Horoscope Today: ఆరోగ్యం విషయంలో ఆ రాశుల వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు..!
దిన ఫలాలు (మార్చి 18, 2024): మేష రాశి వారు చేపట్టిన పనులన్నీ ఉత్సాహంగా పూర్తిచేస్తారు. వృషభ రాశి వారి ఆర్థిక ప్రయత్నాలు సఫలం అవుతాయి. మిథున రాశి వారికి ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
దిన ఫలాలు (మార్చి 18, 2024): మేష రాశి వారు చేపట్టిన పనులన్నీ ఉత్సాహంగా పూర్తిచేస్తారు. వృషభ రాశి వారి ఆర్థిక ప్రయత్నాలు సఫలం అవుతాయి. మిథున రాశి వారికి ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
గృహ, వాహన సంబంధమైన దీర్ఘకాలిక రుణ ఒత్తిడి నుంచి చాలావరకు బయటపడే అవకాశముంది. బంధువర్గంతో నెలకొన్న వివాదాలు సర్దుమణుగుతాయి. చేపట్టిన పనుల్ని ఉత్సాహంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగాలు సాదా సీదాగా సాగిపోతాయి. మీలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పిల్లల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. కొత్త ఉద్యోగానికి సంబంధించి కంపెనీల నుంచి కీలక సమాచారం అందుతుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. మీ ఆర్థిక ప్రయత్నాలు సఫలం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా పనిభారం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకావఝం ఉంది. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి తగ్గే సూచనలున్నాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. దీర్ఘకాలిక రుణాల ఒత్తిడిని తగ్గించుకుంటారు. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఈ రాశి వారికి ఈ రోజంతా ఉత్సాహంగా గడిచిపోతుంది. శుభ పరిణామం చోటు చేసుకునే అవకాశముంది. ఇదివరకు దూరమైన ప్రమోషన్లు ఇప్పుడు అందే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో సన్నిహితులు సహాయపడతారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. చేపట్టిన పనుల్లో యత్న కార్యసిద్ధి ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగు తాయి. ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. ఉద్యోగంలో అధికారుల అండదండలు లభిస్తాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక ఇబ్బందులు కొద్దిగా చిరాకు కలిగిస్తాయి. రావలసిన డబ్బు ఒక పట్టాన చేతికి అందదు. దూర ప్రయాణ సూచనలున్నాయి. చేపట్టిన పనులు చాలావరకు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. వృత్తి, వ్యాపా రాలు సామాన్యంగా సాగిపోతాయి. ఉద్యోగంలో సానుకూల వాతావరణం ఉంటుంది. ఒక వ్యక్తిగత సమస్య కారణంగా మానసిక ఒత్తిడికి గురవుతారు. స్వల్ప అనారోగ్యం కూడా బాధిస్తుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
కుటుంబ సమేతంగా శుభ కార్యంలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఉపయోగకర పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. పిల్లలకు కొత్త విద్య, ఉద్యోగావకాశాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. మీకు ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఇతరులకు సహాయం చేసే పరిస్థితిలో ఉంటారు. విద్యార్థులు బాగా కష్టప డాల్సి ఉంటుంది. కుటుంబ పెద్దల్లో ఒకరి ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. ఎవరికీ హామీలు ఉండ వద్దు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగంలో ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఇంటా బయటా పరిస్థితులు చాలావరకు మీకు అనుకూలంగా మారుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దుతారు. వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. కుటుంబ సమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. ఆదాయానికి ఇబ్బంది ఉండదు. కుటుంబ పెద్దల కారణంగా ఒక వ్యవహారం సునాయాసంగా పరిష్కారమయ్యే అవకాశముంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలు ప్రవేశపెడతారు. విలువైన వస్తు లాభాలు పొందుతారు. కొత్త కార్యక్రమాలు, ప్రయత్నాలు చేపడతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారతారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ఉద్యోగంలో కొత్త ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఆలయాల దర్శనం చేసుకుంటారు. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి.
వృశ్చికం (విశాఖ, అనూరాధ, జ్యేష్ట)
ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఆశించిన శుభవార్తలు అందుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు చేపడతారు. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుం టాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. గృహ నిర్మాణ కార్యక్రమాలు పురోగతి సాధిస్తాయి. రాజకీయ ప్రము ఖులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. చేపట్టిన పనులు వేగంగా, చురుకుగా పూర్తవుతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
కొందరు బంధు మిత్రులతో ఈ రాశి వారు ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఆటంకాలను అధిగమించి కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో శ్రమాధిక్యత ఉంటుంది. మీకు వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ వృథా ఖర్చులు పెరుగుతాయి. సమాజంలోని ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఒకట్రెండు వ్యక్తిగత సమస్యల నుంచి మీకు విముక్తి లభించే అవకాశముంది. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉంటుంది. విశ్రాంతి కరువయ్యే అవకాశం ఉంది. దైవ చింతన పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాలు ఉత్సా హంగా ముందుకు సాగుతాయి. ప్రతిభా పాటవాలకు గుర్తింపు లభిస్తుంది. ఆదాయానికి ఇబ్బంది ఉండదు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉపయోగకరమైన పరిచయాలు పెరుగుతాయి. ప్రయాణాల వల్ల ఆర్థికంగా ప్రయో.జనం పొందు తారు. రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటారు. దీర్ఘకాలిక రుణాల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూ లంగా ఉంటుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. కుటుంబంతో విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగుంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఈ రాశి వారు ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ముఖ్యంగా మీరు చేపట్టే ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. చేపట్టిన పనులన్నీ పూర్తవుతాయి. సమాజంలో పలుకుబడి మరింత పెరుగుతుంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వచ్చే అవకాశముంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్వల్ప అనా రోగ్యాలకు అవకాశం ఉంది జాగ్రత్త. బంధువుల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశముంది. మీరు ఆశించిన శుభ వార్తలు వింటారు.వ్యాపారాల్లో లాభాలు అంచనాలకు మించి పెరుగుతాయి.