Horoscope Today: వారికి ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి.. 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (సెప్టెంబర్ 27, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. వృషభ రాశి వారు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. మిథున రాశి వారికి వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు కొన్ని పరిష్కారం అవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
దిన ఫలాలు (సెప్టెంబర్ 27, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. వృషభ రాశి వారు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. మిథున రాశి వారికి వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు కొన్ని పరిష్కారం అవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించదు. కుటుంబ సమస్యలు చికాకులు కలిగిస్తాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులు బాగా తగ్గుతాయి. ఉద్యోగంలో ఉత్సాహకర వాతావరణం నెలకొంటుంది. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ప్రముఖులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో శక్తి సామర్థ్యాలకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. వృత్తి జీవితం బిజీ అవుతుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. సన్నిహితులతో మంచి కాలక్షేపం చేస్తారు. లాభసాటి పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా వృద్ధి చెందుతాయి. పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. వృత్తి జీవితం ఉత్సాహంగా సాగిపో తుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది. భారీ ఎత్తున షాపింగ్ చేస్తారు. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు కొన్ని పరిష్కారం అవుతాయి. చేపట్టిన పనులన్నిటిలో ఘన విజ యాలు సాధిస్తారు. వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో సామ రస్యం పెరుగుతుంది. ధనపరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో కార్య సిద్ధి కలుగుతుంది. రావాల్సిన డబ్బు వసూలు అవుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. తొందరపడి ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. అదనపు ఆదాయ మార్గాల మీద దృష్టి పెడతారు. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహా రాలన్నీ సకాలంలో పూర్తవుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు పరవాలేదనిపి స్తాయి. వ్యక్తిగత జీవితంలో కొద్దిపాటి సమస్యలు తప్పకపోవచ్చు. వృత్తి, ఉద్యోగాల్లో మీ శక్తి సామ ర్థ్యాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. అత్యవసర వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ప్రయాణాలు వాయిదా పడతాయి. కొందరు బంధుమిత్రులతో సాన్నిహిత్యం బాగా పెరుగుతుంది. చేపట్టిన పను లన్నీ సజావుగా సాగిపోతాయి. ఆర్థిక సంబంధమైన ఇబ్బందులుంటాయి. వ్యక్తిగత సమస్యల నుంచి కొంత మేరకు బయటపడతారు. అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం లభి స్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులకు నమ్మకం పెరుగుతుంది. వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగాల్లో అధికారులకు అనుకూలంగా ఉంటారు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. కొత్త పనులు, కార్యక్రమాలు ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్తలు అందుతాయి. వృత్తి జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ఆదాయం సంతృ ప్తికరంగా ఉంటుంది. రావాల్సిన డబ్బును వసూలు చేసుకుంటారు. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
కుటుంబసమేతంగా ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక లావా దేవీలు లాభసాటిగా సాగుతాయి. షేర్ల వ్యాపారం ఆశించిన ఫలితాలనిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమకు, ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ప్రము ఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు అభివృద్ధి బాటపడతాయి. ఏ ప్రయత్నం తల పెట్టినా విజయవంతం అవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు బాగా మెరుగుపడతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఇంటా బయటా బాధ్యతలు ఎక్కువగా ఉండి ఒత్తిడికి గురవుతారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంత వరకూ బయటపడతారు. వ్యయ ప్రయాసలతో వ్యవహారాలు, పనులు పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహం కలిగిస్తాయి. ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. ఆదాయ ప్రయ త్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి తగ్గుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ప్రముఖులతో స్నేహ సంబంధాలు పెరుగుతాయి. బంధువుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు బాగా లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగిపో తాయి. వృత్తి జీవితంలో అవకాశాలు పెరుగుతాయి. కుటుంబ సమస్యలను అధిగమిస్తారు. ప్రయా ణాల్లో కొద్దిగా ఇబ్బందులుంటాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఎదురు చూస్తున్న సమా చారం అందుతుంది. తల్లితండ్రుల నుంచి ఆస్తి కలిసి వచ్చే సూచనలున్నాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
జీవిత భాగస్వామితో కలిసి విలువైన వస్తు సామగ్రి, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఏ వ్యవహారం చేపట్టినా, ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధిస్తారు. బంధుమిత్రుల నుంచి రావలసిన డబ్బు సకాలంలో అందుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీ అయిపోతాయి. ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు చేపట్టడం జరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ఆర్థిక సమస్యలు తగ్గించు కుంటారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ప్రతి విషయంలోనూ వ్యయ ప్రయాసలుంటాయి. బంధువులకు మీ సలహాలు, సూచనలు ఉపయోగ పడతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి జీవితంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఇంటా బయటా పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. ప్రముఖుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు విశేషంగా పెరుగుతాయి. ప్రతి వ్యవహా రమూ విజయవంతం అవుతుంది. ఉద్యోగ జీవితంలో కొన్ని ఆటుపోట్లు తొలగిపోతాయి. ఆదా యానికి, ఆరోగ్యానికి ఏమాత్రం లోటుండదు. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. సొంత విషయాల మీద శ్రద్ద పెట్టడం మంచిది.