Horoscope 5 July 2021: ఆదాయం బాగుంటుంది.. ఖర్చులు అవసరాల మేరకు నియంత్రించండి..

Horoscope 5 July 2021: ఆదాయం బాగుంటుంది.. ఖర్చులు అవసరాల మేరకు నియంత్రించండి..

Horoscope 5 July 2021: రాశిఫలాలను నమ్మి పనులు చేసేవారు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా మనం రోజు మొదలు పెట్టాలనుకుంటే.. ఆ రోజు జరగబోయే

uppula Raju

| Edited By: Phani CH

Jul 05, 2021 | 7:35 AM

Horoscope 5 July 2021: రాశిఫలాలను నమ్మి పనులు చేసేవారు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా మనం రోజు మొదలు పెట్టాలనుకుంటే.. ఆ రోజు జరగబోయే మంచి చెడుల గురించి తెలుసుకోవాలని.. అప్పుడు ఏమి చేయాలి అనే విషయం గురించి ఓ అంచనాకు రావాలని.. రాశిఫలాలను చూస్తుంటారు. ఈ నేపథ్యంలో జూన్ 5 న రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషరాశి : కొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్. సంఘంలో పేరు ప్రతిష్టలు. పిరికి వారిలాగా ఆలోచించకండి. మీ దైర్యాన్ని మీరు గుర్తించండి. ఆదాయం బాగుంది ఖర్చులను అవసరాల మేరకు నియంత్రించండి. కుటుంబ వ్యవహారాలు గురించి కుటుంబ సభ్యులతో సంప్రదించండి. పెద్ద వారి సలహాలు తీసుకోండి.

వృషభ రాశి : కొంతమందికి విదేశీ ప్రయాణ అవకాశాలు. స్థిరాస్థి వ్యవహారాలు మీకు అనుకూలం. ఉన్న వస్తువులను మళ్లీ కొనడం ద్వారా డబ్బు వృధా. ఆఫీసులో పనులు జరుగుతున్నాయా లేదా గమనించండి కింది వారి మీద వదిలిపెడితే కష్టం. కుటుంబ వ్యక్తుల తో కొంత సమయం గడపండి వారితో పరుషంగా మాట్లాడకండి. కళాకారులకు మంచి అవకాశాలు.

మిథున రాశి : మీ పిల్లల ప్రగతి మీకు ఎంతో గర్వకారణం. మీకు అందిన వార్త మిమ్మల్ని ఈ రోజంతా ఆనందంగా ఉంచుతుంది. కొంతమంది ఇల్లు మార్పుకై ప్రయత్నాలు చేస్తారు. ఆఫీసు పనులలో మీ నూతన ప్రణాళికలు పనిచేస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

కర్కాటక రాశి : మానవసేవే మాధవసేవ ఇతరులకు సహాయం చేయడం వలన మీకు దైవ బలం. ఆదాయ వ్యవహారాలు బాగుండాలంటే అనవసరపు ఖర్చులను నివారించండి. మీ చిరకాల కోరిక తీరే అవకాశం వచ్చింది ముఖ్యమైన నిర్ణయాలను మీరే ఆలోచించి తీసుకోండి. ఇతరులతో వాదోపవాదాలకు దిగకండి.

సింహరాశి : సహోదరుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఫలితాల గురించి అతిగా ఊహించకండి. ఆశావహ దృక్పథంతో అనుకున్న కార్యాలను సాధించడానికి ప్రయత్నించండి. మీ చెడు అలవాట్ల గురించి మీ భార్య భర్తల గొడవలు పడతారు. చెడు అలవాట్లను వదిలివేయడం మంచిది. కుటుంబ సభ్యులకు కొంత సమయం కేటాయించండి. ఆఫీసు పనులలో అదనపు బాధ్యతల వలన అధిక శ్రమ.

కన్యారాశి : ఇంటిలో వ్రతాలు పూజలు చేయటం వలన దైవ బలం తోడవుతుంది. మానవసేవే మాధవసేవ ఇతరులకు సహాయం చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాలను వాయిదా వేయండి. మీ పిల్లల చదువులను జాగ్రత్తగా గమనించండి. అవసరమైన సలహాలు ఇవ్వండి. కొందరు ఉద్యోగులకు ప్రమోషన్. కొత్త నగలను కొంటారు. వ్యాపారస్తులకు లాభాలను తెచ్చే డీల్ దొరుకుతుంది. అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.

తులారాశి : అన్నివిధాలా అనుకూలమైన రోజు. ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడులు లాభాలను వస్తాయి. కుటుంబ సభ్యులకు కొంత సమయం కేటాయించండి ముఖ్యంగా పిల్లలతో గడపటం మీకు ఎంతో ఎనర్జీ ని ఇస్తుంది. దుబారా ఖర్చులను నివారించడం వల్ల ఆదాయ వ్యవహారాలు మెరుగుపడతాయి. ఆఫీసు పనులలో మీ అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పండి.

వృశ్చిక రాశి : స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. మీ కొరకు కొంత సమయం కేటాయించుకోవడం వలన రిఫ్రెష్ అవుతారు. ఒత్తిడిని అధిగమించండి. మెడిటేషన్ ఒక మంచి ఉపాయం. అనుకోని అతిథుల వలన మీ రోజువారీ కార్యక్రమం దెబ్బతింటుంది. ముఖ్య అవసరాలకు మాత్రమే ఖర్చు పెట్టండి. ఆఫీసు పని మీద శ్రద్ధ పెట్టండి పనులు సకాలంలో పూర్తి అవుతాయి.

ధనస్సు రాశి : మీ భార్య భర్తల సామరస్య ధోరణి వలన కుటుంబం లో ఆహ్లాదకర వాతావరణం. ఆధ్యాత్మిక మార్గం వైపు ఆసక్తి కనబరుస్తారు. కొంతమంది స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. కొంతమంది ఉద్యోగులకు పాత బకాయిలు అందుతాయి. వ్యాపారస్తులు తమ వ్యాపార రహస్యాలను ఇతరులతో పంచుకోవద్దు. సమయానికి తగిన డబ్బు అందకపోవడం వలన పనులు ఆగిపోతాయి ఫిట్ నెస్ కొరకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం.

మకర రాశి : ఆశావహ దృక్పథంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. మీ భార్య భర్తలు ఒకరిమీద ఒకరు నమ్మకం పెంచుకోండి. లేకుంటే వ్యవహారాలు చాలా దూరం వెళతాయి. స్థిరాస్తి వ్యవహారాలు నష్టాలను తెచ్చే అవకాశం. ఫిట్ నెస్ కొరకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం. వ్యాపారస్తులు తమ ఆదాయ వ్యవహారాలను ఒక సారి జాగ్రత్తగా గమనించండి. మీ అభిప్రాయాలను ఇతరులమీద రుద్దకండి.

కుంభరాశి : ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. పాత అపజయాలను మర్చిపోండి మీ భార్య భర్తల సామరస్య ధోరణి వల్ల కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. అప్పు ఎవ్వరికీ ఇవ్వకండి. ముఖ్యమైన నిర్ణయాలను ధైర్యంగా తీసుకోండి. దేవాలయాలను సందర్శించడం వలన దైవ బలం. ఆఫీసులో మీ పని సామర్ధ్యం పై అందరి ప్రశంసలు. కావాల్సినంత ధనం చేతికందుతుంది.

మీన రాశి : స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారస్తులకు వ్యాపారం లో లాభాలు దాని వలన ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి. ఆఫీసులో అదనపు బాధ్యతలు వలన అధిక శ్రమ. దాని వలన వెన్ను నొప్పి కాళ్ళనొప్పులు. ఆదాయ వ్యవహారాలు పరవాలేదు దుబారా ఖర్చులను నివారించండి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu