Horoscope Today: వారికి ఆర్థిక వ్యవహారాల్లో సానుకూలత.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు

Today Horoscope (December 17, 2024): మేష రాశి వారికి అనుకోకుండా ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితులు చాలా వరకు చక్కబడే అవకాశముంది. మిథున రాశి వారికి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: వారికి ఆర్థిక వ్యవహారాల్లో సానుకూలత.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు
Horoscope Today 17th December 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 17, 2024 | 5:01 AM

దిన ఫలాలు (డిసెంబర్ 17, 2024): మేష రాశి వారికి ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితులు చాలా వరకు చక్కబడతాయి. మిథున రాశి వారికి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు పెరిగి, తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అనేక వైపుల నుంచి ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. అనుకోకుండా ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆదాయానికి లోటుండకపోవచ్చు. రావలసిన డబ్బును రాబట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితులు చాలా వరకు చక్కబడతాయి. కొద్దిపాటి అనారోగ్యానికి అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లు తగ్గుముఖం పడతాయి. ధన పరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ఉద్యోగంలో అదనపు బాధ్యతల వల్ల ఇబ్బంది కలుగుతుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగ బాధ్యతల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. లాభాలకు, రాబడికి లోటుండదు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. దైవ కార్యాల్లో పాల్గొంటారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. రావలసిన సొమ్మును వసూలు చేసుకుంటారు. ఆర్థి కంగా అనుకూల పరిస్థితి ఏర్పడుతుంది. నిరుద్యోగులు ఆశించిన శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని కీలక మార్పులు చేపడతారు. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు సాఫీగా, సానుకూలంగా సాగిపోతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇతరులకు ఇతోధికంగా సహాయం చేస్తారు. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఆదాయ ప్రయత్నాల్లో శ్రమాధిక్యత ఉండవచ్చు. ఉద్యోగాల్లో అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. ఇంటా బయటా బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఎదురు చూస్తున్న సమాచారం అందుతుంది. ఇంటా బయటా మీ మాట చెల్లుబాటు అవుతుంది. పట్టుదలగా కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. రావలసిన డబ్బు కూడా సకాలంలో అందుతుంది. వృత్తి, వ్యాపారాలలో రాబడి ఆశించిన స్థాయిలో పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉంది. గృహ, వాహన ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. రాజకీయంగా ప్రాముఖ్యం పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో తీరిక ఉండకపోవచ్చు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి.

తుల (చిత్త 3,4,స్వాతి, విశాఖ 1,2,3)

ఆశించిన స్థాయిలో ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది కానీ, కుటుంబ ఖర్చులు బాగా పెరిగే సూచ నలున్నాయి. ఉద్యోగపరంగా శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది. కొత్త అవకాశాలు అందుతాయి. కుటుంబ వ్యవహారాలను సక్రమంగా పూర్తి చేస్తారు. పిల్లలు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. విదేశాల నుంచి శుభ సమాచారం అందుకుంటారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు, బకాయిలు అను కోకుండా చేతికి అందుతాయి. ఆస్తి సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి, వ్యాపారాల్లో కీలక మార్పులు చేపట్టి లాభాలు పొందుతారు. బంధువులతో కలిసి ఒక శుభకార్యంలో పాల్గొంటారు. ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. ఇంటా బయటా ఆశించిన గుర్తింపు లభిస్తుంది. బంధువుల వ్యక్తిగత వ్యవహారాల్లో తలదూర్చవద్దు. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆదాయం సంతృప్తికర స్థాయిలో ఉంటుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. గృహ, వాహన ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. మీ సలహాలు, సూచనల వల్ల అధికారులు లాభపడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి చాలావరకు బయటపడతాయి. నిరుద్యోగుల కల సాకారం అవుతుంది. మిత్రుల వల్ల ఆర్థికంగా కొద్దిగా నష్టపోయే అవకాశం ఉంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆదాయం నిలకడగా సాగిపోతుంది. ఆర్థిక సమస్యలు ఉండకపోవచ్చు. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ప్రాభవం బాగా పెరుగుతుంది. ఆర్థిక వ్యవ హారాలు సజావుగా సాగిపోతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు విస్తరిస్తాయి. వస్త్రా భరణాలు కొనుగోలు చేస్తారు. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఆర్థిక విష యాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. కొద్ది ప్రయత్నంతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఆర్థిక విషయాల్లో, ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది. కుటుంబ జీవితం చాలావరకు ప్రశాంతంగా ఉంటుంది. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి ఉంటుంది. బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఉద్యోగంలో అధికారులు కాస్తంత ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. నిరుద్యోగులు సొంత ఊర్లో మంచి ఉద్యోగం సంపాదించడం జరుగుతుంది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది.