Horoscope Today: ఆర్థిక విషయాల్లో వారు ఇబ్బందులు ఎదుర్కొంటారు.. సెప్టెంబర్ 22 రాశిఫలాలు ఇలా..
దినఫలాలు (సెప్టెంబర్ 22, 2023): మేష రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. వృషభ రాశివారికి కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తయి, ఒత్తిడి తగ్గుతుంది. మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి సంబంధించి ఎటువంటి ప్రయత్నం తల పెట్టినా విజయవంతం అవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి దినఫలాలు ఎలా ఉన్నాయంటే..?
రాశిఫలాలు (సెప్టెంబర్ 22, 2023): మేష రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. వృషభ రాశివారికి కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తయి, ఒత్తిడి తగ్గుతుంది. మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి సంబంధించి ఎటువంటి ప్రయత్నం తల పెట్టినా విజయవంతం అవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి దినఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): గురు, బుధ, శుక్ర గ్రహాల అనుకూలత బాగా ఉన్నందువల్ల రోజంతా చాలావరకు సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చుల్ని బాగా తగ్గించుకుంటారు. చిన్ననాటి స్నేహితు లతో సరదాగా కాలక్షేపం చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో అధికారాలను పంచుకోవడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. కుటుంబ వ్యవహారాల్లో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఇతరుల వ్యవహారాల్లో కల్పించుకోకపోవడం మంచిది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): బుధ, రవి గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడానికి అవ కాశం ఉంటుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తయి, ఒత్తిడి తగ్గుతుంది. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ఇష్టమైన ప్రాంతానికి స్థాన చలనం జరిగే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): గురు, శుక్రుల బలం ఎక్కువగా ఉన్నందువల్ల అనేక విషయాల్లో అనుకూల ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి సంబంధించి ఎటువంటి ప్రయత్నం తల పెట్టినా విజయవంతం అవుతుంది. బంధువుల నుంచి ఆస్తికి సంబంధించిన ప్రతిపాదన వస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ కృషికి, మీ ప్రతిభకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారాలు స్థిరంగా ముందుకు సాగుతాయి. జీవిత భాగస్వామికి చిన్నపాటి అదృష్టం పడుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): బుధ, శుక్ర గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల రోజంతా సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఆదాయంలో కొద్దిగా పెరుగుదల కనిపిస్తుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతున్నప్పటికీ వీటి మీద మరింతగా శ్రద్ధ పెట్టడం మంచిది. పట్టుదలగా ఆస్తి వ్యవహారాలను చక్కబెడతారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): గురు గ్రహం భాగ్య స్థానంలో సంచరిస్తున్నందువల్ల ఆదాయపరంగా, ఉద్యోగపరంగా ఇబ్బందులేవీ ఉండకపోవచ్చు. ఇతరులకు సహాయం చేయడం జరుగుతుంది. ఉద్యోగంలో అధికారులకు, సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. కుటుంబ వ్యవహారాలను ఓర్పుగా పరిష్కరించుకోవడం మంచిది. తండ్రి కారణంగా ఆస్తి వివాదం ఒకటి సానుకూలపడుతుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): శని, శుక్రుల అనుకూలత వల్ల ఆదాయం పెరగడం, రుణ భారం తగ్గడం, మంచి పరిచయాలు ఏర్పడడం వంటివి జరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలను నిర్వహించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్నేహితులను నమ్మి ఆర్థికంగా నష్టపోతారు. వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా సాగిపో తాయి కానీ, వ్యాపారాల్లో పోటీదార్ల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ సౌఖ్యం తగ్గు తుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్త అందుకుంటారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): మూడు శుభ గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల ఏ పని ప్రారంభించినా, ఏ ప్రయత్నం తల పెట్టినా తప్పకుండా విజయవంతం అవుతాయి. రోజంతా అనుకూలంగా సాగిపోతుంది. ఆదాయం పెరుగుతుందే తప్ప తగ్గే అవకాశం ఉండదు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం పెరుగుతుంది. అధికార బాధ్యతలు నిర్వహించడం జరగుతుంది. వ్యాపారాన్ని విస్తరించాలనే అభిప్రాయానికి వస్తారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవు తాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): రవి, కుజ, బుధ గ్రహాలు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు లాభసాటిగా, ఆశాజనకంగా సాగిపోతాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఆదాయం అనుకూ లంగా ఉంటుంది. ప్రధానమైన ప్రయత్నాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. కుటుంబ సమస్యలన్ని సమయస్ఫూర్తితో పరిష్కరించుకుంటారు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): గురు, శనుల సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి సాధ్యమవుతుంది. ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రతిభా పాటవాలకు వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా, సామాజికంగా కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయ ప్రయ త్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ధన స్థానంలో ఉన్న శనీశ్వరుడి వల్ల ఆదాయంలో మధ్య మధ్య పెరుగుదల కనిపిస్తూ ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు మంచి ఫలితాలను ఇస్తాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యో గంలో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ, సకాలంలో వాటిని పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో బాగా యాక్టివిటీ పెరుగుతుంది. అనారోగ్యాల నుంచి చాలావరకు కోలుకుంటారు. జీవిత భాగ స్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ప్రధాన గ్రహాలు అంతగా అనుకూలంగా లేకపోవడం వల్ల ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవ హరించడం మంచిది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. ఆశించిన ప్రతిఫలం ఉన్నప్పటికీ, వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం పెరిగి ఇబ్బంది పడతారు. వ్యాపారాలు సాధారణంగా సాగిపోతాయి. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. వ్యక్తిగత సమస్యలు కొద్దిగా ఒత్తిడికి గురి చేస్తాయి. స్వలా భానికి ఉపయోగించుకునే వారి వల్ల నష్టపోతారు. కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): రాశ్యధిపతి గురువు ధన స్థానంలో ఉండడం వల్ల ఆర్థికంగా బాగా కలసి వస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తు లతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభి స్తుంది. జీతభత్యాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందు తుంది. పిల్లలు విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామికి కెరీర్ పరంగా అదృష్టం పడుతుంది.