Telugu News » Astrology » Horoscope today 26th May 2023 Astrological predictions for all zodiac signs in telugu
Horoscope Today(26th May): వారు శుభవార్తలు వింటారు.. 12 రాశుల వారికి శక్రవారంనాటి రాశిఫలాలు..
Janardhan Veluru | Edited By: Subhash Goud
Updated on: May 26, 2023 | 4:00 AM
Horoscope Today (26 మే 2023): సాధారణంగా చాలామందికి తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తి ఉంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా విశ్వసించే విధానం జ్యోతిష్యం. రాశుల గ్రహ స్థితిగతులను లెక్కించి ఆ వ్యక్తుల భవిష్యత్తు ఎలా ఉండబోతుందని జ్యోతిష్య పండితులు లెక్కిస్తారు. అయితే, 12 రాశుల వారికి శుక్రవారం దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
Horoscope Today 26th May 2023
Follow us on
Horoscope Today (26 మే 2023): సాధారణంగా చాలామందికి తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తి ఉంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా విశ్వసించే విధానం జ్యోతిష్యం. రాశుల గ్రహ స్థితిగతులను లెక్కించి ఆ వ్యక్తుల భవిష్యత్తు ఎలా ఉండబోతుందని జ్యోతిష్య పండితులు లెక్కిస్తారు. అయితే, 12 రాశుల వారికి శుక్రవారం దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఈ రోజు చాలావరకు ప్రశాంతంగా గడిచిపో తుంది. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు లభి స్తాయి. పని ఒత్తిడి, టెన్షన్లు తగ్గుతాయి. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా కనిపిస్తాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థికంగా కొద్దిగా కలిసి వస్తుంది. ఎక్కువగా కుటుంబ సభ్యులతో కాల క్షేపం చేస్తారు. తల్లి ఆరోగ్యం కాస్తంత ఇబ్బంది పెడుతుంది. మంచి నిర్ణయాలు తీసుకుని అమలు చేయడానికి ఇది అనుకూల సమయం.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఆర్థిక పరిస్థితి బాగున్నప్పటికీ ఖర్చులు తగ్గించు కోవడం మంచిది. ఎవరు అడిగితే వారికి ఆర్థిక సహాయం చేయడం వల్ల కొద్దిగా నష్టపోయే అవ కాశం ఉంది. ఉద్యోగంలో ఆశించిన విధంగా స్థిరత్వం ఏర్పడుతుంది. ఆదాయం పెరిగే సూచ నలు ఉన్నాయి. పిల్లలు పురోగతి సాధిస్తారు. ప్రయాణాల వల్ల నష్టపోతారు. బంధుమిత్రులతో చికాకులు తలెత్తవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం ఉంది. దూరప్రాంతం నుంచి శుభవార్త వింటారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఉద్యోగంలో పైకి ఎదగడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. ఆశించిన స్థాయిలో సంపాదన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అనవసర విషయాల్లో కల్పించుకోవద్దు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందవచ్చు. కుటుంబంలో ఒకటి రెండు సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంది. ఆచితూచి మాట్లాడటం మంచిది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఆర్థిక ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి. కుటుంబ పెద్దల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. స్నేహితులు పక్కదోవ పట్టించే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు అదుపు తప్పే అవకాశం ఉంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఉద్యోగ జీవితం చాలా వరకు సాఫీగా సాగిపో తుంది. ఆదాయపరంగా ఒక శుభవార్త వింటారు. మొండి బాకీ ఒకటి వసూలు అవుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా మారుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాల వల్ల ఇరకాట పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి నిపుణులు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. వ్యాపారంలో కొద్దిగా అదృష్టం కలిసి వస్తుంది. చాలాకాలంగా ఇబ్బంది పెడు తున్న వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం పర్వాలేదు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఆర్థిక పరిస్థితి కాస్తంత ఒడిదుడుకులకు లోనవుతుంది. డబ్బు ఇవ్వాల్సిన వాళ్ళు ముఖం చాటేస్తారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. అధికా రుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. సామాజి కంగా పలుకుబడి పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. స్నేహితులతో విందుల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారు శుభవార్త వింటారు. ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఈ రాశి వారికి శుభగ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల, అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. కొత్త ప్రయత్నాలు సఫలం అవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. పిల్లలు పురోగతి సాధిస్తారు. ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో ఆశించిన దాని కంటే ఎక్కువగా అభివృద్ధి ఉంటుంది. ఆరోగ్యం పర్వాలేదు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ): ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు చాలా వరకు అనుకూలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. బంధుమిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్త వుతాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒక ముఖ్యమైన కుటుంబ సమస్య పెద్దల సహాయంతో పరిష్కారం అవుతుంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. ఉద్యోగంలో ఒకటి రెండు చిన్న చిన్న సమస్యలు తలెత్తవచ్చు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఈ రోజు ఏ ప్రయత్నం తలపెట్టినప్పటికీ అది తప్పకుండా సఫలం అవుతుంది. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా, ఆశాజన కంగా కనిపిస్తున్నాయి. ముఖ్యమైన నిర్ణయాలు కలిసి వస్తాయి. అన్ని విధాలుగాను ఇది అను కూల సమయం. ఉద్యోగ వివాహ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులు మంచి ఆఫర్లు అందుకుంటారు. వృత్తి వ్యాపారాల వారు సంపాదన పెంచుకుంటారు. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2): ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఉద్యోగానికి సంబంధించి ఒకటి రెండు సమస్యలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. అయితే, కొద్దిగా పని భారం తప్పకపోవచ్చు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబపరంగా కొద్దిగా ఒత్తిడికి గురి అయ్యే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో పారదర్శకంగా వ్యవహరించడం మంచిది. బంధుమిత్రుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి ఉండే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం మీద ఒక కన్ను వేసి ఉండటం మంచిది.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఉద్యోగం, కుటుంబ జీవితం ప్రశాంతంగా, సామరస్యంగా సాగిపోతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఆర్థిక వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. వాగ్దానాలు చేయడం, హామీలు ఉండటం, ఇతర లావాదేవీలకు ఇది అనుకూల సమయం కాదు. ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్తులో ప్రయోజనం ఉంటుంది. కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఈ రాశి వారికి ఈ రోజు హ్యాపీగా గడిచిపోతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక సంబంధమైన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. గౌరవ మర్యాదలు లభిస్తాయి. సలహాలు, సూచనలకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం, గుర్తింపు లభిస్తాయి. వృత్తి వ్యాపారాల వారు బాగా రాణిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది. ఆశించిన శుభవార్త వింటారు.
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)