Lucky Horoscope: ధనుస్సు, మీన రాశుల్లో నాలుగు గ్రహాలు.. రెండు నెలల్లో ఆ రాశుల వారికి అన్నీ శుభాలే!

గురువుకు సంబంధించిన ధనుస్సు, మీన రాశుల్లో నాలుగు గ్రహాలు ఉండడంతో పాటు, వాటిని స్వయంగా గురువు వీక్షించడం వల్ల అయిదు రాశుల వారు ఒక రెండు నెలల వ్యవధిలో అనేక శుభవార్తలు వినడం జరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. అంతేకాక, జీవితాన్ని సానుకూల మలుపు తిప్పగల శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి.

Lucky Horoscope: ధనుస్సు, మీన రాశుల్లో నాలుగు గ్రహాలు.. రెండు నెలల్లో ఆ రాశుల వారికి అన్నీ శుభాలే!
Lucky Horoscope
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jan 08, 2024 | 6:21 PM

గురువుకు సంబంధించిన ధనుస్సు, మీన రాశుల్లో నాలుగు గ్రహాలు ఉండడంతో పాటు, వాటిని స్వయంగా గురువు వీక్షించడం వల్ల అయిదు రాశుల వారు ఒక రెండు నెలల వ్యవధిలో అనేక శుభవార్తలు వినడం జరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. అంతేకాక, జీవితాన్ని సానుకూల మలుపు తిప్పగల శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. ఈ రెండు నెలల కాలాన్ని ఈ అయిదు రాశుల వారు సద్వినియోగం చేసుకోవడం, జీవితానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం, మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల జీవితం ఆ తర్వాత కూడా శుభప్రదంగా సాగిపోతుంది. శుభ యోగాలను అనుభవించబోతున్న ఆ అయిదు రాశులు ఏవంటే- మేషం, మిథునం, సింహం, తుల, ధనుస్సు.

  1. మేషం: ఈ రాశివారికి ఇప్పటి నుంచి రెండు నెలల పాటు తప్పకుండా ఎక్కువగా శుభవార్తలే అందు తాయి. ఈ రాశివారు ఏమనుకుంటే అదే జరుగుతుంది. అందువల్ల ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. కుటుంబంలో తప్పకుండా ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. విదేశాలు, ఉద్యోగాలు, సంతానం, పెళ్లి, ప్రేమలు, వ్యాపారాల విషయంలో ఆశించిన విధంగా శుభవార్తలు అందుతాయి.
  2. మిథునం: ఈ రాశివారికి పెళ్లి, ఉద్యోగం, గృహ సంబంధమైన విషయాల్లో జీవితాన్ని మలుపు తిప్పే శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఊహించని అద్భుతాలు జరుగుతాయి. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. పిల్లల నుంచి, పిల్లల గురించి తప్పకుండా శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో జోరు పెరుగుతుంది. అధికార యోగానికి అవకాశం ఉంది. గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడతాయి. ప్రతిభా పాటవాలకు, శక్తి సామర్థ్యాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది.
  3. సింహం: ఈ రాశి వారి కుటుంబాలలో శుభ కార్యాలు జరుగుతాయి. ఎంతో కాలంగా పెండింగులో ఉన్న సమస్యలు, వ్యవహారాలన్నీ ఒక కొలిక్కి వస్తాయి. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఆస్తి వివా దాలు కూడా పరిష్కారం అవుతాయి. సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది. ఉద్యోగం, వృత్తి, వ్యాపారాలతో పాటు కుటుంబపరంగా కూడా శుభవార్తలు వినడం జరుగుతుంది. నిరు ద్యోగులకు కోరుకున్న సంస్థలో ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది.
  4. తుల: ఈ రాశివారికి కొన్ని ముఖ్యమైన ఆశించిన శుభవార్తలు అందడంతో పాటు, కీలకమైన విష యాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వీరి జీవితంలో అనేక సానుకూల సంఘట నలు సంభవిస్తాయి. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఏ ప్రయత్నం తలపె ట్టినా విజయం సాధించడంతో పాటు ఏది కోరుకున్నా సిద్ధించడం జరుగుతుంది. గురు బలం వల్ల దైవానుగ్రహం బాగా ఉంది. సామాజికంగా అనేక విధాలుగా ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి.
  5. ధనుస్సు: ఈ రాశివారు ఈ రెండు నెలల కాలంలో మహా అదృష్టవంతులవుతారు. ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి ఊహించని విధంగా మెరుగుపడతాయి. ఒకటి రెండు ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో ఒకటి రెండు శుభకార్యాలు జరుగుతాయి. సంతానానికి సంబంధించి తప్పకుండా శుభవార్తలు వినడం జరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సునాయా సంగా సఫలం అవుతాయి. జీవన స్థితిగతులు, జీవన శైలి పూర్తిగా మారిపోతాయి.