Lucky Zodiacs: ఉచ్ఛస్థితిలో చంద్రుడు.. ఆ రాశుల వారికి అదృష్ట యోగం పక్కా..!
Exalted Moon in Taurus from May 17 to 19: మే 17 నుంచి 19 వరకు చంద్రుడు వృషభ రాశిలో ఉచ్ఛ స్థితిలో సంచరించడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టయోగం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. మనశ్శాంతి, ఐశ్వర్యం, ఆరోగ్యం, కుటుంబ సుఖం వంటి అంశాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా మేషం, వృషభం, కర్కాటకం, కన్య, మకరం, కుంభ రాశుల వారు ఈ మూడు రోజుల్లో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను అందించే అవకాశముంది.

Exalted Moon
ఈ నెల(మే) 17, 18, 19 తేదీల్లో చంద్రుడు వృషభ రాశిలో ఉచ్ఛపట్టడం జరుగుతుంది. మనసుకు, మనసులోని కోరికలకు, తల్లికి, ఐశ్వర్యానికి, ఆరోగ్యానికి కారకుడైన చంద్రుడు ఉచ్ఛపట్టడం కొన్ని రాశులకు బాగా లాభకరంగా ఉండే అవకాశం ఉంది. కొన్ని రాశులవారి జీవితాల్లో ఈ మూడు రోజుల్లో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ మూడు రోజుల్లో ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు, చేపట్టే ప్రయ త్నాలు సమీప భవిష్యత్తులో నూరు శాతం ఫలితాలనిస్తాయి. చంద్రుడి ఉచ్ఛ స్థితి వల్ల మేషం, వృషభం, కర్కాటకం, కన్య, మకరం, కుంభ రాశుల వారి దశ, దిశ తిరిగే అవకాశం ఉంది.
- మేషం: ఈ రాశికి చతుర్థాధిపతి అయిన చంద్రుడు ధన స్థానంలో ఉచ్ఛపట్టడం వల్ల కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఆస్తి, ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ఆదాయ వృద్ధి ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు, కళాకారులు బాగా రాణిస్తారు. రావలసిన డబ్బు వసూలై ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ఆర్థిక, వ్యక్తి గత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. సొంత ఇంటి ప్రయత్నాలు చేపట్టడం మంచిది.
- వృషభం: ఈ రాశిలో చంద్రుడు ఉచ్ఛపడుతున్నందువల్ల ఈ రాశివారికి రాజపూజ్యాలు కలుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందు తుంది. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా సఫలమవువుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. తల్లి వైపు నుంచి ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఉద్యోగంలో ఆశించిన పురో గతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి.
- కర్కాటకం: రాశ్యధిపతి చంద్రుడు లాభ స్థానంలో ఉచ్ఛపట్టడం వల్ల షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలతో సహా అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత, ఆరోగ్య సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంపన్న వ్యక్తితో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.
- కన్య: ఈ రాశికి లాభ స్థానాధిపతి అయిన చంద్రుడు భాగ్య స్థానంలో ఉచ్ఛపట్టడం వల్ల ఈ రాశివారికి విదేశీ ఆఫర్లు ఎక్కువగా అందుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులు విదేశాల్లో ఉద్యోగాలకు ప్రయత్నించడం మంచిది. వీరికి తప్పకుండా విదేశీ ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు సానుకూలంగా పరిష్కారమవుతాయి. భారీగా పిత్రార్జితం లభిస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు అత్యధికంగా లాభిస్తాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు.
- మకరం: ఈ రాశికి సప్తమాధిపతి అయిన చంద్రుడు పంచమ స్థానంలో ఉచ్ఛపట్టడం వల్ల రాజపూజ్యాలు కలుగుతాయి. ఆదాయం పెరిగి ఖర్చులు బాగా తగ్గుతాయి. ప్రేమ వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. ఉద్యోగంలో సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో మీ ఆలోచనలు, వ్యూహాలు రాబడిని బాగా పెంచుతాయి. మంచి పరిచయాలు కలుగుతాయి. ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి.
- కుంభం: ఈ రాశికి షష్టాధిపతి అయిన చంద్రుడు చతుర్థ స్థానంలో ఉచ్ఛపట్టడం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఆస్తి లాభం, భూలాభం కలుగుతుంది. సొంత ఇంటి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. షేర్లు లాభిస్తాయి.
Follow Us