Money Astrology: చంద్ర బుధుల పరివర్తన యోగం.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు!

చంద్ర బుధులు తండ్రీ కుమారులు. ఈ రెండు గ్రహాల మధ్య 28, 29, 30 తేదీల్లో రాశి పరివర్తన జరుగుతోంది. చంద్రుడి రాశి అయిన కర్కాటకంలో బుధుడు, బుధుడి రాశి అయిన మిథునంలో చంద్రుడు సంచారం చేయడాన్ని పరివర్తన యోగం అంటారు. దీనివల్ల ఎటువంటి విషయంలోనైనా సత్వర నిర్ణయాలకు అవకాశం ఉంటుంది. ఆదాయానికి సంబంధించి కొత్త ప్రయత్నాలు ప్రారం భించడం, కొత్త వ్యూహాలు రూపొందించడం..

Money Astrology: చంద్ర బుధుల పరివర్తన యోగం.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు!
Money Astrology
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 25, 2024 | 7:11 PM

చంద్ర బుధులు తండ్రీ కుమారులు. ఈ రెండు గ్రహాల మధ్య 28, 29, 30 తేదీల్లో రాశి పరివర్తన జరుగుతోంది. చంద్రుడి రాశి అయిన కర్కాటకంలో బుధుడు, బుధుడి రాశి అయిన మిథునంలో చంద్రుడు సంచారం చేయడాన్ని పరివర్తన యోగం అంటారు. దీనివల్ల ఎటువంటి విషయంలోనైనా సత్వర నిర్ణయాలకు అవకాశం ఉంటుంది. ఆదాయానికి సంబంధించి కొత్త ప్రయత్నాలు ప్రారం భించడం, కొత్త వ్యూహాలు రూపొందించడం, ఆదాయం పెరగడానికి గట్టి ప్రయత్నాలు చేపట్టడం వంటివి జరుగుతాయి. ఇవి ఏమేరకు విజయవంతం అవుతాయన్నది ఆయా రాశుల మీద ఆధారపడి ఉంటుంది. మేషం, వృషభం, మిథునం, కన్య, తుల, మీన రాశుల వారు చంద్ర బుధుల పరివర్తన వల్ల విశేషంగా ఆదాయం గడించే అవకాశం ఉంది.

  1. మేషం: ఈ రాశికి ఈ పరివర్తన యోగం వల్ల పెద్దగా ప్రయత్నం చేయకుండానే ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. గృహ, వాహనాల కోసం అతి తేలికగా రుణ సౌకర్యం లభించే అవకాశం కూడా ఉంది. ఆస్తి వివాదాలను సమయస్ఫూర్తిగా పరిష్కరించుకుంటారు. ఆదాయ మార్గాలు విస్తరించే సూచన లున్నాయి. తల్లితండ్రుల వైపు నుంచి ఆస్తి లభించే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల బాగా లాభం ఉంటుంది. లాభదాయక స్నేహాలు కూడా ఏర్పడతాయి. జీతభత్యాలు, లాభాలు పెరుగుతాయి.
  2. వృషభం: ఈ రాశివారికి ధన స్థానాధిపతి బుధుడితో తృతీయ స్థానాధిపతి చంద్రుడి పరివర్తన వల్ల ఆదా యం విషయంలో ఏ చిన్న ప్రయత్నం తలపెట్టినా అత్యధికంగా లాభాలు పొందడం జరుగు తుంది. ఉద్యోగంలో భారీ జీతభత్యాలతో కూడిన పదోన్నతులకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపా రాలు లాభాలపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. నిరుద్యోగులకు కలలో కూడా ఊహించని ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి ఖాయం అవుతుంది.
  3. మిథునం: ఈ రాశి పరివర్తన వల్ల ఎక్కువగా లాభపడేది ఈ రాశివారే. రాశ్యధిపతికి ధనాధిపతితో పరివర్తన ఏర్పడినందువల్ల, ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంటుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఆస్తి వివాదాలు సానుకూ లంగా పరిష్కారం అవుతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో జీత భత్యాలు బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది.
  4. కన్య: ఈ రాశికి దశమ, లాభాధిపతుల మధ్య పరివర్తన జరుగుతున్నందువల్ల ఉద్యోగంలో ప్రాధాన్యంతో పాటు హోదా పెరిగే అవకాశం ఉంటుంది. జీతభత్యాలు అంచనాలకు మించి పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు దిన దినాభివృద్ధి చెందుతాయి. నిరుద్యోగులకు భారీ జీతభత్యాలతో కూడిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఈ రాశివారికి దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి కూడా అవకాశం ఉంది. షేర్ల వ్యాపారం బాగా లాభి స్తుంది.
  5. తుల: ఈ రాశికి భాగ్య, దశమాధిపతుల మధ్య పరివర్తన జరుగుతున్నందువల్ల మహా భాగ్య యోగం పడుతుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం చేపట్టినా విజయం సిద్ధిస్తుంది. గృహ, వాహన సౌకర్యాలు వృద్ధి చెందుతాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశాల నుంచి కూడా మంచి ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లవలసి వస్తుంది. తండ్రి వైపు నుంచి సంపద లభిస్తుంది.
  6. మీనం: ఈ రాశికి చతుర్థ, పంచమ స్థానాల మధ్య పరివర్తన జరుగుతున్నందువల్ల ప్రముఖులతో లాభ దాయక పరిచయాలు ఏర్పడతాయి. భాగస్వామ్య వ్యాపారాలు అంచనాలకు మించి వృద్ధి చెందు తాయి. గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడతాయి. ప్రభుత్వం నుంచి మంచి గుర్తింపు, ధన లాభాలు కలు గుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాల పంట పండుతుంది. ఉద్యోగంలో హోదాతో పాటు ఆశిం చిన స్థాయిలో జీతాలు కూడా పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి