Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు.. 12 రాశుల వారికి మంగళవారం రాశిఫలాలు

దిన ఫలాలు (జూలై 9, 2024): మేష రాశి వారు రుణ సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. వృషభ రాశి వారు ఇష్టమైన బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. మిథున రాశి వారికి ఆదాయ మార్గాలు బాగా అనుకూలంగా ఉంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు.. 12 రాశుల వారికి మంగళవారం రాశిఫలాలు
Horoscope Today 09th July 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 09, 2024 | 5:01 AM

దిన ఫలాలు (జూలై 9, 2024): మేష రాశి వారు రుణ సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. వృషభ రాశి వారు ఇష్టమైన బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. మిథున రాశి వారికి ఆదాయ మార్గాలు బాగా అనుకూలంగా ఉంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడతారు. రుణ సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఏ ప్రయత్నం చేపట్టినా, ఏ పనిని ప్రారంభించినా మందకొడిగా సాగే అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం బాగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల ఆదరణకు లోటుండదు. నిరుద్యోగులు తమ ప్రయత్నానికి తగ్గ ప్రతిఫలం అందుకుంటారు. ఆదాయం బాగా పెరిగే సూచనలున్నాయి కానీ, అనవసర ఖర్చుల మీద దృష్టి పెట్టడం మంచిది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఇష్టమైన బంధువుల నుంచి శుభ కార్య ఆహ్వానాలు అందుతాయి. ఇంటా బయటా సానుకూల, ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయ త్నాలు తప్పకుండా ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ కాస్తంత ఎక్కువగానే ఉంటుంది కానీ, ఆశించిన లాభాలు పొందడం జరుగుతుంది. ఉద్యోగంలో ఆశించిన మార్పులు చోటు చేసుకుం టాయి. ప్రముఖులతో పరిచయాలు బాగా పెరుగుతాయి. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

పెళ్లి ప్రయత్నాల విషయంలో దూరపు బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కొద్దిగా అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆదాయ మార్గాలు బాగా అనుకూలంగా ఉంటాయి. శుభ కార్యాలు, దైవ కార్యాల మీద ఖర్చు పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నిదానంగా, అను కూలంగా సాగిపోతాయి. ఉద్యోగులకు అదనపు పని భారం తప్పకపోవచ్చు. ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. రాదనుకున్న సొమ్ము వసూలవు తుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. బంధుమిత్రులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యానికి అవకాశం ఉన్నా నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు అందుతాయి. ఉద్యో గంలో కొత్త ప్రోత్సాహకాలు అందుకుంటారు. వృత్తి జీవితంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. నిరు ద్యోగులు తమకు అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

నిరుద్యోగులు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేయడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో బాగా ఆలోచించి కొత్త నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి కావడంలో ఇబ్బందులుంటాయి. అవసరానికి తగ్గట్టుగా ధనం వసూలవుతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంత కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

రాజీమార్గంలో ఆస్తి సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న బంధుమిత్రుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఇల్లు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. అవసరా నికి కుటుంబ సభ్యుల సహాయ సహాకారాలు అందుతాయి. వ్యాపారాల్లో కొన్ని కీలక మార్పులు చేపడతారు. ఉద్యోగులకు బాధ్యతల నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్తలు అందుతాయి. వృత్తి జీవితం అనుకున్న విధంగా సానుకూలంగా సాగిపోతుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

సమయం బాగా అనుకూలంగా ఉంది. అన్ని వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. ప్రస్తుతానికి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. వ్యాపార వ్యవహారాల్లో సొంత ఆలోచనలు బాగా కలిసి వస్తాయి. ముఖ్య మైన వ్యవహారాలను పూర్తి చేయడంలో శ్రమ ఎక్కువగా ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఏ పని తలపెట్టినా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాల్లో కూడా వాహన ఇబ్బందులుండే అవకాశం ఉంది. కొన్ని పనుల్ని పట్టుదలగా సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో సాధారణ లాభాలుంటాయి. ఉద్యోగులకు అదనపు పని భారం తప్పకపోవచ్చు. నిరుద్యోగుల ప్రయ త్నాలు చురుకుగా సాగుతాయి. కుటుంబ జీవితం చాలావరకు సానుకూలంగా, సామ ర స్యంగా సాగిపోతుంది. పిల్లల పురోగతికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఏ పని ప్రారంభించినా, ఏ ప్రయత్నం చేపట్టినా సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు, ఆర్థిక ప్రయత్నాలు జోరందుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఎంత ఆచితూచి వ్యవహరిస్తే అంత మంచిది. ఇతరులతో వాదనలకు దిగడం, వారి వ్యవహారాల్లో జోక్యం చేసుకో వడం వల్ల ఇరకాటంలో పడతారు. ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. కుటుంబ జీవితం అన్యోన్యంగా సాగిపో తుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

సోదర వర్గంతో ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. కొందరు ఇష్టమైన బంధు మిత్రు లతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో దైవ కార్యాలు నిర్వహిస్తారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో స్థిరత్వం కలుగుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగావకాశం లభించే సూచనలున్నాయి. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఇంటా బయటా విశేషమైన గౌరవ మర్యాదలు లభిస్తాయి. పిల్లల పురోగతి విషయంలో ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు, వ్యవహారాల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగుల శ్రమకు, ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఉన్నత స్థాయి అవకాశాలు అందుతాయి. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరుగుతుంది. రావలసిన డబ్బు కూడా చేతికి అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగంలో కోపతాపాలకు, వాగ్వాదా లకు అవకాశం లేదని గ్రహించాలి. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. మంచి పరిచయాలు ఏర్ప డతాయి. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది.

ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్..
మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్..
ఇటిఎఫ్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ప్రయోజనాలు ఏంటి?
ఇటిఎఫ్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ప్రయోజనాలు ఏంటి?
Team India: మిథాలీ రికార్డ్ బ్రేక్ చేసిన లేడీ కోహ్లీ..
Team India: మిథాలీ రికార్డ్ బ్రేక్ చేసిన లేడీ కోహ్లీ..
తేనే, నల్ల మిరియాలను కలిపి తీసుకుంటే ఈ సమస్యలన్నీ పరార్..!శరీరంలో
తేనే, నల్ల మిరియాలను కలిపి తీసుకుంటే ఈ సమస్యలన్నీ పరార్..!శరీరంలో