AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandra Grahan: చంద్రగ్రహణం ఈ రాశులపై చెడు ప్రభావం.. దోష నివారణ కోసం ఈ చర్యలు చేసి చూడండి..

ఈ ఏడాది హోలీ రోజున చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది చాలా అరుదైన విషయం. జ్యోతిషశాస్త్రంలో చంద్రగ్రహణాన్ని అశుభకరమైనదిగా భావిస్తారు. గ్రహణ ప్రభావం అన్ని రాశులపైనా ఉంటుందని జ్యోతిష్యశాస్త్రం వెల్లడించింది. అయితే హోలీ రోజున చంద్రగ్రహణ ప్రభావం మీ మీద పడకూడదు అంటే గ్రహననికంటే ముందు మీరు కొన్ని చర్యలు తీసుకోవాలి. ఇలా చేయడం వలన జీవితంలో ఏర్పడే ప్రతికూల ప్రభావాలను నివారించవచ్చు. గ్రహణ ప్రభావం తగ్గుతుంది..

Chandra Grahan: చంద్రగ్రహణం ఈ రాశులపై చెడు ప్రభావం.. దోష నివారణ కోసం ఈ చర్యలు చేసి చూడండి..
Lunar Eclipse On Holi
Surya Kala
|

Updated on: Mar 08, 2025 | 4:04 PM

Share

ఆధ్యాత్మికంగానే కాదు.. జ్యోతిషశాస్త్ర ప్రాముఖ్యత కలిగిన హోలీ రోజున చంద్రగ్రహణం సంభవించబోతోంది. ఈ రోజున చంద్రగ్రహణం ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. అయితే కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం ద్వారా గ్రహణ ప్రతికూల ప్రభావాలను తగ్గించవచ్చు. జ్యోతిషశాస్త్రంలో చంద్రగ్రహణాన్ని అశుభంగా భావిస్తారు. చంద్రగ్రహణం సమయంలో ప్రతికూల శక్తి ప్రభావం పెరుగుతుందని నమ్ముతారు. చంద్రగ్రహణం సమయంలో శివుడిని పూజించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. భోలేనాథ్‌ను పూజించడం ద్వారా మనుషులపై చంద్ర గ్రహణ ప్రభావం తగ్గుతుంది.

పంచాంగం ప్రకారం 2025 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం మార్చి 14వ తేదీ, శుక్రవారం నాడు ఏర్పడనుంది. భారత కాలమానం ప్రకారం మార్చి 14న ఉదయం 9:27 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. ఈ చంద్రగ్రహణం 6 గంటల 3 నిమిషాల పాటు కొనసాగుతుంది. ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు. కనుక గ్రహణ సూతక కాలం భారతదేశంలో చెల్లదు. ఈ గ్రహణం ఆస్ట్రేలియా, యూరప్, ఆఫ్రికాలోని ఎక్కువ భాగం, అట్లాంటిక్ ఆర్కిటిక్ మహాసముద్రం, తూర్పు ఆసియా మొదలైన ప్రాంతాలలో కనిపిస్తుంది.

చంద్రగ్రహణానికి ముందు ఈ పని చేయండి

  1. చంద్రగ్రహణ సమయంలో శివుడిని పూజించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. శివుడు చంద్రునికి అధిపతిగా భావిస్తారు. కనుక ఆయనను పూజించడం వల్ల చంద్రగ్రహణం ప్రతికూల ప్రభావాలను నివారించవచ్చు.
  2. చంద్రగ్రహణ సమయంలో చంద్రుడికి సంబంధించిన మంత్రాన్ని జపించడం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు “ఓం సోమ సోమాయ నమః” అనే మంత్రాన్ని జపించవచ్చు.
  3. ఇవి కూడా చదవండి
  4. చంద్రగ్రహణ సమయంలో దానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. పేదలకు, అవసరం అయిన వ్యక్తులకు తెల్లని బట్టలు, బియ్యం, పాలు లేదా వెండిని దానం చేయడం శుభప్రదం.
  5. చంద్రగ్రహణానికి ముందు తులసి దళాలను తెంపుకుని పక్కన పెట్టుకోండి. గ్రహణం సమయంలో వాటిని ఆహారం, నీటిలో కలిపి ఉపయోగించండి.
  6. గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇది గ్రహణ ప్రభావాన్ని తగ్గిస్తుంది.

ఏ రాశుల వారికి చెడు జరుగుతుందంటే..

  1. చంద్రగ్రహణం అన్ని రాశులపైన ప్రభావితం చూపిస్తుంది. అయితే కొన్ని రాశిలపై ఈ గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ రాశులకు చెందిన వ్యక్తులు అంటే.. ఆయా రాశుల్లో జన్మించిన వ్యక్తులు చంద్రగ్రహణానికి ముందు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.
  2. వృషభ రాశి వారు చంద్రగ్రహణ సమయంలో శివుడిని పూజించి, చంద్ర మంత్రాన్ని జపించాలి. దీనితో ఈ రాశికి చెందిన వ్యక్తులు చేపట్టిన పనులు ఆగి పొతే ఆ పని త్వరగా పూర్తి కావడం ప్రారంభమవుతుంది. వీరు జీవితంలో ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు.
  3. కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులు చంద్రగ్రహణ సమయంలో దానం చేయాలి. ఈ సమయంలో తులసి దళాలను ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల ఈ రాశికి చెందిన వ్యక్తులపై గ్రహణ ప్రభావం తగ్గుతుంది.
  4. వృశ్చిక రాశి వారు చంద్రగ్రహణ సమయంలో హనుమాన్ చాలీసా పారాయణం చేసి పేదలకు అన్నం పెట్టాలి. దీనితో వీరి సమస్యలు త్వరలో పరిష్కారం కావడం ప్రారంభమవుతుంది.
  5. మీన రాశి వారు చంద్రగ్రహణ సమయంలో విష్ణువును పూజించి పసుపు రంగు వస్త్రాలను దానం చేయాలి. ఇలా చేయడం వల్ల, విష్ణువు అనుగ్రహం కలుగుతుంది. ఈ రాశికి చెందిన వ్యక్తుల జీవితంలో ఎప్పుడూ ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అంతేకాదు సమస్యలు తొలగుతాయి.

ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి

చంద్రగ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఇంటి నుండి బయటకు వెళ్లకూడదు. చంద్రగ్రహణ సమయంలో ఆహారం, నీరు తీసుకోకూడదు. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. చంద్రగ్రహణం అనేది ఒక సహజ ఖగోళ దృగ్విషయం అని.. దీని ప్రభావాలు అందరిపై భిన్నంగా ఉంటాయని ప్రజలు గమనించడం ముఖ్యం. మీకు ఏవైనా సందేహాలు ఉంటే జ్యోతిష్యుడిని సంప్రదించవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు