Horoscope Today: వారికి ఇంటా బయటా కాస్తంత ఎక్కువ ఒత్తిడి.. 12 రాశుల వారికి మంగళవారం రాశిఫలాలు
దిన ఫలాలు (జనవరి 9, 2024): ఒకటి రెండు శుభ యోగాల కారణంగా మేష రాశి వారికి ఈ రోజు మీకు సర్వత్రా వైభవంగా గడిచిపోతుంది. వృషభ రాశి వారు ఆర్థిక వ్యవహారాలకు, ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. మిథున రాశి వారికి మంచి పరివర్తన యోగం పట్టినందువల్ల కొద్దిపాటి ప్రయత్నంతో ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
దిన ఫలాలు (జనవరి 9, 2024): ఒకటి రెండు శుభ యోగాల కారణంగా మేష రాశి వారికి ఈ రోజు మీకు సర్వత్రా వైభవంగా గడిచిపోతుంది. వృషభ రాశి వారు ఆర్థిక వ్యవహారాలకు, ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. మిథున రాశి వారికి మంచి పరివర్తన యోగం పట్టినందువల్ల కొద్దిపాటి ప్రయత్నంతో ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఒకటి రెండు శుభ యోగాల కారణంగా ఈ రోజు మీకు సర్వత్రా వైభవంగా గడిచిపోతుంది. తఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలనిస్తాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. విద్యార్థులు శ్రమకు తగ్గ ప్రతిఫలం పొందు తారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఇంటా బయటా రాజసంగా గడిచిపోతుంది. అయితే, ఆర్థిక వ్యవహారాలకు, ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సాటి లేని మేటి అనిపించుకుంటారు. వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులుంటాయి. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటివి పెట్టుకోవద్దు. ఎవరికీ వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం కూడా శ్రేయస్కరం కాదు. ప్రేమ వ్యవహారాల్లో చికాకులు చోటు చేసుకోవచ్చు. విద్యార్థులకు పరవాలేదు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
మంచి పరివర్తన యోగం పట్టినందువల్ల కొద్దిపాటి ప్రయత్నంతో ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఉద్యోగ, ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు కూడా ఇతర సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు బిజీ బాగా బిజీ అయిపో తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. పెండింగ్ వ్యవహారాలు, పనులను పట్టుదలతో పూర్తి చేయడం జరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలపడతాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
రోజంతా ప్రశాంతంగా, రొటీన్ గా గడిచిపోతుంది. అనవసర ఖర్చులు ఇబ్బంది పెడతాయి. మిత్రుల వల్ల కూడా కొద్దిగా నష్టపోవడం జరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ప్రేమ వ్యవహా రాల్లో ఆచితూచి అడుగువేయడం శ్రేయస్కరం. విద్యార్థులు చదువుల్లో బాగా కష్టపడాల్సి ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
పంచమ స్థానంలో బుధాదిత్య యోగం, పరివర్తన యోగం ఏర్పడడం వల్ల రోజంగా ఉత్సాహంగా గడిచిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యత లను అప్పగించడం జరుగుతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం నిల కడగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగుతాయి. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ముఖ్యమైన వ్యవహారాలు, నిర్ణయాలు బాగా అనుకూల ఫలితాలనిస్తాయి. మనసు లోని కోరికలు నెరవేరుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలకు ఆశించిన స్పందన వచ్చే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ముందుకు వెడతాయి. విద్యార్థులకు సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
బాగా అనుకూల సమయం నడుస్తోంది. ధనూ రాశిలో చోటు చేసుకున్న పరివర్తన యోగం, బుధాదిత్య యోగం వల్ల ఏ ప్రయత్నమైనా సఫలం అవుతుంది. వృత్తి, ఉద్యోగాలలో చాలా వరకు శుభవార్తలు వినడం జరుగుతుంది. వ్యాపారాల్లో ఆర్థిక పురోగతి ఉంటుంది. చేపట్టిన పనులు సకా లంలో సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. విద్యార్థులకు బాగుంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ధన స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడినందువల్ల ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయ వంతం అవుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడ తాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఉద్యోగ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాడ, ఉత్తరాషాఢ 1)
ఈ రాశిలో బుధాదిత్య యోగం ఏర్పడడం, పైగా రాశిలో పరివర్తన యోగం చోటు చేసుకోవడం వల్ల ఆర్థిక పరిస్థితికి సంబంధించి మనసులోని కోరికలు నెరవేరుతాయి. వ్యక్తిగత సమస్యలను సమ యస్ఫూర్తితో పరిష్కరించుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాధాన్యం బాగా పెరుగుతాయి. వ్యాపారంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆహార, విహారాల్లో కాస్తంత జాగ్రత్త అవసరం. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. విద్యార్థులు ఆశించిన పురోగతి సాధిస్తారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఏలిన్నాటి శని కారణంగా అప్పుడప్పుడూ ముఖ్యమైన వ్యవహారాలు, ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడుతుంటాయి. మధ్య మధ్య వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం కూడా బాగా పెరుగుతుంది. వ్యాపారాలు నిదానంగా కొనసాగుతాయి. ఇంటా బయటా ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా నడుస్తాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెంచడం మంచిది. ప్రేమ వ్యవహా రాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. విద్యార్ధులలో చదువులు ఉత్సాహాన్ని పెంచుతాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
లాభ స్థానం బాగా అనుకూలంగా ఉన్న కారణంగా వృత్తి, ఉద్యోగాల్లో గౌరవమర్యాదలు పెరుగు తాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యో గంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు వెడ తాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కీలకమైన వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధి స్తారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
రోజంతా సామరస్యంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా కొనసాగుతాయి. వ్యాపారానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకోవడం, కొత్త వ్యూహాలు రూపొందించడం వంటివి జరిగే అవకాశం ఉంది. చేపట్టిన పనుల్లో, వ్యవహారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది.