AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology 2025: అనుకూలంగా 4 కీలక గ్రహాలు.. కొత్త ఏడాది సొంత ఇల్లు గ్యారంటీ..!

Own House Astrology: కొత్త ఏడాది(2025)లో శని, గురు, రాహు, కేతువులు రాశులు మారుతున్నందువల్ల అనేక రాశుల వారికి ఆటంకాలు, అవరోధాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు తొలగిపోయి కొత్త జీవితం ఏర్పడే అవకాశం ఉంది. సొంత ఇల్లు, సొంత వాహనం వంటి ముఖ్యమైన కలలు, మనసులోని కోరికలు తప్పకుండా నెరవేరేందుకు అనుకూలమైన సంవత్సరం ఇది.

Astrology 2025: అనుకూలంగా 4 కీలక గ్రహాలు.. కొత్త ఏడాది సొంత ఇల్లు గ్యారంటీ..!
Own House Astrology
TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Dec 17, 2024 | 7:52 PM

Share

కొత్త ఏడాదిలో శని, గురు, రాహు, కేతువులు రాశులు మారుతున్నాయి. దీని అనేక రాశుల వారికి ఆటంకాలు, అవరోధాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్యాలు తొలగిపోయి కొత్త జీవితం ఏర్పడే అవకాశం ఉంది. సొంత ఇల్లు, సొంత వాహనం వంటి ముఖ్యమైన కలలు, మనసులోని కోరికలు తప్పకుండా నెరవేరడం జరుగుతుంది. ఇల్లు, వాహనాలు, ఇతర సౌకర్యాలను సమకూర్చుకునే రాశుల్లో వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం, కుంభ రాశులున్నాయి. శని మార్చి 29న, రాహుకేతువులు మే 18న, గురువు మే 25న రాశులు మారుతున్నప్పటికీ, వాటికి సంబం ధించిన శుభ ఫలితాలు రెండు నెలల ముందు నుంచి అనుభవానికి వచ్చే అవకాశం ఉంది.

  1. వృషభం: ఈ రాశికి ఈ నాలుగు గ్రహాలు అనుకూలంగా మారుతున్నందువల్ల ఏడాది ప్రథమార్థంలోనే సొంత ఇంటి కల నెరవేరే అవకాశం ఉంది. ఆదాయానికి, సంపదకు లోటు లేని పరిస్థితి ఏర్పడుతు న్నందువల్ల ఈ రాశివారు స్థలాలు, పొలాలు, తోటలు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. కొత్త సంవత్సరంలో ఈ రాశివారు తప్పకుండా కోటీశ్వరులు కావడం జరుగుతుంది. వీరి మనసులోని కోరికలు అనేకం నెరవేరుతాయి. సమాజంలోని ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి.
  2. సింహం: ఈ రాశివారికి గురు, రాహుకేతువులతో పాటు ఇతర గ్రహాలు కూడా బాగా అనుకూలంగా మారు తున్నందువల్ల ఈ రాశివారు కొత్త ఏడాది ప్రథమార్థంలోనే గృహ, వాహన సౌకర్యాలను అమర్చు కోవడం, ఆస్తిపాస్తులను పెంపొందించుకోవడం వంటివి జరుగుతాయి. ఈ రాశివారికి కొత్త ఏడాదిలో షేర్లు, స్పెక్యులేషన్లు, పెట్టుబడులు, ఇతర ఆర్థిక లావాదేవీలు దాదాపు కనక వర్షం కురిపిస్తాయి. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. జీతభత్యాలు, లాభాలు, రాబడి బాగా వృద్ధి చెందుతాయి.
  3. తుల: నాలుగు గ్రహాల అనుకూలత వల్ల ఈ రాశివారు బాగా అదృష్టవంతులయ్యే అవకాశం ఉంది. వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది. సొంత ఇంటి కల తప్పకుండా నెరవేరుతుంది. వాహన యోగం కూడా పడుతుంది. స్థలాలు, పొలాలను కొనుగోలు చేయడం జరుగుతుంది. అనేక విధాలుగా సంపద వృద్ధి చెందుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. అనేక శుభ కార్యాలు జరుగుతాయి. ఎక్కువగా శుభవార్తలు వింటారు.
  4. ధనుస్సు: ఈ రాశికి గురు, రాహు కేతువులు అత్యంత శుభ ఫలితాలను ఇవ్వడం జరగబోతోంది. ఆస్తి పాస్తులను కొనే అవకాశం ఉంది. ఆస్తుల విలువ ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. ఫ్లాట్ ను గానీ, ఇంటిని గానీ కొనుగోలు చేయడం జరుగుతుంది. జీవితంలో అనేక విధాలుగా స్థిరత్వం లభి స్తుంది. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్లు అంచనాలకు మించిన లాభాలనిస్తాయి. రావలసిన డబ్బంతా చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందడం జరుగుతుంది.
  5. మకరం: ఈ రాశివారికి శని, గురు, రాహు కేతువులతో పాటు కుజుడు కూడా అనుకూలంగా మారుతు న్నందువల్ల తప్పకుండా గృహ లాభం, భూ లాభం, ఆస్తి లాభం కలుగుతాయి. వాహన యోగం పడుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఇప్పటికే సొంత ఇల్లు ఉన్నవారు ఇంటిని మరమ్మతు చేసుకోవడం, లేదా ఆధునిక సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో రాబడి బాగా వృద్ధి చెందుతుంది. కొన్ని కోరికలు, ఆశలు నెరవేరుతాయి.
  6. కుంభం: ఈ రాశికి శని మినహా గురు, రాహుకేతువులు, కుజుడు బాగా అనుకూలంగా సంచారం చేస్తు న్నందువల్ల ఏడాది ప్రథమార్థంలోనే సొంత ఇంటిని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. ఈ రాశి వారికి కుజుడి అనుకూలత వల్ల తప్పకుండా భూ లాభం కలుగుతుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. సొంత ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆస్తిపాస్తులు అభివృద్ధి చెందుతాయి.