిక పరిస్థితి అనేక విధాలుగా మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు.



