Horoscope Today: ఈ రాశివారు డబ్బు విషయంలో జాగ్రత్త.. సోమవారం రాశి ఫలాలు చెక్ చేసుకోండి.

సోమవారం ఈ రాశి వారికి కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. అయితే ఆర్థికంగా మాత్రం బాగానే ఉంటుంది. రాదనుకున్న డబ్బు అనుకోకుండా చేతికి వస్తుంది. మీ నుంచి సహాయం పొందిన వారు మీకు అవసరం అనేసరికి ముఖం చాటేస్తారు. ఇక ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంతకీ సోమవారం...

Horoscope Today: ఈ రాశివారు డబ్బు విషయంలో జాగ్రత్త.. సోమవారం రాశి ఫలాలు చెక్ చేసుకోండి.
Horoscope Today 8th January
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Narender Vaitla

Updated on: Jan 08, 2024 | 6:26 AM

దిన ఫలాలు (జనవరి 6, 2024): సోమవారం ఈ రాశి వారికి కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. అయితే ఆర్థికంగా మాత్రం బాగానే ఉంటుంది. రాదనుకున్న డబ్బు అనుకోకుండా చేతికి వస్తుంది. మీ నుంచి సహాయం పొందిన వారు మీకు అవసరం అనేసరికి ముఖం చాటేస్తారు. ఇక ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంతకీ సోమవారం 12 రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1):

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఒకరిద్దరు బంధుమిత్రులకు సహాయం చేయడం కూడా జరు గుతుంది. కొందరు సన్నిహితులు ఆర్థికంగా ఒత్తిడి చేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారు లతో సామరస్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆరోగ్యానికేమీ ఇబ్బంది ఉండుదు. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉంటే మంచిది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2):

వృత్తి, ఉద్యోగాలు సామరస్యంగా సాగిపోతాయి. వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యక్తి గత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఒకటి రెండు కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి. దాంపత్య జీవితం పరవాలేదనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగానే ఉంటుంది. రాదనుకున్న డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. సహాయం పొందిన స్నేహితులు అవసర సమయానికి ముఖం చాటేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రయాణాలు లాభిస్తాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3):

ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. ఆశించిన స్థాయిలో ఆర్థికంగా కలిసి వస్తుంది. తండ్రి వైపు నుంచి సహాయ సహకా రాలు లభిస్తాయి. తోబుట్టువులు, దగ్గరి బంధువులు అండగా నిలబడతారు. పుణ్యక్షేత్ర దర్శనానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష):

వృత్తి, ఉద్యోగాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. వృత్తి జీవితం బాగా బిజీ అవుతుంది. వ్యాపారాలు ఒక మోస్తరుగా సాగుతాయి. కొందరు స్నేహి తుల కారణంగా ఇబ్బందులు ఉండవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల ఫలితాలని స్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల చదువుల మీద శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. సతీమణికి వ్యక్తిగతంగా పురోగతి ఉంటుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1):

వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. కొందరు బంధుమిత్రుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది. ఆస్తి వివాదం పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి శుభ వార్తలు వింటారు. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలుంటాయి. ముఖ్యమైన వ్యవ హారాల్లో సొంత నిర్ణయాలు మంచివి. సతీమణికి వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2):

వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగు తాయి. మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. కొందరు ప్రముఖులతో పరిచయాలు ఏర్ప డతాయి. ప్రయాణాల్లో ఆశించిన ప్రయోజనాలు సిద్ధిస్తాయి. సోదరులతో విభేదాలు చాలావరకు పరిష్కారం అవుతాయి. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3):

సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. వృత్తి, వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. ఉద్యో గంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు సఫలం అవుతాయి. ఏ ప్రయత్నం తల పెట్టినా విజయవంతం అవుతుంది. అనుకోకుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. సహాయ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొందరు స్నేహితుల వల్ల డబ్బు నష్టపోతారు. ఆరోగ్యం పరవా లేదు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట):

ముఖ్యమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. వ్యక్తిగత సమస్యను సమయస్ఫూరితో పరిష్కరించుకుంటారు. సొంత విషయాల మీద శ్రద్ధపెట్టడం మంచిది. ఇతరులతో మీ మనసులోని విషయాలను పంచుకోకపోవడం మంచిది. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు చురుకుగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ఎవరికీ హామీలు ఉండవద్దు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1):

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూలతలు పెరుగుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబ సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. బంధువుల సహాయంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అందివస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. కొందరు స్నేహితుల వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడతారు. ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొంటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2):

ఉద్యోగంలో బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారాలు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఆర్థిక ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మిత్రులకు ఇతోధికంగా సహాయం చేస్తారు. ఇంటా బయటా శ్రమ, తిప్పట ఉండవచ్చు. ఆరోగ్యం నిలకడగా కొనసాగుతుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. కొందరు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. రాజకీయ ప్రముఖులతో మంచి పరిచయాలు పెరుగుతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3):

ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. జీత భత్యాలు పెరిగే అవకాశం ఉంది. అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ప్రయత్నాలు కలిసి వస్తాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. చిన్ననాటి స్నేహితులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. డబ్బు జాగ్రత్త.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి):

వృత్తి, ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. వ్యాపా రాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. ఇతరుల బాధ్యతలు నెత్తికెత్తుకుంటారు. కుటుంబపరంగా కొన్ని సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాల్లో పాల్గొం టారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. శరీరానికి విశ్రాంతి అవసరమని గ్రహిం చండి.

మరిన్ని ఆస్ట్రాలజీ కథనాల కోసం క్లిక్ చేయండి..