Horoscope Today: వారి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.. 12రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు
Today Horoscope (18 December, 2024): మేష రాశి వారికి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు అందే అవకాశముంది. వృషభ రాశి వారికి ఆదాయానికి లోటుండదు. మిథున రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సాగియే అవకాశముంది. అలాగే ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
దిన ఫలాలు (డిసెంబర్ 18, 2024): మేష రాశి వారికి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వినడం జరుగుతుంది. వృషభ రాశి వారికి ఆదాయానికి లోటుండదు. ఇతరుల వివాదాల్లో కల్పించుకోకపోవడం మంచిది. మిథున రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగంలో మీ సమర్థతను నిరూపించుకుంటారు. వృత్తి, వ్యాపారాలు బాగా మెరుగైన స్థితిలో ఉంటాయి. ఆదాయాన్ని పెంచుకోవడానికి ఎక్కువగా శ్రమపడతారు. పెండింగ్ పనులన్నీ పూర్తవు తాయి. ఆస్తి వివాదాన్ని పట్టుదలగా పరిష్కరించుకుంటారు. బంధుమిత్రులతో సఖ్యత, సయోధ్య వృద్ధి చెందుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వినడం జరుగుతుంది. వ్యక్తి గత సమస్యల పరిష్కారం మీద శ్రద్ధ పెడతారు. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. వ్యాపారాలలో అనుకూలతలు పెరుగుతాయి. ఆదాయానికి లోటుండదు. ఇతరుల వివాదాల్లో కల్పించుకోకపోవడం మంచిది. సొంత పనుల మీద దృష్టి పెట్టడం అవసరం. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. కొద్ది శ్రమతో పెండింగ్ పనులు, వ్యవహారాలను పూర్తి చేస్తారు. కుటుంబం మీద ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక సమ స్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. వ్యక్తిగత సమస్యలను చాలావరకు పరిష్కరించుకుంటారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగాలలో మంచి గుర్తింపు లభిస్తుంది. అధికారులకు మీ సమర్థత మీద నమ్మకం పెరు గుతుంది. వృత్తి జీవితం ఆశాజనకంగా సాగుతుంది. వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి. ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వ్యక్తిగత సమ స్యల పరిష్కారంలో కుటుంబ సభ్యుల సలహాలు ఉపకరిస్తాయి. ప్రముఖులతో సన్నిహిత సంబం ధాలు ఏర్పడతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగులు ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు మారిపోయే అవకాశం ఉంది. పనిభారం, పని ఒత్తిడి బాగా తగ్గు తాయి. ఆదాయ వృద్ధికి కొత్త ప్రయత్నాలు చేపడతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికర స్థాయిలో ఉంటుంది. వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిపాటి ఉపశమనం లభిస్తుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు, ఉద్యోగం మారే ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. వ్యాపారాల్లో కార్యకలాపాలు వృద్ధి చెందుతాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగాలలో మీ సలహాలు, సూచనలకు విలువ పెరుగుతుంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాలు, సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో వసూలవుతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. గృహ ప్రయ త్నాలు సఫలమవుతాయి. పిల్లలు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ధనపరంగా ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో మీ పని తీరుకు, శక్తి సామర్థ్యాలకు గుర్తింపు లభిస్తుంది. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇతరుల నుంచి రావలసిన డబ్బును కొద్ది శ్రమతో రాబట్టుకుంటారు. వ్యాపారంలో కొద్ది మార్పులు చేపడతారు. పిల్లల విషయంలో శ్రద్ధ పెంచడం మంచిది. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో వీలైనంత జాగ్రత్తగా ఉండడం అవసరం.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగంలో మీకు బాగా డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాల్లో కీలక మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్త వుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సంతృప్తికరంగా నెరవేరుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు సునాయాసంగా పూర్తవుతాయి. ఆర్థిక పరి స్థితి బాగా మెరుగుపడుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి కాస్తంత ఒత్తిడి ఉంటుంది. వేధింపులు కూడా ఉండవచ్చు. వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ముందుకు సాగు తాయి. ఆదాయానికి లోటుండకపోవచ్చు కానీ, కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వ్యక్తి గత సమస్యల ఒత్తిడి ఉంటుంది. కొందరు బంధువులతో అకారణ విభేదాలు తలెత్తుతాయి. తల్లి తండ్రుల నుంచి అవసరమైన సాయం లభిస్తుంది. నిరుద్యోగులు ఆశించిన శుభవార్తలు వింటారు.
ధనుస్పు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వృత్తి జీవితం బిజీగా సాగిపో తుంది. వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబంతో కలిసి ఇష్టమైన ఆల యాలు సందర్శిస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఒకరి ద్దరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగంలో బాధ్యతల మార్పు జరిగే అవకాశం ఉంది. మీ పనితీరుకు ఆశించిన గుర్తింపు లభి స్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపో వచ్చు. ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. సొంత పనుల మీద దృష్టి పెడతారు. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. శరీరానికి విశ్రాంతి అవసరమని గ్రహించండి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో పొరపాట్లు దొర్లే అవకాశం ఉంది. కాస్తంత అప్రమత్తంగా ఉండడం మంచిది. వృత్తి జీవి తంలో లక్ష్యాలు పెరుగుతాయి. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. బంధువుల రాకపోకలతో బాగా ఒత్తిడి పెరుగుతుంది. ఆస్తి వివాదాల్లో, ఆర్థిక వ్యవహారాల్లో కుటుంబ పెద్దల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా సాగిపోతుంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఇంటా బయటా మీ సలహాలకు, సూచనలకు విలువ ఉంటుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. అనారోగ్యం నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది కానీ, అనవసర ఖర్చులతో ఇబ్బంది ఉంటుంది. నిరుద్యోగులకు ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి.