Horoscope Today(July 15): వారికి శత్రువులు మిత్రులుగా మారి సహకరిస్తారు.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు..
Horoscope Today (15th July): జ్యోతిష్య శాస్త్రాన్ని విశ్వసించేవారు కోట్లాది మంది ప్రజలు ఉన్నారు. గ్రహాలు, నక్షత్రాల గమనాన్ని పరిగణలోకి తీసుకుని ఒకరి భవిష్యత్తు ఎలా ఉండబోతుందని లెక్కించడంతో పాటు వాటికి పరిహారాలు కూడా సూచిస్తారు జ్యోతిష్య పండితులు. మరి 12 రాశుల వారికి శనివారంనాడు దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఎప్పుడు ఏ ప్రయత్నం తలపెట్టినా అది చాలా వరకు సఫలం అయ్యే అవకాశం ఉంది. శుభ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో రాణిస్తారు. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. కొద్ది ప్రయత్నంతో ఆరోగ్యాన్ని కాపాడుకున్న పక్షంలో ముఖ్యమైన వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొనడం, విహార యాత్రకు వెళ్లడం, విందులో పాల్గొ నడం వంటివి జరుగుతాయి. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఎన్ని అడ్డంకులు, అవరోధాలు ఎదురైనా ముఖ్యమైన వ్యవహారాలను, పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలను చక్కబెడతారు. అదనపు ఆదాయ ప్రయత్నాల మీద పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తారు. ఉద్యోగంలో బరువు, బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలోనూ, ప్రయాణాల విషయంలోనూ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. పిల్లల పురో గతికి సంబంధించి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ప్రయత్న లోపం లేకుండా చూసుకుంటే ముఖ్యమైన వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. అష్టమ శని కారణంగా ఇంటా బయటా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. వ్యయ ప్రయాసలతో మీరు చేపట్టిన ప్రతి పనీ పూర్తవుతుంది. ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉన్నాయి. ఆహార, విహారాల్లో అశ్రద్ధ కారణంగా ఆరోగ్యానికి ఇబ్బంది ఏర్పడవచ్చు. వాహనాలను వేగంగా నడపకపోవడం మంచిది. కుటుంబ జీవితం చాలావరకు అనుకూలంగా సాగిపోతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): భవిష్యత్తులో ఉపయోగపడగలిగిన పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. వ్యక్తిగతంగా కాస్తంత పురోగతి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో పని భారం పెరిగి నప్పటికీ, ఆశించిన స్థాయిలో గుర్తింపు, ప్రతిఫలం కూడా లభిస్తాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంది. చిన్ననాటి మిత్రులతో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొంటారు. వ్యాపారంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఇంటి కోసం విలువైన వస్తు పరికరాలు కొంటారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): అదనపు ఆదాయ ప్రయత్నాల మీద దృష్టి కేంద్రీకరిస్తే అవి తప్పకుండా సఫలం అయ్యే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఈ సమయాన్ని సద్విని యోగం చేసుకుంటే ఆర్థిక సమస్యలు తప్పకుండా పరిష్కారం అవుతాయి. అనారోగ్య సమస్య నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. అనవసర పరిచయాలకు, వ్యసనాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ముఖ్యమైన వ్యవహారాల్లో సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు ఏదో విధంగా పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలను పాటించడం మంచిది. పని భారం కాస్తంత ఎక్కువగానే ఉన్నప్పటికీ వృత్తి, ఉద్యోగాలు సాఫీగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటాయి. పిల్లలు పురోగతి సాధిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబం మీద బాగా ఖర్చు చేస్తారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): కుటుంబ విషయాల్లో ఏకపక్షంగా వ్యవహరించడం కన్నా జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. డాక్టర్లు, లాయర్లు, ఇతర వృత్తి నిపుణులు అత్యధికంగా ప్రయో యజనం పొందుతారు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. కొద్దిగా ఆలస్యంగానే అయినప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలన్నీ చాలావరకు పూర్తవుతాయి. నిరుద్యోగులు సొంత ఊర్లో చిన్నపాటి ఉద్యోగంతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. కుటుంబ జీవితం మామూలుగా సాగిపో తుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. శత్రువులు మిత్రులుగా మారి సహకరిస్తారు. మనసులోని చిరకాల వాంఛ ఒకటి అనుకోకుండా నెరవేరు తుంది. మూడు శుభ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం మీద ఒక కన్ను వేసి ఉంచడం మంచిది. వృత్తి, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): వృత్తి, ఉద్యోగాలపరంగా యాక్టివిటీ పెరుగుతుంది. క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలు కూడా ఊపందుకుంటాయి. కొత్త ఆలోచనలు, కొత్త ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలకు సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ఆరోగ్య సంబంధమైన జాగ్రత్తలు పాటించడం వల్ల ప్రయోజనం పొందుతారు. కుటుంబ వ్యవహారాలలో జీవిత భాగస్వామిని కూడా సంప్రదిస్తూ ఉండడం మంచిది. పిల్లలు శుభవార్తలు మోసుకొస్తారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఏలిన్నాటి శని కారణంగా వ్యయ ప్రయాసలతో కానీ ముఖ్యమైన వ్యవహారాలు పూర్తయ్యే అవ కాశం ఉండదు. బద్ధకానికి, కాలయాపనకు అవకాశం ఇవ్వవద్దు. వృత్తి జీవితం సాఫీగా, సంతృప్తి కరంగా సాగిపోతుంది. వ్యాపారాలలో కొద్దిగా లాభాలు తగ్గే సూచనలున్నాయి. ఉద్యోగుల మీద అదనపు బాధ్యతల భారం ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ప్రస్తుతానికి ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం కొద్దిగా పరవాలేదనిపిస్తుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): శుభకార్యాలు, పుణ్య కార్యాల మీద ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ఒడిదుడుకులు లేకుండా సాగిపోతాయి. తోబుట్టువులతో ఆస్తి సంబంధమైన వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. గృహ, వాహనాల కొనుగోలుపై దృష్టి కేంద్రీ కరిస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలకు అనుకూలమైన వాతావరణం ఉంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉంటుంది.
Note: ఇక్కడ మేము సమకూర్చిన జ్యోతిష్య సమాచారం పూర్తిగా వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని ఇక్కడ అందించామని గమనించగలరు.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.