- Telugu News Photo Gallery Spiritual photos Magha Purnima 2025: These zodiac signs to have maha yogas for next 45 days details in telugu
Magha Purnima 2025: మాఘ పౌర్ణమి నుంచి వారికి మహా యోగాలు..! ఇక దశ తిరిగినట్టే..
Magha Purnima Astrology: అత్యంత పవిత్రమైన పౌర్ణమిగా అత్యధిక శాతం భారతీయులు భావించే మాఘ పూర్ణిమ ఈ నెల 12న(బుధవారం) చోటు చేసుకుంటోంది. మకరంలో ఉన్న రవి గ్రహానికి సప్తమంలో చంద్రుడి సంచారం వల్ల ఈ పౌర్ణమి ఏర్పడుతోంది. శివుడికి ఈ మాఘ మాసం, మాఘ పూర్ణిమ అత్యంత ప్రీతిపాత్రమైన విషయాలు అయినందువల్ల ఆ రోజున శివార్చన చేసే పక్షంలో వంద శాతం ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా మేషం, కర్కాటకం, కన్య, తుల, మకరం, మీన రాశులకు మాఘ పూర్ణిమ తర్వాత నుంచి 45 రోజుల పాటు మహా యోగాలు పట్టడానికి అవకాశం ఉంది.
TV9 Telugu Digital Desk | Edited By: Janardhan Veluru
Updated on: Feb 11, 2025 | 8:37 PM

మేషం: ఈ పౌర్ణమితో ఈ రాశివారి జీవితం అనేక మార్పులకు లోనయ్యే అవకాశం ఉంది. కొన్ని కొత్త అదృష్టాలు పట్టబోతున్నాయి. ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యోగంలో అంచనాలకు మించిన పురోగతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. ఆదాయ అవకాశాలు పెరుగుతాయి. సొంత ఇంటి కల నెరవేరే అవకాశం ఉంది. ఆస్తి సమస్యలు పరిష్కారం అవుతాయి.

కర్కాటకం: ఈ రాశివారికి మాఘ పౌర్ణమి బాగా కలిసి వస్తుంది. ఆ రోజున చేపట్టే ప్రతి ప్రయత్నమూ కలిసి వస్తుంది. ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. ఒకటికి రెండు సార్లు ధన యోగాలు కలుగుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో ఘన విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు అందుతాయి. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది.

కన్య: ఈ రాశికి లాభ స్థానంలో పౌర్ణమి ఏర్పడుతున్నందువల్ల ఈ రాశివారికి ఆదాయం దిన దినాభి వృద్ధి చెందుతుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభార్జన పెరగడానికి అవకాశం ఉంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. సంతాన యోగం కలుగుతుంది. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

తుల: ఈ రాశివారికి దశమ స్థానంలో పౌర్ణమి ఏర్పడుతున్నందువల్ల కొత్త ఉద్యోగులకు ఉద్యోగంలో స్థిరత్వం కలుగుతుంది. ఇతరులకు పదోన్నతులు లభిస్తాయి. నిరుద్యోగులకు తప్పకుండా మంచి ఉద్యోగ యోగం పడుతుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. సంపన్న కుటుంబంతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై, భూ లాభం కలుగుతుంది. ప్రముఖులతో కలిసి సమాజ సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు.

మకరం: ఈ రాశికి సప్తమ స్థానంలో పౌర్ణమి ఏర్పడుతున్నందువల్ల మనసులో చాలా కాలం నుంచి ఉన్న కొన్ని కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపా రాలు కొత్త పుంతలు తొక్కుతాయి. సర్వత్రా రాజపూజ్యాలు లభిస్తాయి. ఆదాయం ఇబ్బడి ముబ్బ డిగా పెరుగుతుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. వృత్తి, ఉద్యోగా లరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

మీనం: ఈ రాశికి పంచమ స్థానంలో పౌర్ణమి ఏర్పడడం వల్ల ఆత్మవిశ్వాసంతో సమస్యల్ని, వివాదాల్ని పరిష్కరించుకుంటారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు, సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. మీకు బాగా డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఉన్నత కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ఆరోగ్య లాభం కలుగుతుంది..





























