Health Astrology: ఆరో స్థానంలో అనుకూల గ్రహం.. ఆ రాశుల వారికి అనారోగ్య సమస్యల నుంచి విముక్తి
ఆరోగ్యమే మహా భాగ్యమనే మాటను అందరూ వినే ఉంటారు. జ్యోతిష శాస్త్రంలో కూడా ఆరోగ్యాన్ని మహా భాగ్య యోగాల్లో ఒకటిగా చేర్చి, దీనికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. ఆరోగ్యం ఉంటే ఆదాయం, వృత్తి, ఉద్యోగాలు, విదేశీ పర్యటనలు వగైరాలన్నీ సాధ్యమే. జ్వరం, జలుబు, దగ్గు వంటివి మనిషి శరీరానికి సహజం. అందువల్ల దీర్ఘకాలిక, ప్రాణాంతక, మొండి వ్యాధుల గురించే ఇక్కడ చర్చించడం, విశ్లేషించడం జరిగింది.
ఆరోగ్యమే మహా భాగ్యమనే మాటను అందరూ వినే ఉంటారు. జ్యోతిష శాస్త్రంలో కూడా ఆరోగ్యాన్ని మహా భాగ్య యోగాల్లో ఒకటిగా చేర్చి, దీనికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. ఆరోగ్యం ఉంటే ఆదాయం, వృత్తి, ఉద్యోగాలు, విదేశీ పర్యటనలు వగైరాలన్నీ సాధ్యమే. జ్వరం, జలుబు, దగ్గు వంటివి మనిషి శరీరానికి సహజం. అందువల్ల దీర్ఘకాలిక, ప్రాణాంతక, మొండి వ్యాధుల గురించే ఇక్కడ చర్చించడం, విశ్లేషించడం జరిగింది. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నవారికి ఈ ఏడాది లోగా ఎంత వరకూ ఉపశమనం లభిస్తుందన్నది వివరించడం జరిగింది. ఆరవ స్థానాన్ని బట్టి, ఆరవ స్థాన అధిపతిని బట్టి ఆరోగ్య పరిశీలన చేయడం జరుగుతుంది. ప్రస్తుత గ్రహాల స్థితిగతులను బట్టి మేషం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, కుంభ రాశుల వారు దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఎక్కువగా ఉపశమనం పొందబోతున్నారు.
- మేషం: ఈ రాశికి ఆరవ స్థానం చాలావరకు అనుకూలంగా ఉన్నందువల్ల స్వల్పకాలిక అనారోగ్యాలే తప్ప కొత్తగా దీర్ఘకాలిక అనారోగ్యాలు బాధించే అవకాశం లేదు. దీర్ఘకాలిక అనారోగ్యాల వల్ల ఇప్పటికే బాధపడుతున్నవారికి అనుకోకుండా, అప్రయత్నంగా వైద్య చికిత్స లభించే అవకాశం ఉంది. సాధారణంగా ఈ రాశివారు తల నొప్పి, పార్శ్వపు నొప్పి, రక్త సంబంధ మైన సమస్యలతో అవస్థలు పడే అవకాశం ఉంటుంది. ఇటువంటి వ్యాధుల నుంచి ఈ ఏడాది చాలావరకు ఉపశమనం లభిస్తుంది.
- కన్య: ఈ రాశికి ఆరవ స్థానాధిపతి శని ఆరవ స్థానంలోనే ఉన్నందువల్ల దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి పూర్తిగా కోలుకునే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. ఈ రాశివారికి కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, ఉదర సంబంధమైన సమస్యలు, మధుమేహం వంటివి పీడించే అవకాశం ఉంది. సాధారణంగా సాంప్రదాయక వైద్య విధానాల ద్వారా వీరు వీటి నుంచి కోలుకోవడం జరుగుతుంది. స్వల్పకాలిక అనారోగ్యాలు ప్రస్తుతానికి దగ్గరకు రాకపోవచ్చు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ పనికిరాదు.
- తుల: ఈ రాశికి ఆరవ స్థానంలో రాహువు సంచారం వల్ల, ఆరవ స్థానాధిపతి గురువు బాగా అనుకూ బలంగా ఉన్నందువల్ల అనారోగ్యాల నుంచి కోలుకునే అవకాశమే ఎక్కువగా ఉంది. అనారోగ్యా లకు సంబంధించినంత వరకూ ఈ రాశివారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. సాధార ణంగా ఈ రాశివారిని మధుమేహం, స్థూలకాయం, థైరాయిడ్, కాళ్ల వాపులు, జీర్ణాశయ సమ స్యలు బాధించే అవకాశం ఉంటుంది. ఈ సమస్యలు తగ్గడమో, అదుపులో ఉండడమో జరుగుతుంది.
- వృశ్చికం: ఈ రాశికి ఆరవ స్థానంలో ఆరోగ్య స్థానాధిపతి కుజుడే సంచారం చేస్తున్నందువల్ల ఎటువంటి అనా రోగ్యమైనా త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ రాశివారిని రక్త సంబంధమైన సమస్యలు, మర్మస్థాన సమస్యలు, నిద్రలేమి వంటివి ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి. ఈ ఏడాది ఈ రాశివారు ఈ సమస్యల నుంచి పూర్తిగాకోలుకునే అవకాశం ఉంటుంది. ఊహించని విధంగా సరైన వైద్య చికిత్స లభిస్తుంది. సాంప్రదాయ వైద్య చికిత్స ద్వారా కోలుకోవడం జరుగుతుంది.
- ధనుస్సు: ఈ రాశివారికి ఆరవ స్థానంలో రాశ్యధిపతి గురువు సంచారం చేస్తున్నందువల్ల అనారోగ్యాల నుంచి బయటపడడం జరుగుతుంది. పూర్తి ఆరోగ్యవంతులు కూడా కావచ్చు. ఆధునిక వైద్య విధానాల ద్వారా వీరు అనారోగ్యాల నుంచి గట్టెక్కే అవకాశం ఉంటుంది. ఈ రాశివారు ఎక్కువగా ఎముకలు, నడుం నొప్పి, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, మూత్రపిండాల సమస్యలతో అవస్థలు పడడం జరుగుతుంది. ఈ సమస్యల నుంచి వీరికి తప్పకుండా ఉపశమనం లభిస్తుంది.
- కుంభం: ఈ రాశికి ఆరవ స్థానంలో శుభ గ్రహాల సంచారం ప్రారంభం కాబోతున్నందువల్ల వీరికి దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి క్రమంగా ఉపశమనం లభిస్తుంది. అనుకోకుండా సరైన వైద్య చికిత్స లభి స్తుంది. కాళ్ల నొప్పులు, కేన్సర్, మధుమేహ సమస్యలు వీరిని ఎక్కువగా పీడించే అవకాశం ఉంటుంది. సాధారణంగా సాంప్రదాయిక వైద్య చికిత్సల ద్వారా వీరికి ఉపశమనం లభించే అవ కా శం ఉంది. ఈ రాశివారికి ఒక పట్టాన అనారోగ్యాలు రావు. ఒకసారి వస్తే తగ్గడానికి సమయం పడుతుంది.