Parivartan Yoga: పరివర్తన యోగంతో ఆ రాశుల వారికి లాభం..! మీ రాశికి ఎలా ఉంటుందంటే..?
Zodiac Signs: రవి, బుధ గ్రహాల మధ్య పరివర్తన యోగం చోటు చేసుకుంది. బుధుడి క్షేత్రంలో రవి, రవి క్షేత్రంలో బుధుడు సంచారం చేస్తున్నందువల్ల ఈ యోగం ఏర్పడింది. ఈ రెండు గ్రహాలు కలవడమే కాదు, ఈ రెండు గ్రహాల మధ్య పరివర్తన జరిగినా అది చాలావరకు బుధాదిత్య యోగం కిందకే వస్తుంది.
రవి, బుధ గ్రహాల మధ్య పరివర్తన యోగం చోటు చేసుకుంది. బుధుడి క్షేత్రంలో రవి, రవి క్షేత్రంలో బుధుడు సంచారం చేస్తున్నందువల్ల ఈ యోగం ఏర్పడింది. ఈ రెండు గ్రహాలు కలవడమే కాదు, ఈ రెండు గ్రహాల మధ్య పరివర్తన జరిగినా అది చాలావరకు బుధాదిత్య యోగం కిందకే వస్తుంది. వాస్తవానికి ఈ పరివర్తన యోగం వల్ల వృషభం, సింహం, వృశ్చికం, ధనూ రాశుల వారికి గరిష్ఠంగా మేలు జరగబోతోంది. ఈ రాశులవారికి మంచి అదృష్టం పట్టబోతుండగా మిగిలిన రాశులకు సైతం ఈ యోగం వల్ల తప్పకుండా కొద్దో గొప్పో లాభం ఉంటుంది. ఈ యోగం అక్టోబర్ 2 వరకు కొనసాగుతుంది.
- మేషం: ఈ రాశివారికి రవి, బుధుల మధ్య పరివర్తన అంటే 5, 6 రాశుల మధ్య పరివర్తన అవుతుంది. దీనివల్ల తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, కొన్ని ఆలోచనలు సత్ఫలితాలను ఇవ్వ కపో వడం, పట్టు విడుపులు లేకుండా మొండిగా వ్యవహరించడం వంటివి జరుగుతాయి. దీనివల్ల జాతకుడు కొద్దో గొప్పో నష్టపోవడం జరుగుతుంది. ఇతరుల సమస్యల్లో ఇరుక్కోవడం, వృత్తి, ఉద్యో గాల్లో కొద్దిగా ప్రాధాన్యం కోల్పోవడం వంటివి జరుగుతాయి. పిల్లల వల్ల సమస్యలు తలెత్తుతాయి.
- వృషభం: ఈ రాశివారికి 4, 5 స్థానాల అధిపతుల మధ్య పరివర్తన చోటు చేసుకోవడం వల్ల దీనిని ఒక మహా యోగంగా పరిగణించాల్సి ఉంటుంది. వీరి ఆలోచనలు, ప్రయత్నాలన్నీ విజయం సాధిస్తాయి. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రాభవం పెరుగుతుంది. యావత్ కుటుంబానికి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఇల్లూ, వాహనం అమరుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. పిల్లలు బాగా అభివృద్ధిలోకి వస్తారు. మంచి గుర్తింపు లభిస్తుంది.
- మిథునం: ఈ రాశివారికి మూడు, నాలుగు స్థానాల మధ్య పరివర్తన జరగడం వల్ల పాక్షికంగా యోగం పట్టింది. దీనివల్ల వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం లేని పదోన్నతి ఉంటుంది. జీతభత్యాల విషయంలో తాత్సారం జరుగుతుంది. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది కానీ, తోబుట్టువులతో సఖ్యత కొరవడుతుంది. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతత తగ్గుతుంది. తొందర పాటు నిర్ణయాల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. తండ్రి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.
- కర్కాటకం: ఈ రాశికి రెండు, మూడు స్థానాల మధ్య పరివర్తన జరగడం వల్ల ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అనేక మార్గాలలో ఆదాయం లభిస్తుంది. అయితే, ఖర్చులు పెరగడం, మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోవడం వంటివి జరిగే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల, సోదర వర్గం వల్ల బాగా కలిసి వస్తుంది. గృహ, వాహన సౌకర్యాలు అమరే సూచనలున్నాయి. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారం అవుతుంది. స్వల్ప అనారోగ్యాలతో ఇబ్బంది పడే సూచనలున్నాయి.
- సింహం: ఈ రాశికి 1, 2 స్థానాల మధ్య పరివర్తన జరగడం వల్ల అప్రయత్న ధన లాభానికి అవకాశం ఉంది. ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. కుటుంబపరంగా సంపద వృద్ధి చెందుతుంది. సామాజికంగా పలుకుబడి పెరుగు తుంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో సంపాదన రెండింతలవుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
- కన్య: ఈ రాశివారికి 1, 12 స్థానాల మధ్య పరివర్తన జరగడం వల్ల సంపాదన కంటే అనవసర ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. వైద్య ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. దాచుకున్న ధనాన్ని వెలికి తీయాల్సి వస్తుంది. శత్రువులది పైచేయి అవుతుంది. కష్టార్జితంలో సగానికి సగం వృథా అవుతుంది. కొందరు మిత్రుల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. దూర ప్రయాణాలు తప్పకపోవచ్చు.
- తుల: ఈ రాశివారికి 11, 12 స్థానాల మధ్య పరివర్తన జరుగుతోంది. దీనివల్ల మిశ్రమ ఫలితాలు అనుభ వానికి వస్తాయి. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో స్థిరత్వం లభిస్తుంది. ఇవి గౌరవప్రదంగా సాగిపోతాయి. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి మాత్రం మూడు పువ్వులు, ఆరు కాయలుగా జీవితం సాగిపోతుంది. అయితే, స్నేహితుల కారణంగా భారీగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. మోసం చేసే వారు చుట్టూ చేరే సూచనలున్నాయి.
- వృశ్చికం: ఈ రాశికి 10, 11 స్థానాల మధ్య రవి, బుధ గ్రహాల పరివర్తన జరగడం వల్ల, వృత్తి, ఉద్యోగ, వ్యాపా రాల పరంగా మరింతగా పురోగతి సాధ్యమవుతుంది. ఆదాయం గణనీయంగా పెరుగు తుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, పదోన్నతులు చోటు చేసుకుం టాయి. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి. ఆశించిన శుభ వార్తలు వినడం జరుగుతుంది.
- ధనుస్సు: ఈ రాశికి తప్పకుండా మహా యోగం పడుతుంది. ఈ రాశికి 9, 10 స్థానాల మధ్య పరివర్తన చోటు చేసుకోవడం అదృష్టమనే చెప్పాలి. అసాధ్యమనుకున్నవన్నీ సుసాధ్యంగా జరిగే అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధించడం జరుగుతుంది. సంపన్న వర్గంలో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. రాజకీయాలు, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి కూడా అవకాశం ఉంది.
- మకరం: ఈ రాశివారికి 8, 9 స్థానాల మధ్య పరివర్తన జరగడం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. జీవిత భాగస్వామికి యోగం పడుతుంది. జీవిత భాగస్వామికి కెరీర్ పరంగా శుభ ఫలితాలు అనుభ వానికి రావడం, మంచి గుర్తింపు లభించడం వంటివి జరుగుతాయి. ఈ రాశివారికి దీర్ఘకాలిక అనారోగ్యం ఏదైనా పట్టుకునే సూచనలున్నాయి. ఆహార విహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వృథా ప్రయాణాల వల్ల ఇబ్బంది పడతారు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది.
- కుంభం: ఈ రాశివారికి 7, 8 స్థానాల మధ్య పరివర్తన జరగడం ఏమంత మంచిది కాదు. ఆహార, విహారా ల్లోనూ, ప్రయాణాల్లోనూ అతి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అనవసర వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. జీవిత భాగస్వామికి చిన్నపాటి అదృష్టం పట్టే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారాల్లో పురోగతి చెందడం జరుగుతుంది. మిత్రుల్లో కొందరు శత్రువులుగా మారే అవకాశం ఉంది. తండ్రి ఆరోగ్యం ఆందోళన కలిగించవచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.
- మీనం: ఈ రాశివారికి 6, 7 స్థానాల మధ్య పరివర్తన జరగడం వల్ల మిశ్రమ ఫలితాలుంటాయి. జీవిత భాగస్వామితో ఇబ్బందులు ఏర్పడతాయి. భార్యాభర్తలు వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగం చేయాల్సి రావచ్చు. అనవసర పరిచయాలకు అవకాశం ఉంది. కొందరు మిత్రులు, దగ్గర బంధువులు తప్పు దారి పట్టించే సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆధ్యా త్మిక చింతన పెరిగి, దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొనడం జరుగుతుంది. ఆరోగ్య సమస్యలు తలెత్త వచ్చు.
Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.