Horoscope Today: ఆర్థిక విషయాల్లో ఆ రాశి వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (ఆగస్టు 26, 2024): మేష రాశి వారు ఈ రోజు ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుని, ప్రశాంతత పొందుతారు. వృషభ రాశి వారికి ఉద్యోగంలో కూడా పని భారం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. మిథున రాశి వారికి కొన్ని ఒత్తిళ్లు, సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు మారే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: ఆర్థిక విషయాల్లో ఆ రాశి వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు
Horoscope Today 26th August 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 26, 2024 | 5:01 AM

దిన ఫలాలు (ఆగస్టు 26, 2024): మేష రాశి వారు ఈ రోజు ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుని, ప్రశాంతత పొందుతారు. వృషభ రాశి వారికి ఉద్యోగంలో కూడా పని భారం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. మిథున రాశి వారికి కొన్ని ఒత్తిళ్లు, సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు మారే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

కొద్దిపాటి శ్రమతో ఆదాయాన్ని బాగా పెంచుకుంటారు. దాదాపు పనులన్నిటినీ పూర్తి చేస్తారు. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు తప్పకుండా నెరవేరుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుని, ప్రశాంతత పొందుతారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాల్లో కొన్ని ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక లావాదేవీల వల్ల లాభముంటుంది. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందే అవకాశం ఉంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపో తుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

కుటుంబ బాధ్యతలు, కుటుంబ ఖర్చులు కాస్తంత ఎక్కువగానే ఉంటాయి. ఉద్యోగంలో కూడా పని భారం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు కొద్ది శ్రమతో పూర్తవు తాయి. ఆస్తి వివాదాన్ని రాజీమార్గంలో పరిష్కరించుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆదాయం, ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఇతరుల వ్యవహారాలకు బాగా దూరంగా ఉండడం మంచిది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. కొన్ని ఒత్తిళ్లు, సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు మారే అవకాశం ఉంది. పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. కొందరు బంధుమిత్రుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. తల పెట్టిన పనులన్నిటినీ పట్టుదలగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

సొంత పనులకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. వృత్తి, ఉద్యోగాలు సాదా సీదాగా సాగిపోతాయి. వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. కొందరు బంధువుల వల్ల ఇబ్బం దులుంటాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. అదనపు ఆదాయ ప్రయత్నాలు కలిసి ఆశించిన ఫలితాలనిస్తాయి. ఆహార, విహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇతరులకు ఇతోధికంగా సహాయం చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి జీవితం చాలావరకు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది. వ్యాపారాలకు కూడా సమయం బాగా అనుకూలంగా ఉంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. వ్యక్తిగత జీవితంలో ఏ మాత్రం తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. చిన్ననాటి స్నేహితులతో విందులో పాల్గొంటారు. తలపెట్టిన పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. వ్యక్తిగత సమస్యల నుంచి, సాధారణ అనారోగ్యాల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. వృత్తి జీవితంలో ఉన్నవారికి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఇంటికి దగ్గర బంధువుల రాకపోకలుంటాయి. ఉద్యోగంలో అదనపు బాధ్య తల కారణంగా శ్రమ పెరిగి, విశ్రాంతి కరువవుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఆర్థిక ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఉన్నతస్థాయి వారితో ఉపయోగకర పరిచయాలు ఏర్పడ తాయి. కొందరు మిత్రుల తోడ్పాటుతో ముఖ్యమైన పనులు, వ్యవహారాల్ని సకాలంలో పూర్తి చేస్తారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాలలో జీతభత్యాలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. అదనపు ఆదాయానికి లోటుం డదు. కొద్ది శ్రమతో అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారాల్లో లాభాలు అంచ నాలను మించుతాయి. ఇంటా బయటా ఖర్చులు బాగా పెరిగి ఇబ్బంది పడతారు. కొద్దిగా వైద్య ఖర్చులు కూడా తప్పకపోవచ్చు. ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రయా ణాల వల్ల లాభముంటుంది.. ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆదాయం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. డబ్బు ఇచ్చినా, తీసుకున్నా తప్పకుండా ఇబ్బందులు పడతారు. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా సఫలం అవుతుంది. ముఖ్యంగా ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన స్పందన లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలు సాదా సీదాగా సాగిపోతాయి. సంపాదన మార్గాలు అనుకూలంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు అంది వస్తాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాడ 1)

ఉద్యోగ జీవితంలో ఒకటి రెండు శుభవార్తలు వినడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో జోరు పెరుగుతుంది. అదనపు రాబడికి, లాభాలకు లోటుండదు. కొద్ది ప్రయత్నంతో రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల సమాచారం అందుతుంది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. దైవ కార్యాలో ఎక్కువగా పాల్గొంటారు. ముఖ్యమైన పనుల వల్ల ఇంటా బయటా శ్రమ, తిప్పట ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగ జీవితంలో పనిభారం, పని ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటాయి. విశ్రాంతికి దూరమవు తారు. నిరుద్యోగులకు తప్పకుండా ఉద్యోగ యోగం పడుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. ఇష్టమైన బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. ఎవరితోనూ వాదోపవాదాలు పెట్టుకోవద్దు. ఆరోగ్యం పరవాలేదు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో విశ్రాంతికి అవకాశం ఉండదు. వృత్తి, వ్యాపారాల్లో కూడా కొద్దిపాటి రాబడికి అధికంగా శ్రమ పడాల్సి వస్తుంది. నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. సరైన విధంగా ప్రయత్నాలు చేయడం మంచిది. అదనపు ఆదాయం కోసం కొత్త ప్రయత్నాలు చేపట్టడానికి అవ కాశం ఉంది. పెండింగు పనులన్నీ పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. వృత్తి, ఉద్యోగాలు సాదా సీదాగా సాగిపోతాయి. వ్యాపారాలు జోరందుకుంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందు తుంది. ఆరోగ్యం, ఆదాయం మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగపరంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా అది తప్పకుండా సఫలం అవుతుంది. అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. బంధువులతో కొద్దిపాటి ఇబ్బందులుంటాయి. వృత్తి, ఉద్యోగాలు చాలా వరకు లాభసాటిగా ఉంటాయి. వ్యాపారాలు కలిసి వస్తాయి.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి

2025 పెళ్లికి సిద్ధమవుతున్న ముగ్గురు హీరోయిన్లు
2025 పెళ్లికి సిద్ధమవుతున్న ముగ్గురు హీరోయిన్లు
అమెరికాలో కార్చిచ్చు.. మంటల్లో బూడిదైన హాలీవుడ్‌ తారల ఆస్తులు
అమెరికాలో కార్చిచ్చు.. మంటల్లో బూడిదైన హాలీవుడ్‌ తారల ఆస్తులు
బడికి సెలవిస్తారనీ ఓ విద్యార్ధి ఆకతాయిపనికి.. ఢిల్లీ సర్కార్ గజగజ
బడికి సెలవిస్తారనీ ఓ విద్యార్ధి ఆకతాయిపనికి.. ఢిల్లీ సర్కార్ గజగజ
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి బుమ్రాను తప్పించండి.. ధోని దోస్త్ డిమాండ్
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి బుమ్రాను తప్పించండి.. ధోని దోస్త్ డిమాండ్
టాలీవుడ్‌లోకి కొత్త హీరోయిన్స్.. మరి స్టార్ స్టేటస్ అందుకుంటారా?
టాలీవుడ్‌లోకి కొత్త హీరోయిన్స్.. మరి స్టార్ స్టేటస్ అందుకుంటారా?
గవర్నమెంట్ ఆఫీసులో సీఎం ఫోటోతో ఇలానా..?
గవర్నమెంట్ ఆఫీసులో సీఎం ఫోటోతో ఇలానా..?
ఏంది భయ్యా అది.. మేక, గొర్రెనో తోలినట్లుగా సింహాన్ని తరిమేశావ్..
ఏంది భయ్యా అది.. మేక, గొర్రెనో తోలినట్లుగా సింహాన్ని తరిమేశావ్..
సంజయ్ లీలా భన్సాలీతో అల్లు అర్జున్ సినిమా.. ?
సంజయ్ లీలా భన్సాలీతో అల్లు అర్జున్ సినిమా.. ?
ఒక్క సినిమాతోనే 10 వేల కోట్లు వసూలు సాధించిన ఏకైక హీరోయిన్..
ఒక్క సినిమాతోనే 10 వేల కోట్లు వసూలు సాధించిన ఏకైక హీరోయిన్..
IPLకి ముందు మాక్స్‌వెల్ ‘బ్లాస్టింగ్’ ఇన్నింగ్స్..
IPLకి ముందు మాక్స్‌వెల్ ‘బ్లాస్టింగ్’ ఇన్నింగ్స్..