AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mars Transit: కన్యా రాశిలో కుజ గ్రహ సంచారం.. ఆ రాశుల వారికి కొత్త అవకాశాలు, గుర్తింపు పక్కా..!

ప్రస్తుతం బుధుడి స్వక్షేత్రమైన కన్యా రాశిలో కుజ గ్రహం సంచరించడం వల్ల టెక్నికల్, టెక్నలాజికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మేథ్స్, అకౌంట్స్ తదితర క్రియేటివ్ రంగాల వారికి విశేషంగా యోగం పడుతుంది. వీరికి కొత్త ఉద్యోగ అవకాశాలు లభించడం, ఇప్పటికే ఈ రంగాల్లో ఉన్నవారికి గుర్తింపు లభించడం, పదోన్నతులకు అవకాశాలు ఉండడం వంటివి జరుగుతాయి.

Mars Transit: కన్యా రాశిలో కుజ గ్రహ సంచారం.. ఆ రాశుల వారికి కొత్త అవకాశాలు, గుర్తింపు పక్కా..!
Mars Transit
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 21, 2023 | 7:09 PM

Share

Kuja Gochar: జ్యోతిష శాస్త్రం ప్రకారం కుజుడికి సంబంధించిన మేష, వృశ్చిక రాశుల్లో బుధుడున్నా, బుధుడికి సంబంధించిన మిథున, కన్యా రాశుల్లో కుజుడున్నా ‘సాంకేతికం’గా మార్పులు చోటు చేసుకోవడం, రాణించడం వంటివి జరుగుతాయి. ప్రస్తుతం బుధుడి స్వక్షేత్రమైన కన్యా రాశిలో కుజ గ్రహం సంచరించడం వల్ల టెక్నికల్, టెక్నలాజికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మేథ్స్, అకౌంట్స్ తదితర క్రియేటివ్ రంగాల వారికి విశేషంగా యోగం పడుతుంది. వీరికి కొత్త ఉద్యోగ అవకాశాలు లభించడం, ఇప్పటికే ఈ రంగాల్లో ఉన్నవారికి గుర్తింపు లభించడం, పదోన్నతులకు అవకాశాలు ఉండడం వంటివి జరుగుతాయి. అక్టోబర్ 3 వరకూ కుజుడు కన్యా రాశిలోనే సంచరిస్తున్నందువల్ల ఈ లోగా మేషం, వృషభం, మిథునం, సింహం, వృశ్చికం, ధనస్సు, మకరం, మీన రాశులకు చెందినవారికి తప్పకుండా మంచి అవకాశాలు, ఆశించిన గుర్తింపు లభిస్తాయి.

  1. మేషం: ఈ రాశి అధిపతి అయిన కుజుడు కన్యారాశిలో సంచరించడం వల్ల ఐ.టి, టెక్నాలజీ రంగానికి చెందిన వారికి ఉద్యోగపరంగా సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. విదేశీ అవకాశాలు అంది వస్తాయి. వీరి ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభించడం వల్ల కొత్త ప్రాజెక్టులను స్వీకరించాల్సి వస్తుంది. ఈ విషయంలో పని భారం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, తప్పకుండా ఆశించిన ప్రయోజనాలు, ప్రతిఫలాలు అందుబాటులోకి వస్తాయి.
  2. వృషభం: ఈ రాశివారికి పంచమ స్థానమైన కన్యారాశిలో కుజ సంచారం వల్ల టెక్నికల్, టెక్నలాజికల్ ఉద్యో గాలకు సంబంధించి వీరు ఒక నాయకత్వ స్థానంలోకి చేరుకోవడం జరుగుతుంది. వీటికి సంబం ధించి సొంతగా వ్యాపారం ప్రారంభించే అవకాశం కూడా ఉంటుంది. ఎక్కువగా పర్యటనలు చేయాల్సి ఉంటుంది. కొత్త ప్రాజెక్టులను చేపట్టి సమర్థవంతంగా వాటిని పూర్తి చేయడం జరుగు తుంది. ఈ రంగాలకు సంబంధించిన నిపుణులు సాధారణంగా నిరుద్యోగంగా ఉండే అవకాశం లేదు.
  3. మిథునం: ఈ రాశికి నాలుగవ స్థానంలో కుజ సంచారం వల్ల చదువుల్లో కూడా ఈ రంగాలకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. ఉన్నత విద్యలకు విదేశాలకు వెళ్లవలసి రావడం, ఈ రంగాలలో అక్కడే ఉద్యోగాలు సంపాదించడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఈ రంగాల వారికి తప్పకుండా విదేశీ యానం ఉంటుంది. విదేశీ సంస్థల సహకారంతో తమ రంగంలో విశేషంగా పురోగతి సాధించే అవ కాశం ఉంటుంది. ఎవరితోనైనా కలిసి సొంతగా వ్యాపారం ప్రారంభించే సూచనలు కూడా ఉన్నాయి.
  4. సింహం: ఈ రాశివారికి ద్వితీయ స్థానంలో కుజ సంచారం వల్ల ఈ రంగాలకు చెందినవారు తప్పకుండా మంచి గుర్తింపు తెచ్చుకోవడం, ఈ రంగాలలో విశేషంగా రాణించడం జరుగుతుంది. కుటుంబ సభ్యులలో ఒకరు ఈ రంగాలలో పురోగతి సాధించే అవకాశం ఉంది. ఈ రంగాలకు చెందినవారు ఏ ప్రయత్నం తలపెట్టినా, ఏ సంస్థలో ఉద్యోగాన్ని ఆశించినా అది సఫలం అయ్యే అవకాశం ఉంటుంది. తమ పనితీరుతో అందరినీ ఆకట్టుకోవడమే కాక, అధికారం చేపట్టడం కూడా జరుగు తుంది.
  5. వృశ్చికం: ఈ రాశికి లాభ స్థానమైన కన్యా రాశిలో కుజ సంచారం వల్ల ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ రంగాల వారు తప్పకుండా అనూహ్యమైన పురోగతి సాధించడం జరుగుతుంది. ఇప్పటికే ఈ రంగాల్లో ఉన్నవారు మరింత అడ్వాన్స్ డ్ కోర్సుల్లో శిక్షణ పొందే అవకాశం ఉంది. ఈ రంగాలవారు విదేశాల్లో ఉద్యో గాలు సంపాదించుకోవడం, స్థిరపడడం వంటివి జరగవచ్చు. అంతేకాక, ఈ రంగాలకు సంబం ధించిన వారు ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అయ్యే సూచనలున్నాయి.
  6. ధనుస్సు: ఈ రాశికి దశమ స్థానంలో కుజ సంచారం వల్ల ఐ.టి, ఎలక్ట్రానిక్ రంగాలకు చెందినవారు తప్ప కుండా అధికార బాధ్యతలను చేపట్టడం, కొత్త ప్రాజెక్టులతో ప్రమేయం కలిగి ఉండడం, తరచూ విదే శాలు వెళ్లి వస్తుండడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఈ రంగాలకు సంబంధించిన నైపుణ్యాలను మరింతగా అభివృద్ధి చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈ రంగాలకు సంబంధించి సొంతగా సంస్థను ప్రారంభించి రాణించే సూచనలున్నాయి. ఈ రంగాలలో కొత్త బాధ్యతలను చేపట్టవచ్చు.
  7. మకరం: ఈ రాశికి భాగ్య స్థానమైన కన్యారాశిలో కుజ సంచారం జరగడం వల్ల ఐ.టి. ఎలక్ట్రానిక్స్, ఇతర టెక్నాలజీ రంగాలకు చెందినవారికి విదేశాల నుంచి మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు ఈ రంగాలకు సంబంధించి విదేశాలలో ఉన్నత విద్యావకాశాలు లభించే సూచనలు న్నాయి. ఈ రంగాల్లో ఉన్నవారు తమ సంస్థల్లో మంచి గుర్తింపును తెచ్చుకోవడంతో పాటు అతి త్వరగా పురోగతి సాధించడం, గౌరవమర్యాదలు అందుకోవడం వంటివి తప్పకుండా జరుగు తాయి.
  8. మీనం: ఈ రాశికి సప్తమ స్థానంలో కుజుడు సంచరించడం వల్ల ఉద్యోగంలో పురోగతి చెందడంతో పాటు, సొంతగా సంస్థను ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. విదేశీ సంస్థల్లో పనిచేయడం గానీ, దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సంస్థలో అధికారం చేపట్టడం గానీ జరుగుతుంది. ఈ రాశికి చెందిన ఐ.టి, ఎలక్ట్రానిక్స్ రంగాలవారికి డిమాండ్ పెరగడం, ముఖ్యమైన కంపెనీల నుంచి ఆఫర్లు రావడం వంటివి జరుగుతాయి. ఈ రంగాలవారు విదేశాల్లో స్థిరపడడం కూడా జరగవచ్చు.

Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.  దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.