Horoscope Today: వారికి ఆదాయం వృద్ధి చెందే అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Today Horoscope in Telugu (February 8, 2025): మేష రాశి వారికి ఉద్యోగ జీవితంలో ఆదరాభిమానాలు పుష్కలంగా లభిస్తాయి. అధికారులకు మీ మీద బాగా నమ్మకం పెరుగుతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. మిథున రాశి వారు వృత్తి, ఉద్యోగాల్లో మీ సమర్థతను నిరూపించుకుంటారు. వ్యాపారం నల్లేరు మీద బండిలా సాఫీగా సాగిపోతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

దిన ఫలాలు (ఫిబ్రవరి 8, 2025): మేష రాశి వారికి ఉద్యోగ జీవితంలో ఆదరాభిమానాలు పుష్కలంగా లభించే అవకాశముంది. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపోయే అవకాశముంది. మిథున రాశి వారు వృత్తి, ఉద్యోగాల్లో మీ సమర్థతను నిరూపించుకుంటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగ జీవితంలో ఆదరాభిమానాలు పుష్కలంగా లభిస్తాయి. అధికారులకు మీ మీద బాగా నమ్మకం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. కొన్ని మొండి బాకీలు వసూలవుతాయి. కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు సొంత ఊర్లో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. వ్యాపార వ్యవహారాలు, లావాదేవీలు ఆశాజనకంగా సాగిపోతాయి. వృత్తి జీవితంలో కొద్దిగా రాబడి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో సొంత ఆలోచనల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశముంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. కొందరు బంధువుల నుంచి కొద్దిగా ఇబ్బందులుంటాయి. వ్యక్తిగత సమస్యలకు సరైన పరిష్కారం దొరుకుతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో మీ సమర్థతను నిరూపించుకుంటారు. వ్యాపారం నల్లేరు మీద బండిలా సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి అన్ని విధాలా మెరుగ్గా ఉంటుంది. ఇంటా బయటా ప్రాధాన్యం, ప్రాభ వం పెరుగుతాయి. అదనపు ఆదాయానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. ఇంటా బయటా అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. వ్యక్తిగత సమస్య ఒకటి తొలగిపోతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో బాధ్యతలు మారే అవకాశం ఉంది. పని ఒత్తిడి నుంచి పూర్తిగా ఉపశమనం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో కొందరు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులు తమకు అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఆరోగ్యానికి లోటు ఉండదు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. అధికారులు కొత్త బాధ్యతలను అప్పగించే అవ కాశం ఉంది. వ్యాపారాలు ఆశాజనకంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తి కరంగా ఉంటుంది. కొన్ని వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమ త్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం మీద శ్రద్ధ పెట్టాలి. కొద్దిగా అనారోగ్యం ఇబ్బంది పెట్టే సూచనలున్నాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగంలో పదోన్నతికి, జీతభత్యాలు పెరగడానికి బాగా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు సంపాదిస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. పలుకుబడి పెరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగ జీవితంలో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో అత్యధిక లాభాలకు అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. కుటుంబంలో ఒకటి రెండు సమస్యలు తలెత్తుతాయి. కొందరు బంధువుల నుంచి కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యక్తి గత సమస్యలు తగ్గుముఖం పడతాయి. సొంత పనుల మీద మరింతగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కుటుంబ జీవితం చాలావరకు హ్యాపీగా సాగిపోతుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో అధికారులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగే అవకాశం కనిపించడం లేదు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు కొద్దిగా పురోగతి సాధిస్తాయి. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులన్నీ పూర్తవుతాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ ఉంటుంది. సోదరులతో ఆస్తి వివాదం పరి ష్కారం అవుతుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆరోగ్యం పరవాలేదు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో మీ సమర్థత మీద అధికారులకు నమ్మకం బాగా పెరుగుతుంది. మీ మీద ఎక్కువగా ఆధారపడే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. ఆదా యంలో ఆశించిన స్థాయి వృద్ధి ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. నిరు ద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. కొద్దిగా అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆదాయావకాశాలు బాగా వృద్ధి చెందుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా సాగిపో తుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో కీలక వ్యక్తిగత సమస్యలను తగ్గించుకుంటారు. పిల్లల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాలు చాలావరకు ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ లభి స్తుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఫలితం ఉంటుంది. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టడం మంచిది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఖర్చుల్ని బాగా తగ్గించుకుంటారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగ జీవితంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పని ఒత్తిడి, అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. వృత్తి జీవి తంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలకు లోటుండకపోవచ్చు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగు తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు.



