Horoscope Today: ఈరోజు ఈ రాశివారు వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంది.. మంగళవారం రాశి ఫలాలు

తమకు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (ఆగష్టు 30 వ తేదీ ) మంగళవారం రాశి ఫలాలు (Rashi Phalalu) గురించి తెలుసుకుందాం..

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంది.. మంగళవారం రాశి ఫలాలు
Horoscope Today
Follow us
Surya Kala

|

Updated on: Aug 30, 2022 | 6:49 AM

Horoscope Today (30-08-2022): నేటికీ చాలామంది ఈ రోజు తమకు ఎలా ఉంటుంది అంటూ మంచి, చెడుల గురించి ఆలోచిస్తారు. ఈ రోజు తమకు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (ఆగష్టు 30 వ తేదీ ) మంగళవారం రాశి ఫలాలు (Rashi Phalalu) గురించి తెలుసుకుందాం..

మేష రాశి: ఈ రాశివారు ఈరోజు కీలక  విషయాల్లో శుభఫలితాలను పొందుతారు. సుఖవంతమైన జీవితాన్ని గడుపుతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు అధికంగా శారీరక శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. చేపట్టిన పనులను ప్రణాళిక ప్రకారం పూర్తి చేస్తారు. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది.

ఇవి కూడా చదవండి

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. వివాదాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. అధిక శ్రమపడాల్సి ఉంటుంది.

కర్కాటక రాశి: ఈరోజు ఈ రాశివారికి ఆర్ధికంగా శుభఫలితాలను లభిస్తాయి. సమాజంలో విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లోని వారు సత్పలితాలను పొందుతారు.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు శారీరక శ్రమ పెరుగుతుంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శుభఫలితాలు పొందుతారు. కొన్ని సంఘటనలు బాధను కలిగిస్తాయి.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు వివాదాలకు దూరంగా ఉండడం మేలు. శుభఫలితాలు పొందుతారు. సహనంగా ఉండాల్సి ఉంటుంది. బంధువుల సహకారంతో చేపట్టిన పనుల విషయంలో ముందుకు వెళ్లారు.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు స్థిర చిత్తంతో పనిచేయాల్సి ఉంటుంది. మిశ్రమ కాలం. కొన్ని పరిస్థితులు బాధను కలిగించడంతో పాటు మానసికంగా ఇబ్బందులను కలిగిస్తాయి.

వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశివారికి విద్యావంతులతో పరిచయాలు ఏర్పడతాయి. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ఇతరులతో సంతోషముగా జీవిస్తారు. మంచి నిర్ణయం తీసుకుంటారు.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు సమయానుకూలంగా ముందుకు సాగాల్సి ఉంటుంది. పట్టుదలతో పనిచేయాల్సి ఉంటుంది. మంచి లాభాలను పొందుతారు.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు ఉత్సాహంతో పనిచేయాల్సి  ఉంటుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. మిశ్రమకాలం. వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యాన్ని విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల సమయంలో జాగ్రత్తగా ఉండాలి.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు కలహ సూచన ఉంది. ధైర్యంతో అడుగు ముందుకు వేస్తారు. చేపట్టిన పనిని అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. నింద పడాల్సి వస్తుంది.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. బంధు, మిత్రులతో సంతోషముగా గడుపుతారు. ఆర్ధికంగా విజయాలను సొంతం చేసుకుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)