Zodiac Signs: ఈ రాశుల వారు సూపర్ నాన్నలు గా ఉంటారని చెబుతారు.. ఏ రాశుల వారో ఇక్కడ తెలుసుకోండి
Zodiac Signs: మీ కాబోయే భర్త మీ పిల్లలకు మంచి తండ్రి అవుతాడా లేదా అని మీరు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? లేదా మీరు విలువైన తండ్రిగా ఉండబోతున్నారా
Zodiac Signs: మీ కాబోయే భర్త మీ పిల్లలకు మంచి తండ్రి అవుతాడా లేదా అని మీరు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? లేదా మీరు విలువైన తండ్రిగా ఉండబోతున్నారా? తల్లిదండ్రులుగా ఉండటం అంత తేలికైన పని కాదు. అదేవిధంగా తండ్రులందరూ ఒకేలా ఉండలేరు. ఒకే స్థాయిలో ఆప్యాయత, రక్షణ, మార్గదర్శకత్వం అందివ్వలేరు. కానీ, కొంతమంది మాత్రం తమ జీవితంలో ఉన్నతమైన తండ్రిగా నిలబడతారు. చేసే ప్రతిపని పిల్లలను దృష్టిలో పెట్టుకుని చేస్తారు. పిల్లల అభ్యున్నతే జీవితంగా జీవిస్తారు. ఈ రకమైన ఉత్తమ లక్షణాలు ఎవరిలో ఉంటాయో వివరంగా చెప్పింది జ్యోతిష్య శాస్త్రం. పుట్టినతేదీ.. సమయం.. ఆధారంగా ఒక మనిషి ఏ రాశిలో పుడతారో నిర్ణయం అవుతుంది. ఆయా రాశుల వ్యక్తుల వ్యక్తిత్వాలు రాశులపై ఆధారపడి ఉంటాయని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. దీనిప్రకారం నాలుగు రాశుల వారు పరిపూర్ణమైన తల్లిదండ్రులుగా ఉంటారట. పిల్లల పట్ల వారు చాలా బాధ్యతగా వ్య్వహరిస్తారట. మరి ఆ రాశులు ఏమిటో.. అవి ఏమి చెబుతున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
మకరం
మకరరాశి వారు సహనంతో ఉంటారు. అదే వారి పిల్లల పెంపకంలోనూ కనిపిస్తుంది. వీరు గొప్ప తండ్రిగా నిలుస్తారు. ఎందుకంటే, పిల్లల కోసం ఏ పనైనా ఓర్పుగా చేసే నేర్పు వీరి సొంతం. అదేవిధంగా ప్రతి విషయాన్ని పిల్లలకు విడమర్చి చెప్పడంలో వీరు ముందుంటారు. పిల్లలకు అనునిత్యం ప్రతి సందేహాన్నీ తీర్చే మార్గదర్శిగా ఉంటారు.
కర్కాటకం
ఈ రాశి వారు వారి పిల్లలకు చాలా సున్నితమైన, అద్భుతమైన ప్రేమగల తండ్రి అవుతారు. వీరు పిల్లల విషయంలో అదనపు జాగ్రత్తతో ఉంటారు. పరిపూర్ణమైన తండ్రిగా నిలవడానికి వీరు ఏమైనా చేస్తారు. వీరు తమ పిల్లలకు రోల్ మోడల్ గా నిలవాలని అనుకుంటారు. అందుకే, పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. వారి ముందు ఎటువంటి పరిస్థితుల్లోనూ తప్పుగా కనిపించడం వీరికి ఇష్టం ఉండదు. ఈ రాశి వారు పిల్లలకు అమితమైన ప్రేమను పంచి ఇస్తారు.
వృషభం
ఈ రాశివారు సాధారణంగా కఠినంగా కనిపిస్తారు. కానీ, పిల్లల విషయంలో వీరు చాలా మెత్తని ధోరణితో ఉంటారు. వీరు పిల్లలపై అదనపు శ్రద్ధ, సానుభూతిగల బంధాన్ని కనబరుస్తారు. అందుకే పిల్లలకు కూడా వీరిపై నమ్మకాన్ని పెంచుతుంది. ఈ రాశివారి పిల్లలు కూడా తమ తండ్రితో ఎంతో స్నేహంగా ఉంటారు. పిల్లలకు కావలసినవి నేర్పడంలో వీరు మంచి శ్రద్ధ కనబరుస్తారు. వీరికి పిల్లలతో ఉండే బంధం ప్రత్యేకంగా ఉంటుంది.
మిథునం
మిథున రాశి తండ్రులు.. కొంచెం ఇష్టంగా.. కొంచెం కష్టంగా అనిపిస్తారు. పిల్లల పట్ల ఎంత ప్రేమ ఉంటుందో.. వారిని క్రమశిక్షణలో ఉంచడం కోసం అంత కఠినం గానూ ఉంటారు. వీరు పిల్లలను క్రీడాకారులుగా.. ఉన్నత విద్యావంతులుగా చూడాలని కోరుకుంటారు. అది వారిలో క్రమశిక్షణ వల్లే సాధ్యం అవుతుందని నమ్ముతారు. వీరి ప్రేమనంతా లోపల దాచుకుని.. పిల్లల మంచి కోసం కఠినంగా కనిపించే ప్రయత్నం చేస్తారు. ఎంత స్నేహంగా కనిపిస్తారో.. అవసరమైతే అంత కచ్చితంగానూ వారిని దూరం పెడతారు. కానీ, పిల్లల అభ్యున్నతి కోసం నిటైం శ్రమ పడతారు.
గమనిక- ఇక్కడి సమాచారం మత విశ్వాశాలు.. కొన్ని నమ్మకాల కోసం, జ్యోతిష శాస్త్ర నిపుణులు వెల్లడించిన పలు విషయాల నుంచి సేకరించి పొందుపరిచి అందిస్తున్నాం. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. కేవలం సాధారణ ప్రజల ఆసక్తిని అనుసరించి ఈ సమాచారం ఇవ్వడం జరుగుతోంది. దీనిలోని మంచి చెడ్డలు ఎవరి నమ్మకాలకు తగ్గట్టుగా వారు పరిశీలించుకోవాల్సి ఉంటుంది.
Zodiac Signs: ఈ మూడు రాశుల వారు ఎంతో పిరికివారు.. ఏ విషయంలోనూ అస్సలు తలదూర్చరు..