చంద్ర సంచారంతో ఆ రాశుల వారికి సిరి సంపదలు..! వారికి లక్ష్మీ కటాక్షం పక్కా..!
ఈ నెల 23 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు చంద్రుడు తన ఉచ్ఛ, మిత్ర, స్వక్షేత్రాలైన వృషభం, మిథునం, కర్కాటకం, సింహ రాశుల్లో సంచారం చేయడం జరుగుతుంది. ఈ రాశుల్లో సంచారం చేస్తున్నప్పుడు చంద్రుడు సాధారణంగా శుభ ఫలితాలను ఎక్కువగా ఇస్తాడు. మనసులోని కోరికలు నెరవేరుస్తాడు. మనశ్శాంతిని కలిగిస్తాడు. ప్రశాంత జీవితాన్ని అందిస్తాడు. అన్నిటికన్నా ముఖ్యంగా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది.
ఈ నెల 23 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు చంద్రుడు తన ఉచ్ఛ, మిత్ర, స్వక్షేత్రాలైన వృషభం, మిథునం, కర్కాటకం, సింహ రాశుల్లో సంచారం చేయడం జరుగుతుంది. ఈ రాశుల్లో సంచారం చేస్తున్నప్పుడు చంద్రుడు సాధారణంగా శుభ ఫలితాలను ఎక్కువగా ఇస్తాడు. మనసులోని కోరికలు నెరవేరుస్తాడు. మనశ్శాంతిని కలిగిస్తాడు. ప్రశాంత జీవితాన్ని అందిస్తాడు. అన్నిటికన్నా ముఖ్యంగా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ప్రస్తుత చంద్ర సంచారం వల్ల ఈ ఫలితాలన్నీ మేషం, వృషభం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకర రాశులకు కలుగుతాయి.
- మేషం: ఈ రాశికి చతుర్థాదిపతి అయిన చంద్రుడు అనుకూల స్థానాల్లో సంచారం చేస్తున్నందువల్ల ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. మనసులోని కోరికలు, ఆశలు, ఆశయాలు చాలా వరకు నెర వేరుతాయి. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ఇంట్లో కొత్త సౌకర్యాలను అమర్చుకుంటారు. విలువైన ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. వ్యక్తిగత, కుటుంబ, ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. మనశ్శాంతికి లోటుండదు.
- వృషభం: ఈ రాశికి తృతీయాధిపతి అయిన చంద్రుడు అనుకూలంగా మారుతున్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. కొత్త ప్రయత్నాలకు ఇది బాగా అనుకూలమైన సమయం. కొద్ది శ్రమతో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో ఆశించిన స్థాయి పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రయాణాల వల్ల బాగా లాభం ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది.
- కర్కాటకం: రాశ్యధిపతి చంద్రుడు శుభ స్థానాల్లో సంచారం చేస్తున్నందువల్ల శుభ యోగాలు అనుభవానికి వస్తాయి. ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరుగుతుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ సఫలం అవు తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా వృద్ధి చెందుతుంది. సంపన్న కుటుంబంలో పెళ్లి సంబం ధం కుదురుతుంది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఆరోగ్యం బాగా కుదుట పడుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి.
- తుల: ఈ రాశికి దశమాధిపతి అయిన చంద్రుడు బాగా అనుకూలంగా మారుతున్నందువల్ల వృత్తి, ఉద్యో గాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ అవకా శాలు అందివస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్యాలు, మొండి వ్యాధుల నుంచి సైతం ఉపశమనం లభి స్తుంది. వ్యాపారాల్లో లాభాలు విపరీతంగా పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. మాతృమూలక ధన లాభం ఉంటుంది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది.
- వృశ్చికం: ఈ రాశికి భాగ్య స్థానాధిపతి అయిన చంద్రుడు బాగా బలపడుతున్నందువల్ల ఆకస్మిక ధన లాభా నికి బాగా అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలు, ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలన్నీ విజయవంతం అవుతాయి. బంధువర్గానికి చెందిన సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదు రుతుంది. విదేశాలకు వెళ్లడానికి అవకాశాలు అంది వస్తాయి. నిరుద్యోగుల కలలు సాకారం అవు తాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. తీర్థయాత్రలు, విహార యాత్రలకు అవకాశం ఉంది.
- మకరం: ఈ రాశికి సప్తమ స్థానాధిపతి అయిన చంద్రుడు బాగా అనుకూలంగా మారుతున్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సిద్ధిస్తుంది. సంపద బాగా పెరిగే అవకాశం ఉంది. విలాస జీవితం గడుపుతారు. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరుగు తుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం బాగా మెరుగు పడు తుంది. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతాయి. శుభవార్తలు వింటారు.