Horoscope 3 July 2021:ఆర్ధికంగా లాభం చేకూరాలంటే.. ఈ రోజు ఏయే రాశులవారు ఏ దేవతలు పూజించాలంటే

Surya Kala

Surya Kala | Edited By: Anil kumar poka

Updated on: Jul 03, 2021 | 3:21 PM

Horoscope 3 July 2021: రాశిఫలాలను నమ్మి పనులు చేసేవారు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా మనం రోజు మొదలు పెట్టాలనుకుంటే.. ఆ రోజు జరగబోయే మంచి చెడుల గురించి తెలుసుకోవాలని..

Horoscope 3 July 2021:ఆర్ధికంగా లాభం చేకూరాలంటే.. ఈ రోజు ఏయే రాశులవారు ఏ దేవతలు పూజించాలంటే
Horoscope Today

Follow us on

Horoscope 3 July 2021: రాశిఫలాలను నమ్మి పనులు చేసేవారు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా మనం రోజు మొదలు పెట్టాలనుకుంటే.. ఆ రోజు జరగబోయే మంచి చెడుల గురించి తెలుసుకోవాలని.. అప్పుడు ఏమి చేయాలి అనే విషయం గురించి ఓ అంచనాకు రావాలని.. రాశిఫలాలను చూస్తుంటారు. ఈ నేపధ్యంలో జూన్ 3 న రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం

మేషరాశి..
ఈరోజు వేరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సాంఘిక జన సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పసుపు కుంకుమలు దుర్గ అమ్మవారికి సమర్పిస్తే మేలు జరుగుతుంది.
వృషభ రాశి..
ఈరోజు ఆర్ధిక ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటుండాలి. కొని అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇష్టదైవాన్ని అరటిపండు నివేదన చేస్తే మేలు కలుగుతుంది.
మిధున రాశి..
ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులు వాయిదా పడకుండా చూసుకోవాలి. సాంఘిక పరమైన ఒత్తిడి కనిపిస్తుంది., ఆచూతూచి వ్యవహరించాలి. లక్ష్మి నరసింహ స్వామివారి దర్శనం మేలు చేస్తుంది.
కర్కాటక రాశి..
ఈరోజు అప్పులు బాధలు కొంత ఒత్తిడి ఉంటుంది. ఆర్ధిక ఇబ్బందుల వలన మానసిక పరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. మహాలక్ష్మి అమ్మవారు దర్శనం మేలు చేస్తుంది.
సింహ రాశి..
ఈరోజు కుటుంబ పరమైన బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు కనిపిస్తున్నాయి. మరింత మెరుగైన ఫలితాల కోసం పేదవారికి పాలు పండ్లు దానం చేయడం మంచిది.
కన్యరాశి..
ఈరోజు ఒత్తిడి తో కూడిన కార్యక్రమాలు అధిగమిస్తారు. ఆలయ దర్శనం మేలు చేస్తుంది. సుబ్రమణ్య స్వామి దర్శనం చేసుకుని.. పొంగలిని నివేదిస్తే మేలు జరుగుతుంది.
తులారాశి..
ఈరోజు ఖర్చులు పెరుగుతుంటాయి. తొందర పడి ఎటువంటి పనులు చేపట్టరాదు. శివారాధన మేలు చేస్తుంది.
వశ్చిక రాశి..
ఈ రాశివారు కుటుంబ పరమైన ప్రొత్సాకాలు కలుగుతాయి. ధార్మిక చింతన కలుగుతుంది. సత్యనారాయణ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.
ధనుస్సు రాశి..
ఈరోజు ఆర్ధిక ఇబ్బందులు తొలగుతాయి. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. పార్వతి అమ్మవారి దర్శనములు చేస్తుంది.
మకర రాశి..
ఈ రాశివారు ఈరోజు రావలసిన బాకీలు వేరు వేరు రూపాల్లో వాసులు చేసుకోగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. శుభవార్త వింటారు. విష్ణు స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.
కుంభరాశి..
ఈరోజు ఈ రాశివారు ప్రయాణ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పులు చేసే బాధ నుంచి బయటపడతారు. దుర్గ అమ్మవారికి కుంకుమార్చన మేలు చేస్తుంది.
మీన రాశి..
ఈరోజు కుటుంబ పరమైన ఆనందం ఉంటుంది. అభిప్రాయం బేధాలను తొలగించుకోగలుగుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

 

 

Also Read: ఇతర భాషనటులకి ఇచ్చిన అవకాశాలను తెలుగు వారికి తెలుగు ఇండస్ట్రీ ఇవ్వదని ప్రశాంతి ఆవేదన

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu