AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope 6 July 2021: ఒత్తిడిని అధిగమించడానికి ప్రయత్నించండి.. లేదంటే ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం..

Horoscope 6 July 2021: రాశిఫలాలను నమ్మి పనులు చేసేవారు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా మనం రోజు మొదలు పెట్టాలనుకుంటే.. ఆ రోజు జరగబోయే

Horoscope 6 July 2021: ఒత్తిడిని అధిగమించడానికి ప్రయత్నించండి.. లేదంటే ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం..
Horoscope June 1st
uppula Raju
|

Updated on: Jul 06, 2021 | 6:05 AM

Share

Horoscope 6 July 2021: రాశిఫలాలను నమ్మి పనులు చేసేవారు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా మనం రోజు మొదలు పెట్టాలనుకుంటే.. ఆ రోజు జరగబోయే మంచి చెడుల గురించి తెలుసుకోవాలని.. అప్పుడు ఏమి చేయాలి అనే విషయం గురించి ఓ అంచనాకు రావాలని.. రాశిఫలాలను చూస్తుంటారు. ఈ నేపథ్యంలో జూన్ 6 న రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషరాశి : సమస్యలను అతిగా ఊహించుకోవటం వల్ల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. ఆశావాద దృక్పథంతో అనుకున్న కార్యాలను సాధించండి. వ్యాపారస్తులు తమ భాగస్వాములతో జాగ్రత్తగా వ్యవహరించండి. తోటి ఉద్యోగులతో వాదోపవాదాలకు దిగకండి. దాని వల్ల గొడవలు జరుగుతాయి. ఆఫీసులో మీ పని సామర్ధ్యం గురించి అందరికి తెలుస్తుంది.

వృషభ రాశి : ఒత్తిడిని అధిగమించడానికి ప్రయత్నించండి. లేదంటే ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. మెడిటేషన్ ఒక మంచి ఉపాయం. మీ కోసం కొంత సమయం గడపండి. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేయండి. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి దాని వల్ల మీకు ఎంతో ఎనర్జీ వస్తుంది. ఆదాయం బాగుంది వీలైతే రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టండి.

మిధున రాశి : ఆత్మవిశ్వాసం పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి. ఆఫీసులో అదనపు బాధ్యతలు వలన అధిక శ్రమ, తోటి ఉద్యోగుల సహాయం లభిస్తుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఆదాయ వ్యవహారాలలో మీ పిల్లలు మీకు తోడు అవుతారు.

కర్కాటక రాశి : ముఖ్యమైన నిర్ణయం తీసుకోండి. తోడబుట్టిన వారి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయ వ్యవహారాల గురించి కుటుంబ సభ్యులతో చర్చిస్తారు పెద్ద వారి సలహాలు తీసుకోండి. కొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది. భార్య భర్తలు గొడవ పడటం వల్ల మానసిక చికాకులు ఉంటాయి.

సింహరాశి : అనుకున్న కార్యాలను సాధించాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఆఫీసులో పనులు సకాలంలో పూర్తి కావాలంటే అధికంగా కష్టపడవలసి వస్తుంది. వ్యాపారస్తులు రుణాలు తీసుకోవడం వాయిదా వేయండి. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు వారితో మాట్లాడటం వలన కొత్త ఆలోచనలు చేస్తారు.

కన్యారాశి : ఒత్తిడిని అధిగమించడానికి ప్రయత్నించండి లేకుంటే గందరగోళంలో పడతారు. మీ భార్య భర్తల సామరస్య ధోరణి వల్ల కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ప్రయాణాలు ఇబ్బందికరంగా ఉంటాయి. పై చదువులకు విదేశాలకు వెళ్ళటానికి ప్రయత్నాలు చేస్తున్న విద్యార్థులకు శుభవార్త. కావలసిన ప్రధానం చేతికందుతుంది పొదుపు చేస్తారు.

తులారాశి : ఆత్మవిశ్వాసము పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలను ధైర్యంగా తీసుకోండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఒత్తిడిని అధిగమించడానికి ప్రయత్నించండి లేకుంటే మీ కోపం మిమ్మల్ని రోగాల పాలు చేస్తుంది. ఆదాయ వ్యవహారాల గురించి కుటుంబ సభ్యులతో వారికి అర్థమయ్యేటట్లు చర్చించండి.

వృశ్చిక రాశి : ఆత్మవిశ్వాసంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలను ధైర్యంగా తీసుకోండి. వ్యాపారస్తులకు సాధారణమైన రోజు. ప్రభుత్వానికి కట్టవలసిన పన్నుల గురించి జాగ్రత్త వహించండి. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం. ఆఫీసులో పనులను పెండింగ్ పెట్టడం వలన పై అధికారులతో మాటలు పడాల్సి వస్తోంది.

ధనుస్సు రాశి : ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. యోగ మెడిటేషన్ ఒక మంచి ఉపాయం. అనుకోని అతిథుల వల్ల ఖర్చులు అధికమవుతాయి. మీ భార్య భర్తలు గొడవలు పడటం మాని ఒకరికొకరు సహకరించుకోండి. స్థిరాస్తి అమ్మకపు వ్యవహారాలు లాభాలను తెస్తాయి.

మకర రాశి : కష్టే ఫలి. కష్టపడిన దానికి ప్రతిఫలం దక్కుతుంది. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి దానివలన మీకు ఎంతో ఎనర్జీ ఉంటుంది. ఆఫీసు పనుల్లో అధిక శ్రమ వల్ల మానసిక విచారం నెలకొంటుంది. వ్యాపార రీత్యా ప్రయాణాలు దీర్ఘకాలంలో ఉపయోగపడతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు సఫలం. ఆరోగ్యానికి ప్రాముఖ్యతను ఇవ్వండి.

కుంభరాశి : కుటుంబంలోని గొడవల వల్ల మానసిక అశాంతి ఉంటుంది. దైవ ప్రార్థన మీకు మనోబలాన్ని ఇస్తుంది. ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇవ్వండి. ఒత్తిడిని అధిగమించడానికి ప్రయత్నించండి. అనుకోని ఖర్చుల వల్ల డబ్బుకు ఇబ్బంది కలుగుతుంది. ఆఫీసులో ముఖ్యమైన పనులను త్వరగా పూర్తి చేయండి. ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోండి అందరి మద్దతు లభిస్తుంది.

మీనరాశి : ఆత్మవిశ్వాసము పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఆఫీసు పనుల్లో అదనపు బాధ్యతల వల్ల అధిక శ్రమ ఉంటుంది. కావాల్సినంత ధనం చేతికందుతుంది. ముఖ్యమైన నిర్ణయాలను ధైర్యంగా తీసుకోండి దాని వల్ల భవిష్యత్తులో లాభపడుతారు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడకండి ఈ రాశి భార్య భర్తలు ఒకరికొకరు సహకరించుకోండి.